అనుష్క ఒక్క పోస్ట్... అప్పులు పోయి భారీ లాభాలు!
పూర్తి వివరాల్లోకి వెళ్తే... ముంబైలోని ఢిల్లీ సే అనే రెస్టారెంట్‌ను జస్పాల్ సింగ్ ఖల్సా, మహీందర్ సింగ్ ఖల్సా అనే సోదరులు 2021లో ప్రారంభించారు.
ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో ప్రమోషన్‌కి భారీ డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు టీవీల్లో ఇచ్చే యాడ్స్ కోసం కంపెనీలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయి. కానీ ఇప్పుడు అక్కడ ఖర్చు తగ్గించుకుని సోషల్ మీడియా ద్వారా ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. ఏదైనా వస్తువు లేదా సేవకు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే వెంటనే రీచ్ అవుతుంది, అంతే కాకుండా ఎక్కువ మందికి వ్యాపారం చేరువ అవుతుందని అంటున్నారు. అది అక్షరాల నిజం అని చాలా వ్యాపారం వృద్ధి కనిపిస్తుంది. బాలీవుడ్ హీరోయిన్, విరాట్ కోహ్లీ భార్య అయిన అనుష్క శర్మ సోషల్ మీడియాలో నాలుగు ఏళ్ల క్రితం చేసిన ఒక పోస్ట్ ఒక వ్యాపారం రూపురేపలను మార్చేసింది. మూసి వేయాలి అనుకున్న రెస్టారెంట్ ఏకంగా కోట్ల రూపాయల లాభాలను దక్కించుకునే స్థాయికి వెళ్లింది. అనుష్క శర్మ చేసిన ఒకే ఒక్క ఇన్‌స్టా పోస్ట్ అద్భుతం సృష్టించింది.
విరాట్ కోహ్లీ కోసం అనుష్క శర్మ...
పూర్తి వివరాల్లోకి వెళ్తే... ముంబైలోని ఢిల్లీ సే అనే రెస్టారెంట్‌ను జస్పాల్ సింగ్ ఖల్సా, మహీందర్ సింగ్ ఖల్సా అనే సోదరులు 2021లో ప్రారంభించారు. ఇది ఢిల్లీ స్టైల్ చోలే భటూరే ను ముంబై వాసులకు అందించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రారంభించిన ఏడాదిలోనే యజమానులకు దాదాపు రూ.18 లక్షలు అప్పు అయింది. దాన్ని మెయింటెన్స్ భారంగా మారింది. ఆ సమయంలో కమెడియన్ అభిషేక్ ఉపమన్యు ఢిల్లీ సే లో చోలే భటూరే తిని బాగుంది అంటూ సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చాడు. అభిషేక్ ఉపమన్యు ఇచ్చిన రివ్యూ ను చూసిన అనుష్క శర్మ తన భర్త విరాట్ కోహ్లీ కోసం 2022, అక్టోబర్ 5న రెండు ప్లేట్ల చోలే భటూరేను ఆర్డర్ చేయడం జరిగింది. అనుష్క ఆ ఆర్డర్ అందుకుని రుచి చూసిన తర్వాత ఫిదా అయిందట. అదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
ఢిల్లీ జైసే చోలే భటూరే...
అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్దమ్ ఢిల్లీ జైసే చోలే భటూరే లభించింది అంటూ 'ఢిల్లీ సే' రెస్టారెంట్‌ను ట్యాగ్ చేసింది. అంతే కాకుండా తనకు ఈ రెస్టారెంట్‌ను సిఫార్స్ చేసినందుకు గాను కమెడియన్ అభిషేక్ ఉపమన్యుకు కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేసింది. అనుష్క సోషల్ మీడియా ఫాలోవర్స్ మొత్తం ఢిల్లీ సే రెస్టారెంట్ గురించి తెలియడంతో ఒక్కసారిగా బిజినెస్ పెరిగింది. 2022లో అప్పులతో మూసి వేయాలి అనుకున్న రెస్టారెంట్ కేవలం అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో లాభాల్లో నడుస్తోంది. ముంబైలో ప్రస్తుతం ఢిల్లీ సే ఏకంగా నాలుగు ఔట్ లెట్స్ ను ఏర్పాటు చేసింది. ముందు ముందు ఈ ఔట్ లెట్స్ సంఖ్య భారీగా పెంచడం జరుగుతుందని, అంతే కాకుండా దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసి ఢిల్లీ స్టైల్ చోలే భటూరే ను రుచి చూపిస్తామని యజమానులు అంటున్నారు.
ముంబైలోని ఢిల్లీ సే రెస్టారెంట్..
ఢిల్లీ సే రెస్టారెంట్ ఇప్పుడు కోట్ల రూపాయల టర్నోవర్ చేయడం వెనుక కచ్చితంగా అనుష్క శర్మ పోస్ట్ ఉంది అనడంలో సందేహం లేదు. దాంతో చాలా మంది ఈ రెస్టారెంట్‌లో అనుష్క శర్మకు వాటా ఉందని, ఆమెను యజమానులు భాగస్వామిగా చేర్చుకున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే యజమానాలు మాత్రం ఢిల్లీ సే రెస్టారెంట్‌లో అనుష్క శర్మకు వాటా ఉందంటూ వస్తున్న వార్తలను ఎప్పటికప్పుడు కండిస్తూ వస్తున్నారు. అయితే ఆమెకు రాయల్టీ ఏమైనా ఇచ్చారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఆమె వల్లే నష్టాల్లో ఉన్న వ్యాపారం కోట్ల రూపాయల వ్యాపారంగా మారింది కనుక ఆమెకు రాయల్టీ ఇవ్వడంలో తప్పు లేదని, అదే సరైన పద్ధతి అంటూ చాలా మంది సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనుష్క శర్మ ఎప్పుడూ ఢిల్లీ సే రెస్టారెంట్ గురించి మాట్లాడలేదు.