'ఆంధ్రా కింగ్' FDFS సౌండ్ ఎలా ఉందంటే..
ఇది ఏదో స్టైలిష్‌గా, టెక్నికల్‌గా వేసిన డ్యాన్స్ కాదు. థియేటర్ బయట ఒక ఫ్యాన్ తన హీరో కటౌట్ చూసి, ఆనందంతో, పూనకంతో వేసే రియల్ స్టెప్స్.;
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని 'ఆంధ్రా కింగ్ తాలూకా'తో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఇది ఒక రెగ్యులర్ సినిమా కాదని "ఒక అభిమాని బయోపిక్" అనే పాయింట్‌తోనే సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశారు. టీజర్, గ్లింప్స్‌తో ఆ హైప్‌ను హై లెవెల్ కు తీసుకెళ్లిన మేకర్స్, ఇప్పుడు ఆ అభిమాని ఫీలింగ్స్‌కు పర్ఫెక్ట్ యాంథమ్ లాంటి సాంగ్‌ను వదిలారు. "ఫస్ట్ డే ఫస్ట్ షో" అంటూ సాగే ఈ నాలుగో సింగిల్, ఇప్పుడు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది.
ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్లు వివేక్ మెర్విన్ కంపోజ్ చేసింది జస్ట్ వినడానికి కాదు, థియేటర్ల దగ్గర పేపర్లు ఎగరేస్తూ డ్యాన్స్ చేయడానికి. పక్కా 'తీన్‌మార్' బీట్స్‌తో, థియేటర్ దగ్గర ఉండే ఆ సెలబ్రేషన్ అట్మాస్ఫియర్‌ను కంప్లీట్‌గా మ్యూజిక్‌లోకి తెచ్చేశారు. ఈ బీట్స్ వింటుంటే కాళ్లు ఆగడం కష్టం. ప్రతీ బీట్ వేరియేషన్, ఆ "ఢాం ఢాం" సౌండ్స్.. ఫ్యాన్స్ జాతరకు పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యాయి అని రామ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ పాటకు అసలు హైలైట్ రామ్ పోతినేని. కానీ, ఇందులో మనం చూసేది హీరో రామ్‌ను కాదు, ఒక పక్కా డై హార్డ్ ఫ్యాన్‌ను. అతని ఎనర్జీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు, కానీ ఈ పాటలో ఆ ఎనర్జీని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాడు. ఇది ఏదో స్టైలిష్‌గా, టెక్నికల్‌గా వేసిన డ్యాన్స్ కాదు. థియేటర్ బయట ఒక ఫ్యాన్ తన హీరో కటౌట్ చూసి, ఆనందంతో, పూనకంతో వేసే రియల్ స్టెప్స్.
పాటలో రామ్ డెడికేషన్ క్లియర్‌గా కనిపిస్తుంది. ఒక లాంగ్ సింగిల్ టేక్ షాట్‌లో, ఎక్కడా ఎనర్జీ డ్రాప్ అవ్వకుండా, వేరియేషన్స్ చూపిస్తూ డ్యాన్స్ చేయడం మామూలు విషయం కాదు. 'FDFS' రోజు ఒక ఫ్యాన్ ఉదయం నుంచి రాత్రి వరకు ఎంత నాన్‌స్టాప్‌గా హడావిడి చేస్తాడో, ఆ ఎనర్జీ ఏంటో రియలిస్టిక్‌గా ప్రెజెంట్ చేశారు. రామ్ బాడీ లాంగ్వేజ్, ఆ డ్యాన్స్ పర్ఫెక్ట్ గా సెట్టయ్యాయి.
ఈ ఒక్క పాట చాలు, సినిమా కాన్సెప్ట్ ఏంటో ఆడియన్స్‌కు చెప్పడానికి. ఇది ప్రతీ హీరో ఫ్యాన్‌కు ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ అయ్యే వైబింగ్ మెటీరియల్. రిలీజ్ తర్వాత సోషల్ మీడియా రీల్స్, థియేటర్ సెలబ్రేషన్ వీడియోస్‌లో ఈ పాట మోత మోగడం ఖాయం అని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు, డైరెక్టర్ మహేష్ బాబు పి. టేకింగ్‌కు ఈ సాంగ్ ప్లస్ కానుందని అంటున్నారు. ఇక 'ఆంధ్రా కింగ్ తాలూకా'లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ ఉపేంద్ర ఒక పవర్‌ఫుల్ పాత్రలో హీరోగా కనిపిస్తున్నారు. ఇక నవంబర్ 28న థియేటర్లలోకి రానున్న ఆ ఫ్యాన్ బయోపిక్ ఎలా ఉండబోతోందో చూడాలి.