అనుష్క‌కు పోటీగా ర‌ష్మిక దిగుతోందా?

ర‌ష్మికా మంద‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో `ది గ‌ర్ల్ ప్రెండ్` చిత్రం తెర‌కె క్కుతోన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-07-24 01:30 GMT

స్వీటీ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన `ఘాటీ` ఎన్నో వాయిదాల ప‌ర్వం అనంత‌రం సెప్టెంబ‌ర్ 6న రిలీజ్ కు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈనెల‌లోనే రిలీజ్ కావాల్సిన సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో జాప్యం కార‌ణంగా మ‌రోసారి వాయిదా ప‌డింది. ఈసారి మాత్రం ఎలాంటి గంద‌ర‌గోళానికి గురి కాకుండా ఓ నెల రోజులు స‌మ యం ఎక్కువ‌గానే తీసుకున్నారు. ఆగ‌స్టు ముగింపు క‌ల్లా అన్ని ప‌నులు పూర్త‌యితే అనుకున్న తేదీకి రిలీజ్ చేయోచ్చు అన్న ఆలోచ‌న‌తో ఇంత లాంగ్ గ్యాప్ తీసుకున్నారు.

సెప్టెంబ‌ర్ 6న మాత్రం ప‌క్కాగా రిలీజ్ అవ్వ‌డం ఖాయ‌మంటున్నారు. ప్ర‌చారం ప‌నులు కూడా ఆగ‌స్టు మిడ్ నుంచే ప్రారంభిం చాల‌ని చూస్తున్నారుట‌. భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఆ వేడుక‌కు పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ను గెస్ట్ గా హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. ఇలా సినిమాకు అన్ని వైపులా పాజిటివ్ బ‌జ్ తీసుకొస్తున్నారు. అయితే స‌రిగ్గా `ఘాటీ`కి ఒక్క రోజు ముందుగానే స్వీటీకి పోటీగా నేష‌న‌ల్ క్ర‌ష్ బ‌రిలోకి దిగుతోంది? అన్న వార్త ఇప్పుడు సంచ‌ల‌నంగా మారుతోంది.

ర‌ష్మికా మంద‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో `ది గ‌ర్ల్ ప్రెండ్` చిత్రం తెర‌కె క్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో అంచ‌నాలు పీక్స్ కు చేరాయి. ర‌ష్మిక చేస్తోన్న స‌రికొత్త ప్ర‌యోగం ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌డం ఖాయ‌మంటున్నారు. ర‌ష్మిక‌కు పాన్ ఇండియాలో క్రేజ్ ఉంది. అమ్మ‌డికి అన్ని భాష‌ల్లోనూ అభిమా నులు న్నారు. ఈ నేప‌థ్యంలో ర‌ష్మిక సినిమా రిలీజ్ అయితే ఘాటీకి గ‌ట్టి పోటీ త‌ప్ప‌దేనే సంకేతాలు అందుతున్నాయి.

అనుష్క ఇప్ప‌టికే స‌క్సెస్ ఫాం కోల్పోయింది. నత్త‌న‌డ‌క‌న సినిమాలు చేస్తోంది. సినిమాల‌పై ఏమాత్రం సీరియ‌స్ నెస్ క‌నిపించ‌లేదు. ర‌ష్మిక ప్ర‌యాణం అందుకు భిన్నంగా సాగుతుంది. ఈనేప‌థ్యంలో న‌టిగా స్వీటీ సీనియ‌ర్ అయినా? ర‌ష్మిక ధాడిని త‌ట్టుకుంటుందా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ రెండు రిలీజ్ ల‌కు సంబంధించి అధికారికంగా వెల్ల‌డి కావాల్సి ఉంది.

Tags:    

Similar News