కలెక్షన్స్ పోస్టర్లు.. అసలు నిజం చెప్పిన అనిల్ సుంకర!
సాధారణంగా ఏ సినిమా రిలీజ్ అయినా వసూళ్లు వివరాలు వెల్లడిస్తూ ఆయా మేకర్స్ పోస్టర్స్ షేర్ చేస్తుంటారన్న విషయం తెలిసిందే.;
సాధారణంగా ఏ సినిమా రిలీజ్ అయినా వసూళ్లు వివరాలు వెల్లడిస్తూ ఆయా మేకర్స్ పోస్టర్స్ షేర్ చేస్తుంటారన్న విషయం తెలిసిందే. ఇది కొన్నేళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఆ పోస్టర్లపై నిర్మాత అనిల్ సుంకర చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. బాక్సాఫీస్ కలెక్షన్ పోస్టర్ల గురించి, వాటిని ఎలా ఉపయోగిస్తారనే దాని గురించి ఓపెన్ గా మాట్లాడారు.
అనిల్ సుంకర నిర్మాణంలో రూపొందుతున్న నారీ నారీ నడుమ మురారి మూవీ ఇప్పుడు గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. యంగ్ హీరో శర్వానంద్ లీడ్ రోల్ లో తెరకెక్కిన ఆ సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా రిలీజ్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయగా, అనిల్ సుంకర సినిమాలో నటించిన అందరి క్యాస్టింగ్ కోసం ప్రస్తావిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు.
ఆ తర్వాత ఓ మీడియా ప్రతినిధి సినిమాలకు వసూళ్లు పోస్టర్లు రిలీజ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని.. దాని మీద ఏమైనా డెసిషన్ తీసుకుంటారా అని అడగ్గా.. దీనిపై నిర్ణయమంటే అది పర్సనల్.. తానెప్పుడో ఆపేశాననని తెలిపారు. ఎవరి ఇష్టం వాళ్లదని చెప్పారు. దానిని ఒక పబ్లిసిటీ స్టంట్ గా తీసుకునేవాళ్లమని, అయితే గ్రాస్ కు షేర్ కు తేడా తెలియని వాళ్ళు చాలా మంది ఇప్పటికీ ఉన్నారని అనిల్ సుంకర తెలిపారు.
ఉదాహరణకు తీసుకుంటే మహేష్ బాబు నటించిన దూకుడు మూవీ రూ.100 కోట్ల గ్రాస్ అని అప్పుడు ప్రకటించామని, దీంతో అంతా తనకు రూ.100 కోట్లు వచ్చేశాయని అనుకుంటారని అనిల్ సుంకర తెలిపారు. అయితే రూ.100 కోట్ల గ్రాస్ అంటే తమకు వచ్చేది రూ.40 కోట్లు మాత్రమేనని వెల్లడించారు అది ఎవరికీ తెలియదని, కానీ ఆ నెంబర్ చూసి అట్రాక్ట్ అయిపోతారని పేర్కొన్నారు. అది ఒక ప్రమోషన్ స్ట్రాటజీ అని చెప్పారు.
అయితే అది కొన్ని సార్లు అది మిస్ ఫైర్ అవుతుందని, తాను మాత్రం పోస్టర్స్ ఆపేశానని చెప్పుకొచ్చారు. అలా పోస్టర్లు ప్రధానంగా లాభాలను చెప్పేలా కాకుండా ప్రమోషనల్ ఎలిమెంట్ గా రిలీజ్ చేస్తున్నామని క్లియర్ గా చెప్పేశారు. చాలా మంది నిర్మాతలు కలెక్షన్ పోస్టర్లను పబ్లిసిటీ స్టంట్ గా ఉపయోగించారని, కానీ కొన్ని సందర్భాల్లో తప్పుగా కన్వే అయిందని చెప్పడం గమనార్హం.
ఏదేమైనా ఇప్పుడు అనిల్ సుంకర కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆయన చెప్పింది నిజమేనని అనేక మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పలు సినిమాల పోస్టర్లను ఎగ్జాంపుల్ గా కూడా తీసుకుంటున్నారు. మేకర్స్ పోస్టర్స్ రిలీజ్ చేయడం ప్రమోషనల్ స్ట్రాటజీనేని చెబుతున్నారు. అనిల్ సుంకర చెప్పినట్లు గ్రాస్ కు షేర్ కు చాలా తేడా ఉందని అంటున్నారు.