• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Sports >  అభినవ్ బింద్రా జీవితంపై...

అభినవ్ బింద్రా జీవితంపై దేనికీ సస్పెన్స్?

| ఒలిపింక్ క్రీడాకారుడు అభినవ్ బింద్రా

By - Tupaki Desk
Update: 2023-07-15 07:40 GMT

ఒలిపింక్ క్రీడాకారుడు అభినవ్ బింద్రా జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తామని కొన్నేళ్ల క్రితం అనీల్ కపూర్..ఆయన తనయుడు హర్షవర్దన్ కపూర్ సంయుక్తంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల క్రితమే ఈ ప్రకటన వచ్చింది.

ఆ తర్వాత మళ్లీ గతేడాది సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. సమయం ఆసన్నమైందని..ఇక ఆలస్యం చేయబోమని మరోసారి హర్షవర్దన్ కపూర్ వెల్లడించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ బింద్రా జీవితం తెరకెక్కింది లేదు.

దీంతో ఈ ప్రాజెక్ట్ వెనుక ఆసలేం జరుగుతుందో? అర్దం కాని గందరగోళం నెలకొంది. కథ సిద్దం కాక ఆలస్యం చేస్తున్నారా? కథ సిద్దం కాక వెనక్కి తగ్గుతున్నారా? దర్శకుడి కోసం వెతికే పనిలో ఆలస్యమ వుతుందా? అని రకరకాల సందేహాలు తె రపైకి వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరోసారి అనీల్ కపూర్ అధికారిక ప్రకటన ఇచ్చారు. ప్రాజెక్ట్ పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్నట్లు వెల్లవించారు.

యధావిధిగా అభినవ్ బింద్రా పాత్రలో హర్షవర్దన్ ..ఆయన తండ్రి పాత్రలో అనీల్ కపూర్ నటిస్తున్నట్లు మరోసారి గుర్తు చేసారు. అభినవ్ బింద్రా ఆత్మకథ 'ఏ షాట్ ఎట్ హిస్టరీ..మై అబ్సెసివ్ జర్నీ టూ ఒలింపిక్ గోల్డ్' ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ని అనీల్ కపూర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తున్నారు. అయితే దర్శకుడు పేరు మాత్రం ఇంకా రివీల్ చేయలేదు.

అలాగే ఇతర కీలక పాత్రధారులు ఎవరు అన్నది ప్రకటించలేదు. ఇంకా సినిమాకి సంబంధించి చాలా వివరాలు గోప్యంగానే ఉంచుతున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే రెండుసార్లు ప్రకటనిచ్చిన నేపథ్యంలో ఇది అలాంటి ప్రకటనగానే మిగిలిపోతుందా? ఈసారైనా సెట్స్ కి వెళ్తారా? అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తివివరాలు లేకుండా ప్రకటన ఎలా ఇస్తారని అభినవ్ బింద్రా అభిమానులు మండిపడుతున్నారు. గతంలో ఇదే కాంబినేషన్ 'ఏకె వర్సెస్ ఏకే' చిత్రం ద్వారా ప్రేక్షకుల్ని ఆకట్టుకునన సంగతి తెలిసిందే.

Tags:    
  • AnilKapoor 
  • Bollywood 
  • Biopic 

Similar News

బ్రేకింగ్ : ఐపీఎల్ కు ధోని రిటైర్ మెంట్.. ఇక సీఎస్కే లో ఈ కొత్త రోల్..

2026-11-17 10:33 GMT

పాక్ పనిపట్టిన గుంటూరు కుర్రోడు.. విజయ సుభాష్ ఫుల్ స్టోరీ ఇదే..

2026-11-15 20:25 GMT

అండర్-19 ఆసియా కప్ 2026: వారెవ్వా! ఇదిరా కిక్కిచ్చే విక్ట‌రీ అంటే.. గ్రేట్ ఇండియా!

2026-11-14 16:38 GMT

న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర ఓటమి.. 89 పరుగులకే చాపచుట్టేసిన టీమిండియా!

2026-11-13 10:19 GMT

రూ.10 లక్షల నుంచి రూ.18 కోట్లకు.. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా?

2026-11-13 06:53 GMT

తోపు క్రికెటర్ అయినా.. పబ్లిక్ లో భార్యకు గజగజ వణికిపోయాడు.. వైరల్ వీడియో

2026-11-12 19:30 GMT

ఇది భారత చెస్ స్వర్ణయుగానికి అసలైన బలమైన ఆరంభం

2026-11-10 11:30 GMT

ఐపీఎల్ లో మరో రెండు జట్లు.. 10 నుంచి 12కు పెరగనున్న టీమ్‌ల సంఖ్య? బీసీసీఐ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

2026-11-10 10:30 GMT

భారత్ తో క్రికెట్ ఆడకపోతే దివాళా తీయాల్సిందే.. ఇంగ్లండ్ పరిస్థితి అదే..

2026-11-09 04:25 GMT

శాండ్ పేపర్ వివాదం.. ఆస్ట్రేలియా క్రికెట్ లో మంటపెట్టిన ఉస్మాన్ ఖవాజా

2026-11-07 08:22 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS