విశ్వంభరతో రావిపూడికి కొత్త తలనొప్పి?

చివరగా ఆయన ఈ ఏడాది సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నారు.;

Update: 2025-08-09 17:30 GMT

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద హిట్స్ గా నిలిచాయి. మంచి వసూళ్లు కూడా రాబట్టాయి. అనుకున్న టైమ్ కన్నా ఎప్పుడూ లేట్ అవ్వలేదు. ముఖ్యంగా షెడ్యూల్ ప్రకారం.. షూటింగ్స్ ను కచ్చితంగా కంప్లీట్ చేసి తీరుతారు అనిల్ రావిపూడి.

చివరగా ఆయన ఈ ఏడాది సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నారు. సీనియర్ హీరో వెంకటేష్ లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ సాధించింది. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి.. మెగాస్టార్ చిరంజీవి మూవీతో బిజీగా ఉన్న సంగతి విదితమే.

ఇప్పటికే సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వగా.. శరవేగంగా జరుపుతున్నారు మేకర్స్. ఎప్పటిలానే అనుకున్న టైమ్ కే షెడ్యూల్స్ పూర్తి చేస్తున్నారు. 2026 సంక్రాంతి లక్ష్యంగా సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆ విషయాన్ని కూడా అనౌన్స్ చేశారు. అందుకు తగ్గట్లే వర్క్ ను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు.

అయితే ఇప్పుడు విశ్వంభర మూవీతో ఆయనకు కొత్త తలనొప్పి వచ్చిందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ నటిస్తున్న ఆ మూవీ షూటింగ్ పూర్తి అయింది. రీసెంట్ గా పెండింగ్ సాంగ్ ను కంప్లీట్ చేశారు మేకర్స్. కానీ ఎప్పుడో థియేటర్స్ లో రిలీజ్ కావాల్సిన ఆ సినిమా.. ఇప్పటికీ ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు.

వీఎఫ్ ఎక్స్ వర్క్స్ లేట్ కావడం వల్ల ఇంకా రిలీజ్ లేట్ అవుతుంది. అక్టోబర్ లేదా నవంబర్ లో విడుదల అవుతుందని టాక్ వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు అనిల్ రావిపూడి- చిరంజీవి లేట్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఒకే హీరో నటించిన బడా సినిమాలు తక్కువ గ్యాప్ లో రిలీజ్ అయితే ఇబ్బందే.

కమర్షియల్ గా అది వర్కౌట్ అవ్వదు. దీంతో విశ్వంభర వల్ల అనిల్ రావిపూడికి ఇబ్బంది అవుతుందని ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన మాత్రం తాను చేస్తున్న చిరు మూవీని సంక్రాంతికి విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. మరేం జరుగుతుందో.. విశ్వంభర ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. అనిల్ రావిపూడి ఏం చేస్తారో అంతా వేచి చూడాలి.

Tags:    

Similar News