అన‌న్య పాండే నిక‌ర ఆస్తుల విలువ‌?

అనన్య పాండేకు లగ్జరీ కార్ల‌పై ఉన్న‌ ప్రేమ అసాధార‌ణ‌మైన‌ది. త‌న‌కు ఉన్న‌ ఆస్తులలో సుమారు రూ. 1.70 కోట్ల విలువైన BMW 7 సిరీస్ కార్ ఉంది.;

Update: 2025-10-30 03:15 GMT

బాలీవుడ్ లో న‌ట‌వార‌సుల‌ ఆదాయం చూస్తే క‌ళ్లు చెదిరిపోవాల్సిందే. కుర్ర‌ భామ‌లు సినీరంగంలో ప్ర‌వేశించిన కొద్దిరోజుల్లోనే కోట్లాది రూపాయాలు కొల్ల‌గొడుతున్నారు. సినిమా పారితోషికాల‌తో పాటు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా వ్య‌వ‌రిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. సొంత కంపెనీలు పెడుతూ వ్య‌వ‌స్థాప‌కులుగాను మారుతున్నారు. తండ్రి చాటు బిడ్డ‌గా ప‌రిచ‌య‌మైనా కానీ, ఆ త‌ర్వాత స‌త్తా చాటుతూ మార్కెట్ లో చెలామ‌ణీ అవుతున్నారు.

ఇక చంకీ పాండే కుమార్తె అనన్య పాండే ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. `లైగ‌ర్` చిత్రంతో టాలీవుడ్ లోకి ఈ బ్యూటీ అడుగుపెట్టింది. మొద‌టి ప్ర‌య‌త్న‌మే డిజాస్ట‌ర్ ఫ‌లితం అందుకోవ‌డంతో ఆ త‌ర్వాత ఇటువైపు చూడ‌లేదు. అయినా అన‌న్య పాండేకు బాలీవుడ్ కెరీర్ ప‌రంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. హిందీ చిత్రసీమ‌లో వ‌రుస చిత్రాల్లో న‌టిస్తున్న అన‌న్య ఒక్కో సినిమాకి 6-8 కోట్లు పైగా పారితోషికం అందుకుంటోంది.

అనన్య పాండే కెరీర్ ప్రారంభించిన అతి త‌క్కువ స‌మ‌యంలోనే ముంబైలో తన సొంత అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసింది. నవంబర్ 2023లో ధంతేరాస్ పండుగ‌కు సగర్వంగా ఈ ఇంటిలో అడుగుపెట్టింది. ఈ ఇంటికి ఇంటీరియ‌ర్ గౌరీ ఖాన్ రూపొందించారు. 26 ఏళ్ల వయసుకే డ్రీమ్ హౌస్ ని కొనుగోలు చేయ‌డం ఆషామాషీనా?

అనన్య పాండేకు లగ్జరీ కార్ల‌పై ఉన్న‌ ప్రేమ అసాధార‌ణ‌మైన‌ది. త‌న‌కు ఉన్న‌ ఆస్తులలో సుమారు రూ. 1.70 కోట్ల విలువైన BMW 7 సిరీస్ కార్ ఉంది. ఇది ఆరు సిలిండ‌ర్ల‌తో, గంటకు 321 కి.మీ వేగంతో దూసుకుపోతుంది. మ‌రోవైపు అనన్య రేంజ్ రోవర్ స్పోర్ట్ కార్ ని కూడా ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంది. రూ. 1.64 కోట్ల నుండి రూ. 1.84 కోట్ల మధ్య దీని విలువ ఉంది. బీఎండ‌బ్ల్యూ, రేంజ్ రోవర్‌తో పాటు, ఆమె రూ. 75 లక్షల నుండి రూ. 88 లక్షల మధ్య ధర కలిగిన మెర్సిడెస్ బెంజ్ E-క్లాస్ కార్ ను సొంతం చేసుకుంది.

తన తల్లిదండ్రులు చంకీ-భావన పాండే స‌హా త‌న‌ సోదరి రైసాతో కలిసి బాంద్రాలోని సొగసైన పాలి హిల్ నివాసంలో నివసించింది. దాదాపు రూ. 10 కోట్ల ఖ‌రీదు చేసే ఇల్లు ఇది.

ఇటీవ‌ల వ‌రుస సినిమాల‌తో అన‌న్య బిజీ బిజీగా ఉంది. వ‌రుస సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ లు స‌హా ర‌క‌ర‌కాల మార్గాలలో అనన్య పాండేకు ఆదాయం వ‌స్తోంది. ఒక అంచ‌నా ప్ర‌కారం నికర ఆస్తుల‌ విలువ రూ. 74 కోట్లు (సుమారు 9 మిలియన్ డాల‌ర్లు)గా ఉంది. నెలకు దాదాపు రూ.60 లక్షలు చొప్పున‌ సంవత్సరానికి రూ.7 కోట్లకు పైగా సంపాదిస్తున్నట్లు సమాచారం. ప్ర‌ఖ్యాత‌ ప్యూమా, లక్మే వంటి బ్రాండ్‌లకు అన‌న్య బ్రాండ్ అంబాసిడ‌ర్.

Tags:    

Similar News