నెగిటివిటీ వ‌స్తుంద‌ని తెలిసి కూడా ఆ సినిమా చేశా

తాజాగా కేర‌ళ కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఈ విష‌యంపై మాట్లాడారు. అనుప‌మ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ప‌రదా సినిమా ఆగ‌స్ట్ 22న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.;

Update: 2025-08-20 22:30 GMT

సెల‌బ్రిటీలు ఏం చేసినా సెన్సేష‌నే. హీరోయిన్ల విష‌యంలో ఇది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. వాళ్లు చేసేది ఎక్క‌డైనా స‌రే సిట్యుయేష‌న్స్ తో ప‌న్లేకుండా వారి గురించి ఈజీగా మాట్లాడేస్తుంటారు. వారి క‌ష్టాన్ని చూడ‌కుండా ఎంతో మంది హీరోయిన్ల విష‌యంలో నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అయితే కొంద‌రు ఆ కామెంట్స్ ను ప‌ట్టించుకుని ఫీలైతే, మ‌రికొంద‌రు మాత్రం వాటిని లైట్ తీసుకుంటూ ఉంటారు.

తాజాగా కేర‌ళ కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఈ విష‌యంపై మాట్లాడారు. అనుప‌మ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ప‌రదా సినిమా ఆగ‌స్ట్ 22న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్ర‌వీణ్ కండ్రేగుల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న అనుప‌మ సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న కామెంట్స్ ను ప‌ట్టించుకోవ‌డం మానేసిన‌ట్టు వెల్ల‌డించారు.

మొద‌ట్లో చాలా బాధ‌ప‌డ్డా

కెరీర్ స్టార్టింగ్ లో ప్ర‌తీ పోస్ట్‌కీ వ‌చ్చిన కామెంట్ల‌న్నీ చ‌దివేదాన్న‌ని, అప్ప‌ట్లో నెగిటివ్ కామెంట్స్ విని చాలా బాధ‌ప‌డ్డానని, కానీ ఎక్స్‌పీరియెన్స్ వ‌చ్చాక అవ‌న్నీ చాలా చిన్న విష‌యాల్లా అనిపిస్తున్నాయ‌ని, అందుకే అస‌లు కామెంట్స్ గురించి ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, కేవ‌లం తాను ఏం చెప్పాల‌నుకుంటున్నానో ఆ విషయాన్ని చెప్పి వ‌దిలేస్తున్న‌ట్టు తెలిపారు.

కావాల‌ని హీరోయిన్ల‌ను ఇబ్బంది పెడ‌తారు

టిల్లూ స్క్వేర్ సినిమా రిలీజ్ కు ముందు కూడా త‌నపై, త‌న పాత్ర‌పై నెగిటివ్ కామెంట్స్ చాలా వ‌చ్చాయ‌ని, కానీ సినిమా రిలీజ‌య్యాక త‌న క్యారెక్ట‌ర్ కు, న‌ట‌న‌కు మంచి కాంప్లిమెంట్స్ వ‌చ్చాయ‌ని, సినిమా రిలీజ్ టైమ్ లో నెగిటివిటీ వ‌స్తుంద‌ని తెలిసి కూడా తాను లిల్లీ పాత్ర‌ను చేశాన‌ని, అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేసిన‌ప్పుడే న‌టిగా మ‌రో మెట్టు ఎక్క‌గ‌ల‌మ‌ని, ముందు అనుకున్న‌ట్టే టిల్లూ స్వ్కేర్ ప్ర‌మోష‌న్స్ లో చాలా మంది ఇబ్బందిక‌ర ప్ర‌శ్న‌లు అడిగార‌ని, ఇలాంటి ప్ర‌శ్న‌లు ఎప్పుడూ హీరోయిన్ల‌నే అడుగుతార‌ని, దానికి కార‌ణం హీరోయిన్స్ ను అలాంటి ప్ర‌శ్న‌లు అడిగితేనే వాళ్లకు ఎక్కువ వ్యూస్ వ‌స్తాయి కాబ‌ట్టి అని, ఆ టైమ్ లో అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్లు ఇవ్వ‌డం చాలా క‌ష్టంగా మారింద‌ని అనుప‌మ చెప్పారు.

Tags:    

Similar News