అనుష్క 'ఘాటి' నుంచి ఓ గుడ్ న్యూస్

వెండితెరకు అందరి కంటే కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్న సీనియర్ హీరోయిన్స్ లలో అనుష్క పేరు టాప్ లిస్ట్ లో ఉంది.;

Update: 2025-06-02 11:48 GMT

వెండితెరకు అందరి కంటే కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్న సీనియర్ హీరోయిన్స్ లలో అనుష్క పేరు టాప్ లిస్ట్ లో ఉంది. చాలా కాలంగా పాత్రల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు అనుష్క శెట్టి 'ఘాటి' సినిమాతో కచ్చితంగా ఆకర్షణీయమైన అనుభూతి ఇవ్వబోతోంది. కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇది వీరిద్దరి కలయికలో ‘వేదం’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.


ఈ చిత్రంలో అనుష్క పాత్ర చాలా పవర్ఫుల్ గానూ, వైవిధ్యభరితంగానూ ఉండబోతోంది. గ్లింప్స్‌ లో లుక్‌ చూసినవాళ్లు ఆమె క్యారెక్టర్‌తో పాటు సినిమా కోసం కూడ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విక్రమ్ ప్రభు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది కేవలం ప్రతీకారం కోసం నడిచే కథే కాదు, మానవ విలువల క్షీణత, కడుపు నింపడానికి చేసే పోరాటాన్ని చూపించే కథ అంటున్నారు మేకర్స్.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. జూలై 11న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు. విడుదల పోస్టర్‌ లో ప్రధాన పాత్రధారులు తమ భుజాలపై బరువులు మోస్తూ, నీటిలో నడుస్తూ వెళ్తున్న దృశ్యం ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది సినిమాకు సంబంధించిన కంటెంట్ ను హైలెట్ చేస్తోంది. మాస్ ఎంటర్టైనర్ కాదు కానీ, ఈ కథ హృదయాలను తాకేలా ఉంటుందట.

‘ఘాటి’ అనే టైటిల్‌ కేవలం పేరుకే కాదు, కథలోని ప్రతి మూమెంట్‌ కూడా అదే స్థాయిలో ఆసక్తిగా ఉండబోతుందని సమాచారం. నిర్మాతలు UV క్రియేషన్స్‌, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్‌ కలిసి ఈ సినిమాను అత్యున్నత స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే టెక్నికల్‌గా, విజువల్స్ పరంగా మంచి బజ్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని ఇవ్వనుంది.

దర్శకుడు క్రిష్ ఈ చిత్రంతో తన కెరీర్‌లో మరో బిగ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. వరుసగా డిఫరెంట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న క్రిష్, ఈసారి అనుష్కను వినూత్నంగా చూపిస్తూ ప్రేక్షకులను శక్తివంతమైన కథలోకి తీసుకెళ్లనున్నాడు. మరి ఈ సినిమా అతనికి ఏ స్థాయిలో విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News