ఘాటి ఫలితం.. వేళ్లన్ని ఆమె వైపే..?

స్వీటీ అనుష్క ఫిమేల్ సెంట్రిక్ సినిమా చేస్తే అది బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంటుంది. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి ఇలా అనుష్క లీడ్ రోల్ లో వచ్చిన ప్రతి సినిమా సంథింగ్ స్పెషల్ అనిపించుకుంది.;

Update: 2025-09-08 15:30 GMT

స్వీటీ అనుష్క ఫిమేల్ సెంట్రిక్ సినిమా చేస్తే అది బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంటుంది. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి ఇలా అనుష్క లీడ్ రోల్ లో వచ్చిన ప్రతి సినిమా సంథింగ్ స్పెషల్ అనిపించుకుంది. కమర్షియల్ గా కూడా ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచాయి. ఐతే అదే క్రమంలో అనుష్క ఘాటి అంటూ మరో ప్రయత్నం చేసింది. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఘాటి సినిమా సెప్టెంబర్ 5న రిలీజై బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఘాటి కథ చెప్పాలన్న ఉద్దేశ్యం మంచిదే అయినా సినిమాలో ఎమోషన్ మిస్ అవ్వడం వల్ల ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు.

హీరోయిన్ అనుష్క వైపే తప్పు..

ఐతే ఘాటి సినిమా ఫలితం తేలిన తర్వాత వేళ్లన్నీ కూడా హీరోయిన్ అనుష్క వైపే తప్పు చూపిస్తున్నాయి. అనుష్క క్యాలిబర్ కి తగిన కథ కాదని అందరు అంటున్నా. క్రిష్ కూడా అనుష్కని సరిగా వాడుకోలేదన్న టాక్ ఉంది. ఐతే ఈమధ్య సినిమాలు అవి స్టార్ హీరో ప్రాజెక్ట్స్ అయినా కూడా బీభత్సమైన ప్రమోషన్స్ చేస్తేనే ఆడియన్స్ దృష్టిలో పడుతున్నాయి. ఏదో నామ మాత్రం ప్రమోషన్స్ చేస్తే జనాలు పట్టించుకోవట్లేదు. ఘాటి సినిమా విషయంలో అనుష్క అసలు ప్రమోషన్స్ కు రాలేదు.

క్రిష్ కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాడు.. ఆ తర్వాత జగపతి బాబుతో ఒక స్పెషల్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అంతేతప్ప అనుష్కతో కనీసం ఒక ఆఫ్ లైన్ ఇంటర్వ్యూ కూడా చేయించలేదు. సినిమాలో కంటెంట్ ఎంత ఉంది అన్నది పక్కన పెడితే సినిమాకు ఒక రేంజ్ ప్రమోషన్స్ చేయిస్తేనే సినిమాకు కొంత బజ్ క్రియేట్ అవుతుంది. అందుకే అనుష్క సినిమాకు ప్రమోషన్స్ చేయకపోవడం వల్లే సినిమా ఇంత దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఆడియన్స్ ను థియేటర్ల దాకా రప్పించడానికే..

అనుష్క బయటకు వచ్చి ప్రమోషన్స్ చేసినట్టైతే కొంతలో కొంత కలెక్షన్స్ బాగుండేవి. ఐతే ఆడియన్స్ ను థియేటర్ల దాకా రప్పించడానికే ప్రస్తుతం దర్శక నిర్మాతలు తెగ ఇబ్బందులు పడుతున్నారు. కాస్త అటు ఇటుగా టాక్ వచ్చిన సినిమాను ఓటీటీలో చూసేద్దామని డిసైడ్ అవుతున్నాడు. మరి అలాంటి టైం లో ఎలాంటి ప్రమోషన్స్ చేయకుండా సినిమా వదిలితే ఇలాంటి రిజల్ట్ నే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఐతే క్రిష్ మాత్రం తెర మీద అనుష్క అదరగొట్టేస్తుంది కాబట్టి ప్రమోషన్స్ అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

అనుష్క కూడా నెక్స్ట్ సినిమాలో ఇలాంటి మిస్టేక్ చేసే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈమధ్య హేమా హేమీలే సినీమా మొదలు పెట్టిన దగ్గర నుంచి ప్రమోషన్స్ చేస్తూ సత్తా చాటుతున్నారు. సో అనుష్క ఫ్యూచర్ లో ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటే బెటర్ అని అంటున్నారు.

Tags:    

Similar News