అనుప‌మ పారితోషికం డ‌బుల్

ఇటీవలి బాక్సాఫీస్ విజయాల దృష్ట్యా అనుప‌మ ఆలోచ‌న మారింద‌ని, న‌టిస్తున్న‌ ప్రతి చిత్రానికి తన పారితోషికాన్ని రెట్టింపు చేసిందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. గతంలో ఒక్కో సినిమాకు ల‌క్ష‌ల్లో అందుకునేది.

Update: 2024-05-10 02:30 GMT

ఇటీవ‌ల అనుపమ పరమేశ్వరన్ గేమ్ మారింద‌ని స్ప‌ష్ఠంగా అర్థ‌మ‌వుతోంది. ఈ క్యూట్ బ్యూటీ తన గేమ్‌లో ఉత్త‌మ‌స్థానంలో ఉంది. మలయాళ చిత్రం 'ప్రేమమ్‌'తో తెరంగేట్రం చేసిన ఈ క్యూటీ గత 9 సంవత్సరాలుగా అన్ని సౌతిండియా చిత్రాలలో కనిపించింది. గత రెండు తెలుగు చిత్రాలైన కార్తికేయ 2 - టిల్లు స్క్వేర్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లుగా నిలిచాయి. అనుప‌మ‌ నటించిన తమిళ చిత్రం సైరన్ కూడా విజయవంతమైంది. కార్తికేయ 2 తర్వాత అనుపమ మరోసారి నిఖిల్ సిద్ధార్థ్‌తో 18 పేజీస్ కోసం జతకట్టింది. ఇది సానుకూల సమీక్షలను అందుకుంది. ఈ విజయాలతో అనుపమ పరమేశ్వరన్ ఫేజ్ మారింది.

తాజాగా టిల్లు స్క్వేర్ ఘ‌న‌విజయంతో అనుపమ స్థాయి మ‌రింత పెరిగింది. టిల్లు గాని గాళ్ ఫ్రెండ్ పాత్ర‌లో అనుపమ అద్భుతంగా న‌టించింది. మునుప‌టితో పోలిస్తే ఈ బ్యూటీలో గ్లామ‌ర‌స్ కంటెంట్ ఎలివేష‌న్ అద‌న‌పు హంగును జోడించింది. ఇటీవలి బాక్సాఫీస్ విజయాల దృష్ట్యా అనుప‌మ ఆలోచ‌న మారింద‌ని, న‌టిస్తున్న‌ ప్రతి చిత్రానికి తన పారితోషికాన్ని రెట్టింపు చేసిందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. గతంలో ఒక్కో సినిమాకు ల‌క్ష‌ల్లో అందుకునేది. ఇప్పుడు ఊహించ‌నంత పెద్ద మొత్తం వసూలు చేస్తోంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. అంతేకాదు.. అనుప‌మ కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా వ‌ర్ధిల్లుతోంది. ఇప్ప‌టికిప్పుడు కొన్ని చెప్పుకోద‌గ్గ చిత్రాల్లో ఈ బ్యూటీ న‌టిస్తోంది. టిల్లు స్క్వేర్ తర్వాత అనుప‌మ స‌న్నివేశాన్ని తెలివిగా ఎన్ క్యాష్ చేస్తోంద‌నేది ఇన్ సైడ్ టాక్‌.

Read more!

ఈ బ్యూటీ హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో త‌దుప‌రి 'ఆక్టోపస్' అనే భారీ సినిమాలో న‌టించ‌నుంది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ గురించి పెద్దగా లీకులు అంద‌లేదు. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో బైసన్ -లాక్‌డౌన్ అనే రెండు ప్రాజెక్ట్‌లు ఇటీవల ప్రకటించారు. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ స‌ర‌స‌న‌ తమిళ చిత్రం బైసన్ లో అనుప‌మ జాక్ పాట్ కొట్టింది. స్పోర్ట్స్ డ్రామా క‌థ‌లో అనుప‌మ పాత్ర‌కు వెయిట్ ఉంద‌ని స‌మాచారం. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌తో స్ట్రీమింగ్ హక్కుల ఒప్పందం పూర్త‌యింద‌ని తెలుస్తోంది. అలాగే 'లాక్ డౌన్' చిత్రానికి ఏఆర్ జీవా దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న 'JSK ట్రూత్ షాల్ ఆల్వేస్ ప్రైవైల్' అనే మలయాళ చిత్రంలోను అనుప‌మ న‌టిస్తోంది. 'పెట్ డిటెక్టివ్' అనే మరో తమిళ చిత్రంలో కూడా కనిపించనుంది. ఈ సినిమాకి సంబంధించిన‌ పూర్తి వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. అనుప‌మ తాజా చిత్రం టిల్లు స్క్వేర్ ప్రస్తుతం Netflixలో ప్రసారం అవుతోంది.

Tags:    

Similar News