విల‌నీగా అనుష్క సిద్దం..ఛాన్స్ తీసుకునేది ఎవ‌రు?

స్వీటీ అనుష్క ను వెండి తెర‌పై హీరోయిన్ గా చూసాం. క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల్లో తానేంటే రుజువు చేసింది.;

Update: 2025-09-04 14:30 GMT

స్వీటీ అనుష్క ను వెండి తెర‌పై హీరోయిన్ గా చూసాం. క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల్లో తానేంటే రుజువు చేసింది. 'అరుంధ‌రి', 'భాగ‌మ‌తి' లాంటి చిత్రాల్లో సోలో నాయిక‌గా స‌త్తా చాట‌డం చూసాం. `బాహుబ‌లి` ప్రాంచైజీలో యువ‌రాణిగా అల‌రించింది. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలంద‌ర్నీ క‌వ‌ర్ చేసింది. చిరంజీవి, బాల‌య్య‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ప్ప అందరితో న‌టించింది. క‌మ‌ర్శియ‌ల్ హీరోయిన్ గా అనుష్క కొత్త‌గా సాధించాల్సింది ఇక్క‌డేం లేదు. వైవిథ్య‌మైన చిత్రాలు..పాత్ర‌ల‌తో ప్ర‌యోగాలు చేయ‌డం త‌ప్ప‌! అంత‌కు మించి స్వీటీ తెపై చెప్పాల్సింది ఏమీ లేదు.

రొటీన్ పాత్ర‌ల‌తో బోర్ ఫీలైన న‌టి:

అందుకే త‌న‌లో రెండ‌వ కోణాన్ని తెర‌పైకి తేవ‌డానికి తాను కూడా సిద్దంగా ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. హీరోయిన్ పాత్ర‌లు పోషించి తాను కూడా బోర్ ఫీల‌వుతుంది. అందుకే వాటికి భిన్నంగా ఉండే ప్ర‌తి నాయిక పాత్ర‌లు పోషించాల‌ని ఉంద‌న్న విష‌యాన్ని ఓపెన్ గా షేర్ చేసింది. అవును ఈ సంగ‌తి తానే స్వ‌యంగా రివీల్ చేసింది. వెండి తెర‌పై విల‌నీగా అల‌రించాల‌ని ఉంద‌ని మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట పెట్టింది. ఈ త‌ర‌హా పాత్ర‌ల‌కు అనుష్క అన్నిర‌కాలుగా అర్హురాలే. ఎత్తుకు ఎత్తు..బ‌రువుకు బ‌రువు గ‌ల న‌టి.

వాళ్లిద్ద‌రి త‌ర్వాత ఆమె:

ప్రతి నాయిక ఆహార్యంలోనూ అదిరిపోతుంది. ఆమె ఇమేజ్ కు త‌గ్గ విల‌నీ పాత్ర ప‌డిందంటే? అందులో అనుష్క మంచి న‌టిగా ఆరితేరుతుంది. అస‌లే టాలీవుడ్ లో విల‌న్ల కొర‌త ఉండ‌నే ఉంది. అందులోనూ లేడీ విల‌న్లు అంటే ఒక్క‌రూ కూడా క‌నిపించ‌ద‌రు. అనుష్క లాంటి నటి విల‌న్ అయితే చాలా మందిని రీప్లేస్ చేస్తుంది. మేల్ విల‌న్స్ ను చూసి చూసి తెలుగు ప్రేక్ష‌కులు కూడా బోర్ ఫీల‌వుతున్నారు. రమ్య కృష్ణ త‌ర్వాత నీలాంబ‌రి రేంజ్ లో ఎవ‌రూ స‌క్సెస్ అవ్వ‌లేదు.

ఎవ‌రు తీసుకుంటారా ఛాన్స్:

ఆ తర్వాత కొంత మంది న‌టీమ‌ణులు నెగిటివ్ పాత్ర‌లు పోషించారు గానీ పెద్ద‌గా పండ‌లేదు. ర‌మ్య‌కృష్ణ త‌ర్వాత త‌మిళ న‌టి వ‌ర‌ల‌క్ష్మి కొన్ని చిత్రాల్లో ది బెస్ట్ పెర్పార్ మెన్స్ తో అద‌ర గొట్టింది. వీళ్లిద్ద‌రి రేంజ్ ను మించి పెర్పార్మ‌న్స్ ఇవ్వ‌గ‌ల‌దు అనుష్క‌. స్వీటీకి మాత్ర‌మే ఆ ఛాన్స్ ఉంది. స‌క్స‌స్ అయితే అనుష్క కెరీర్ కూడా కొత్త ట‌ర్నింగ్ తీసుకుంటుంది. హీరోయిన్ ని మంచి బిజీ అవుతుంది. సౌత్ లోనే కాదు బాలీ వుడ్ కూడా పిలిచి అవ‌కాశాలిస్తుంది. మ‌రి త‌న‌లో ఉన్న ఆ విల‌నీని త‌ట్టి లేపే డైరెక్ట‌ర్ ఎవ‌ర‌వుతారో చూడాలి.

Tags:    

Similar News