డీ గ్లామరస్ లుక్.. బైసన్ మూవీపై అనుపమ కామెంట్స్!

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఈమధ్య జోరు పెంచింది. ఇటీవలే పరదా, కిష్కింధపురి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ఇప్పుడు బైసన్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.;

Update: 2025-10-28 13:30 GMT

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఈమధ్య జోరు పెంచింది. ఇటీవలే పరదా, కిష్కింధపురి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ఇప్పుడు బైసన్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ చియాన్ వారసుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా వచ్చిన చిత్రం బైసన్. అప్లాస్ ఎంటర్టైన్మెంట్, నీలం స్టూడియోస్ బ్యానర్లపై సమీర్ లాయర్, దీపక్ సీగల్, పా.రంజిత్, అతిధి ఆనంద్ నిర్మించిన ఈ చిత్రానికి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ధ్రువ్ విక్రమ్, పశుపతి, అమీర్, లాల్, అనుపమ పరమేశ్వరన్ , రజీషా విజయన్, అళగం పెరుమాళ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా అక్టోబర్ 17న థియేటర్లలో తమిళ్ భాషలో విడుదలైన ఈ సినిమా.. అక్టోబర్ 24న తెలుగులో కూడా విడుదలైంది.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా షూటింగ్ లొకేషన్ కి సంబంధించిన తన డీ గ్లామరస్ లుక్ కు సంబంధించిన ఫోటోలను అనుపమ ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ.. క్యాప్షన్ గా తన అభిప్రాయాలను పంచుకుంది. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా అనుపమ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో.. డీ గ్లామరస్ లుక్ లో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. సినిమా షూటింగ్ సమయంలో నటీనటులతో తనకు ఏర్పడిన బంధం గురించి చెబుతూ ధన్యవాదాలు తెలియజేసింది.

అందులో.." గత పది రోజుల బైసన్.. నా హృదయం అందుకున్న ప్రేమను ఎలా పట్టుకోవాలో నేర్చుకుంటోంది. కొన్ని సినిమాలు కేవలం ప్రాజెక్టుల వరకే పరిమితం అవుతాయి. కానీ మరికొన్ని ఒక అనుభూతిగా మిగిలిపోతాయి. బైసన్ నాకు అదే అందించింది. జీవితాంతం నన్ను ఆదరించే విధంగా నన్ను ప్రభావితం చేసిన చిత్రం ఇది . ఈ ప్రపంచంలో జీవించడం అదృష్టంగా భావిస్తున్నాను" అంటూ తెలిపింది.

డైరెక్టర్ మారి సెల్వరాజ్ కు ధన్యవాదాలు చెబుతూ.." నన్ను ఈ సినిమా కోసం ఎంచుకున్నందుకు.. ఈ కథలో నాకు చోటు ఇచ్చినందుకు ధన్యవాదాలు.. మీ నమ్మకానికి ఎల్లప్పుడూ నేను కృతజ్ఞతతో ఉంటాను" అంటూ తెలిపింది.

ఈ చిత్ర హీరో ధ్రువ్ విక్రమ్ గురించి మాట్లాడుతూ.." మా సూపర్ స్టార్ ధ్రువ్ విక్రమ్ కి అభినందనలు, ఇంత నిజాయితీ, అభివృద్ధి, ఓర్పుతో మీ ప్రయాణం సాగడం చూసి స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది. ఇది అదృష్టం కాదు.. మీరు మీ ప్రతిభకు అర్హత సాధించారు. అంటూ తెలిపింది.

రజీషా విజయన్ గురించి చెబుతూ.." మీరు సహనటిగా కాకుండా ఒక సోదరిగా నాకు ప్రేమానురాగాలు పంచారు. మీ ప్రేమకు, ఆప్యాయతకు.. ఎప్పటికీ రుణపడి ఉంటాను" అంటూ తెలిపింది. అలాగే ఈ సినిమాలో అవకాశం కల్పించినందుకు అటు నిర్మాతలకు కూడా ధన్యవాదాలు తెలిపింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే సినిమా విడుదలైన సందర్భంగా ఇటు తెలుగులో కూడా విడుదల కావడంతో సినిమా నటీనటులతో తనకున్న అనుబంధాలను పంచుకుంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో లొకేషన్ లో తీసుకున్న ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ అనుపమ ఎలాంటి పాత్రలోనైనా కరెక్ట్ సూట్ అవుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.



Tags:    

Similar News