చిన్న సినిమాకు పోటీగా వెళ్లి దెబ్బతిన్న అనుపమ్ ఖేర్.. ట్విస్ట్ ఏంటంటే?

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్.. ఈ నటుడికి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎందుకంటే ఈయన పేరుకే బాలీవుడ్ నటుడు కానీ దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలలో పేరున్న నటుడు.;

Update: 2025-09-24 11:30 GMT

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్.. ఈ నటుడికి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎందుకంటే ఈయన పేరుకే బాలీవుడ్ నటుడు కానీ దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలలో పేరున్న నటుడు. భాషతో సంబంధం లేకుండా ఈయన ప్రతి ఒక్క ఇండస్ట్రీలో సుపరిచితులు. అలాగే ఈయన తెలుగులో నిఖిల్ నటించిన కార్తికేయ-2 సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.. 40 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈయన తన ఇన్నేళ్ల సినీ కెరియర్లో ఎన్నో ఇబ్బందులను, ఒడిదుడుకులను ఎదుర్కొని సినిమాల్లో రాణించారు. అయితే ఈయన సినిమాల్లో నటుడిగా సక్సెస్ అయ్యారు కానీ డైరెక్టర్ గా ఆయన చేసిన రెండు సినిమాలు కూడా అట్టర్ ప్లాప్ అయ్యాయి.

అందులో ఒకటి ఈ మధ్యనే వచ్చిన 'తన్వి ది గ్రేట్'.. ఈ సినిమా ఎన్నో అంచనాలతో వచ్చింది. భారీ తారాగణంతో తెరకెక్కింది. కానీ చివరికి ఓ బ్లాక్ బస్టర్ సినిమా వల్ల అసలు తన్వీ ది గ్రేట్ సినిమా రిలీజ్ అయింది అనే విషయాన్ని కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇక అసలు విషయం ఏమిటంటే.. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'సైయారా' సినిమా అందరూ చూసే ఉంటారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్టుగా నిలిచింది.కానీ ఈ సినిమా వల్ల అనుపమ్ ఖేర్ డైరెక్షన్ చేసిన తన్వీ ది గ్రేట్ మూవీ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్ అయిందట.ఎందుకంటే సైయారా మూవీ విడుదలైన రోజే తన్వి ది గ్రేట్ మూవీ కూడా విడుదలైంది. అదే సమయంలో సైయారా మూవీ కి మౌత్ టాక్ బాగుండడంతో చాలామంది సైయారా మూవీ చూడడానికే వెళ్లారు. దాంతో తన్వీ ది గ్రేట్ మూవీ కి దెబ్బ పడిపోయింది.

అలా 400 థియేటర్ లలో తన్వి ది గ్రేట్ మూవీని రిలీజ్ చేసినప్పటికీ సైయారా మూవీ కారణంగా ఈ సినిమా చూడడానికి ఎవరూ థియేటర్లకు రాలేదు.దాంతో ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. చాలామంది ప్రేక్షకులు సైయారా లాంటి ప్రేమ కథని చూడ్డానికే ఇష్టపడ్డారు కానీ తన్వి ది గ్రేట్ లాంటి ఎమోషనల్ డ్రామాని చూడడానికి ఆసక్తి చూపలేదు. దాంతో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది.. ఇక తన్వీ ది గ్రేట్ మూవీ కోసం బోమన్ ఇరానీ, అరవిందస్వామి, జాకీష్రాఫ్,పల్లవి జోష్ లాంటి సీనియర్ నటీనటులు అనుపమ్ ఖేర్ మీదున్న అభిమానంతో తక్కువ రెమ్యూనరేషన్ తో ఈ సినిమా కోసం వర్క్ చేశారు.

ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన శుభాంగి దత్ నటనకి విమర్శకుల నుండి ప్రశంసలు అందాయి. కానీ ఆమె అంత బాగా యాక్టింగ్ చేసినా కూడా తన్వి ది గ్రేట్ మూవీ సైయారా మూవీ కారణంగా అట్టర్ ప్లాఫ్ అయింది. ఇక మరో విశేషం ఏమిటంటే..తన్వీ ది గ్రేట్ మూవీ కోసం ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.అయినా కూడా సినిమాకి ప్లస్ కాలేదు. అసలు ప్రేక్షకులకు తన్వి ది గ్రేట్ మూవీ అనే ఓ సినిమా రిలీజ్ అయింది అనే విషయం కూడా తెలియనంత దారుణంగా సినిమా ఫెయిల్ అయింది..

ఈ సినిమా డిజాస్టర్ గురించి అనుపమ్ ఖేర్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ఒక హిట్ మూవీ కి పోటీగా వెళ్ళినప్పుడు ఆ పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో తన్వి ది గ్రేట్ మూవీ ద్వారా తెలుసుకున్నాను. సైయారా మూవీ వల్ల తన్వి ది గ్రేట్ మూవీ అట్టర్ ప్లాప్ అయ్యింది" అంటూ చెప్పుకొచ్చారు. ఇక అనుపమ్ ఖేర్ తన్వీ ది గ్రేట్ మూవీ కంటే ముందు ఓం జై జగదీష్ అనే మల్టీ స్టారర్ సినిమాకి డైరెక్షన్ చేశారు. కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో అనుపమ్ ఖేర్ డైరెక్షన్ చేసిన రెండు సినిమాలు ఫెయిల్ అయ్యి దర్శకుడిగా ఆయనకు చేదు అనుభూతిని మిగిల్చాయి. నటుడిగా సక్సెస్ అయినప్పటికీ డైరెక్టర్ గా విఫలమయ్యాడు.

Tags:    

Similar News