శ్రీవిష్ణు అనుదీప్ కలిస్తే రచ్చ రాంబోలానే..!
జాతిరత్నాలు అనుదీప్ అంటే ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్.. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ అతన్ని చూస్తే చాలు నానా హంగామా చేస్తారు.;

జాతిరత్నాలు అనుదీప్ అంటే ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్.. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ అతన్ని చూస్తే చాలు నానా హంగామా చేస్తారు. తన సినిమాలతో అలరిస్తూ ఏదైనా షోలో పాల్గొన్నా.. ఏదైనా ఈవెంట్ కి వచ్చినా అనుదీప్ చేసే కామెడీ.. వేసే పంచులు ఆడియన్స్ ని ఫుల్ ఖుషి చేస్తాయి. ఈమధ్య కాలంలో డైరెక్టర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వారిలో అనుదీప్ ఒకరు. జాతిరత్నాలు, ప్రిన్స్ తర్వాత ప్రస్తుతం మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తో ఫంకీ సినిమా చేస్తున్నాడు అనుదీప్.
ఈ సినిమాతో మరోసారి తన మార్క్ ఎంటర్టైన్మెంట్ మోడ్ లోనే ఈ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. విశ్వక్ సేన్ ఫంకీలో డ్రాగన్ బ్యూటీ కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుంది. అమ్మడికి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ చూస్తే ఫంకీ సినిమాకు ఆమె కూడా వన్ ఆఫ్ ది హైలెట్ అయ్యేలా ఉంది. ఇదిలా ఉంటే డైరెక్టర్ అనుదీప్ కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఆన్ స్క్రీన్ పాత్రలతో ఫన్ జనరేట్ చేయడమే కాదు ఆఫ్ స్క్రీన్ తను ఉన్న చోట నవ్వులు జల్లులు కురిపిస్తాడు.
అలాంటి డైరెక్టర్ తో అదే మైండ్ సెట్ ఉన్న హీరో పనిచేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. యువ హీరోల్లో కంటెంట్ ప్రధానంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు శ్రీ విష్ణు. అతని సినిమా వస్తుంది అంటే ఏదో కొత్త కథ అనేలా ఫిక్స్ చేశాడు శ్రీవిష్ణు. ఈమధ్యనే సింగిల్ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు శ్రీవిష్ణు. హీరోల్లో శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ బాగుంటుందని అంటుంటారు. అలాంటి హీరోకి అనుదీప్ లాంటి డైర్కెటర్ తో సినిమా పడితే మాత్రం ఇక ఆ సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది.
శ్రీవిష్ణు కూడా రకరకాల కాంబినేషన్స్ లో సినిమాలు సెట్ చేసుకుంటాడు. తప్పకుండా ఫ్యూచర్ లో అనుదీప్ తో ఒక సినిమా పడే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. శ్రీవిష్ణు, అనుదీప్ ఇద్దరు కలిసి ఒక సూపర్ కామెడీ సినిమా చేస్తే మాత్రం ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే లెక్క. ప్రస్తుతం ఫంకీ సినిమా తర్వాత జాతిరత్నాలు 2 ప్లానింగ్ లో ఉన్న అనుదీప్ కి శ్రీవిష్ణుతో సినిమా కుదిరితే మాత్రం అదిరిపోతుందని చెప్పొచ్చు. మరి ఈ కాంబో ఏ నిర్మాత అయినా సెట్ చేసినా బాగుంటుందని ఆడియన్స్ భావిస్తున్నారు.