రామ్ కొత్త ట్రెండ్ కి శ్రీకారం..?
మామూలుగా సినిమా ఈవెంట్స్ లో హీరోలు ఎక్కువగా సినిమాలో డైలాగ్స్ చెబుతారు.. కొందరు డాన్స్ చేస్తారు.. మరికొందరు మరోలా చేస్తారు. ఐతే రామ్ సినిమాలో పాటలను పాడి సర్ ప్రైజ్ చేశాడు.;
ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ టాలీవుడ్ కి కొత్త ట్రెండ్ తీసుకొచ్చాడు. అదేంటి అంటే ఆ హీరో సినిమాలో పాటాలను లైవ్ కన్సర్ట్ లో పాడి ఫ్యాన్స్ ని ఉత్తేజపరిచాడు. ఇలా మ్యూజిక్ కన్సర్ట్ లో సినిమా పాటలు మామూలుగా అయితే సింగర్స్ పాడతారు కానీ రామ్ తను రాసి పాడాడు కాబట్టి కన్సర్ట్ లో తన వాయిస్ వినిపించాడు. ఇలా ఒక సినిమా కోసం తన ఇన్వాల్వ్ మెంట్ ని చూపించే హీరోలను ఆడియన్స్ కూడా ఇష్టపడతారు. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా కోసం రామ్ హీరోగా మాత్రమే కాదు సింగర్, లిరిసిస్ట్ ఇలా చాలా రూపాలనే తీసుకున్నాడు.
రామ్ లో నువ్వుంటె చాలే లిరిసిస్ట్..
ఓ విధంగా సినిమా మీద అతనికి ఉన్న ప్యాషన్, కమిట్మెంట్ వల్లే ఇలా తన వల్ల అయ్యింది అంతా ఇచ్చేశాడని చెప్పొచ్చు. రామ్ లో నువ్వుంటె చాలే లాంటి సాంగ్ రాసే లిరిసిస్ట్ ఉన్నాడని ఆడియన్స్ తెలుసుకుని షాక్ అవుతున్నారు. ఎందుకంటే ప్రేమని వ్యక్తపరిచే భాష కన్నా గొప్ప భావం ఏముంటుంది చెప్పండి అన్నట్టుగా రామ్ తన ఆలోచనలన్నీ ఒక చోట చేర్చి రాసిన పాట అది. అందుకే ఆంధ్రా కింగ్ తాలూకా నుంచి వచ్చిన ఈ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.
వివేక్, మెర్విన్ మ్యూజిక్ ద్వయం రామ్ కి మంచి కోపరేట్ చేస్తూ ఆయన రాసిన పాటని సూపర్ కంపోజింగ్ చేయగా.. రామ్ వోకల్స్ ని కూడా వాడుకున్నారు. నువ్వుంటె చాలే సాంగ్ కి స్పెషల్ ఎట్రాక్షన్ గా అనిరుద్ రవిచంద్రన్ నిలవడం విశేషం. మొత్తానికి రామ్ ఇలా ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో పాటని ఫ్యాన్స్ సమక్షంలో లైవ్ పాడి వినిపించడం కొత్తగా ఉంది. అఫ్కోర్స్ ఫ్యాన్స్ కి కూడా ఇది భలే నచ్చేసింది.
ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా ప్రమోషన్స్..
మామూలుగా సినిమా ఈవెంట్స్ లో హీరోలు ఎక్కువగా సినిమాలో డైలాగ్స్ చెబుతారు.. కొందరు డాన్స్ చేస్తారు.. మరికొందరు మరోలా చేస్తారు. ఐతే రామ్ సినిమాలో పాటలను పాడి సర్ ప్రైజ్ చేశాడు. కచ్చితంగా ఈ ట్రెండ్ మరింత బలపడి యువ హీరోలు యాక్టర్ గానే కాకుండా లిరిసిస్ట్, సింగర్ కూడా ప్రయత్నిస్తే అదిరిపోతుంది.
ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా ప్రమోషన్స్ అదిరిపోతున్నాయి. సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ నటించింది. కన్నడ స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఈ నెల 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై రామ్ ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. ఐతే సినిమా ఏం చేస్తుంది అన్నది రిలీజ్ రోజు తెలుస్తుంది. మ్యూజిక్ తో ఆల్రెడీ సూపర్ బజ్ ఏర్పరచుకున్న ఆంధ్రా కింగ్ తాలూకా లవ్ స్టోరీ కమ్ ఫ్యాన్ బయోపిక్ గా ప్రేక్షకులకు ఒక మంచి ట్రీట్ ఇచ్చేందుకు రాబోతుంది.