నాపై మాద‌క ద్ర‌వ్యాల బానిస అని ముద్ర వేసారు

బాలీవుడ్ ని అస‌హ్యించుకుని బెంగ‌ళూరుకు వచ్చేసాడు అనురాగ్ క‌శ్య‌ప్. ఇక్క‌డి నుంచి సౌత్ సినిమాల్లో త‌న ప్ర‌య‌త్నాల‌ను ప్రారంభించాడు.;

Update: 2025-11-02 23:30 GMT

బాలీవుడ్ ని అస‌హ్యించుకుని బెంగ‌ళూరుకు వచ్చేసాడు అనురాగ్ క‌శ్య‌ప్. ఇక్క‌డి నుంచి సౌత్ సినిమాల్లో త‌న ప్ర‌య‌త్నాల‌ను ప్రారంభించాడు. న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం సాగిస్తున్నాడు. వీలున్న‌ప్పుడ‌ల్లా మంచి పాత్ర‌లు త‌న‌ను వెతుక్కుంటూ వ‌స్తే న‌టిస్తున్నాడు. ద‌ర్శ‌కుడిగా త‌న అభిరుచిని కొన‌సాగిస్తున్నాడు.

అయితే అత‌డు త‌న‌ను ప్ర‌జ‌లు ఎలా కించ‌ప‌రిచారో బ‌హిరంగంగా చెప్పేందుకు ఏనాడూ వెన‌కాడ‌లేదు. త‌న ఫ్లాప్ సినిమాల గురించి లేదా త‌న రూపం గురించి అత‌డు ప్ర‌జ‌లు ఏమ‌నుకున్నారో ఓపెన్ గా మాట్లాడ‌తారు. త‌న‌ను మాద‌క ద్ర‌వ్యాల బానిస అని ముద్ర వేసార‌ని అనురాగ్ అన్నారు. నా కళ్ళు పెద్దవి.. ఇవి సరైన‌వి కాదా? అన్ని సమస్యలూ వాటి వల్లనే. అందుకే ప్రజలు నన్ను పాట్‌హెడ్ లేదా డ్రగ్ బానిస అని పిలుస్తారు. నేను ఈ కళ్ళతో పుట్టడం నా తప్పు కాదు అన్నాడు.

అనురాగ్ త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేసిన వారి గురించి మాట్లాడుతూనే, వృత్తిగ‌తంగాను వెంటాడిన విష‌యాల‌ను ప్ర‌స్థావించాడు. అత‌డు తెర‌కెక్కించి చాలా సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన విజ‌యాలు సాధించ‌లేద‌నే విమ‌ర్శ‌ల్ని ప్ర‌స్థావించాడు. క‌మ‌ర్షియ‌ల్ గా ఎప్పుడూ పెద్ద హిట్టు కొట్ట‌లేద‌ని కూడా త‌న‌ను విమ‌ర్శించిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నాడు. అయితే తాను తీసిన సినిమాలేవీ...పెద్ద న‌ష్టాల‌ను తేలేద‌ని అత‌డు వివ‌ర‌ణ ఇచ్చాడు. నిశాంచి కూడా ఆశించిన వసూళ్లు తేలేద‌ని అన్న వారికి వివ‌ర‌ణ ఇస్తూ.. నా సినిమా ఒక్క టికెట్ కూడా అమ్ముడవకపోయినా, వాటి నష్టం ప్రతి సంవత్సరం 80 శాతం ఫ్లాప్ సినిమాల కంటే తక్కువేన‌ని అన్నాడు.

అయితే క‌ల్ట్ క్లాసిక్ `గ్యాంగ్స్ ఆప్ వాసేపూర్` త‌న‌కు న‌చ్చ‌ద‌ని అనురాగ్ అన్నారు. నాకు వాస్సేపూర్ అంటే తీవ్ర ద్వేషం ఉంది. ఎవరైనా నన్ను `వాస్సేపూర్ వ్యక్తి` అని పిలిచినప్పుడల్లా నా షూ తీసి కొట్టాలనిపిస్తుంద‌ని అన్నాడు.

మీరు నా సినిమా ఆడే హాళ్ల‌కు సినిమా చూడ‌టానికి వెళ్లి ఉంటే నా ఇల్లు నడిచేది.. కానీ మీ వల్ల నా ఇల్లు నడవడం లేదు అని అన్నాడు. అనురాగ్ తెరకెక్కించిన `నిశాంచి` ప్రైమ్ వీడియోలో అద్దెకు అందుబాటులో ఉంది. ఈ సినిమాకి రెండో భాగాన్ని వ‌చ్చే ఏడాది ప్రారంభంలో విడుద‌ల చేస్తారు.

Tags:    

Similar News