సక్సెస్ మంత్రం తెలుసిన సిసలైన డైరెక్టర్..!

అనిల్ రావిపూడి సినిమాల్లో ఆడియన్స్ కి బాగా నచ్చే మరో అంశం సినిమా ప్రమోషన్స్. ఒక సినిమాను ఎలా ప్రమోట్ చేస్తే ఆడియన్స్ కు రీచ్ అవుతుందో అతనికి బాగా తెలుసు.;

Update: 2025-11-23 08:01 GMT

టాలీవుడ్ లో అసలు ఫ్లాపులు లేని డైరెక్టర్ అంటే అందరు రాజమౌళి పేరు చెబుతారు. ఆయనతో పాటు ఎంటర్టైనింగ్ సినిమాలతో ఓటమి ఎరుగని ధీరుడిగా రాజమౌళి తర్వాత ప్లేస్ సంపాదించాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు అనిల్ రావిపూడి సినిమా అంటే చాలు ఎంటర్టైన్మెంట్ పక్కా అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యాడు. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ తర్వాత స్టార్ ఛాన్స్ లను కూడా సూపర్ గా హ్యాండిల్ చేసి సరిలేరు నీకెవ్వరు అంటూ మహేష్ తో కలిసి సినిమా హిట్ అందుకున్నాడు అనిల్ రావిపూడి.

ఎలాంటి సినిమా ఇస్తే..

ఆయన సినిమాల్లో కామెడీ ఉంటుంది.. అది ఆడియన్స్ ని సూపర్ గా ఎంటర్టైన్ చేస్తుంది. సక్సెస్ మంత్రం తెలిసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఎందుకంటే ఆడియన్స్ కి ఎలాంటి సినిమా ఇస్తే వారు హిట్ చేస్తారు అన్నది బాగా నేర్చుకున్నాడు. ఎంటర్టైన్మెంట్ సినిమాలతో ప్రతిసారి మెప్పించడం చాలామంది ఫెయిల్ అవుతుంటారు. కానీ అనిల్ రావిపూడి మాత్రం హిట్లు మీద హిట్లు కొడుతూనే ఉంటాడు.

అనిల్ రావిపూడి సినిమాల్లో ఆడియన్స్ కి బాగా నచ్చే మరో అంశం సినిమా ప్రమోషన్స్. ఒక సినిమాను ఎలా ప్రమోట్ చేస్తే ఆడియన్స్ కు రీచ్ అవుతుందో అతనికి బాగా తెలుసు. ప్రమోషన్స్ లో హెడ్ మాస్టర్ టైప్ యాక్టివిటీస్ చేస్తూ ఆడియన్స్ ని సినిమాకు ఎంగేజ్ చేస్తుంటాడు అనిల్ రావిపూడి. ఇక ఎంచుకున్న కథకు తగినట్టుగా మిగతా మేళవింపులు అన్నీ ఉన్నా కూడా తన బలమైన కామెడీ మీద గట్టి ఎఫర్ట్ తో వస్తాడు. సో అక్కడ ఆడియన్స్ ఫిదా అయిపోతారు. తనపై వస్తున్న విమర్శలను కూడా పాజిటివ్ గా చేసుకునేలా పనిచేస్తూ ఉంటాడు అనిల్ రావిపూడి. అఫ్కోర్స్ ఆయన చేసే కామెడీ కొంతమందికి ఎక్కకపోతే చేసే ప్రతి విమర్శలు కూడా ఆయన రిసీవ్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్..

అందుకే అనిల్ రావిపూడి సూపర్ హిట్ డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరో హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి నెక్స్ట్ సంక్రాంతికి కూడా మరో సెన్సేషనల్ హిట్ కోసం ప్లాన్ చేశాడు.

సో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఆడియన్స్ కు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న అనిల్ రావిపూడి బర్త్ డే ఈరోజు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని.. ఇంకా ఎన్నో కామెడీ ఎంటర్టైనర్స్ తో అలరించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే డైరెక్టర్ అనిల్ రావిపూడి.

Tags:    

Similar News