అనన్య 'స్పెషల్' కంటెంట్.. అసలు నిజమేంటి?

అయితే కొన్నిరోజులుగా ఇన్‌ స్టాగ్రామ్‌ లో సబ్‌ స్క్రిప్షన్ ఫీచర్ ట్రెండ్ అవుతోంది. ఆ ఫీచర్ ద్వారా సెలబ్రిటీలు తమ ఫాలోవర్స్‌ కు స్పెషల్ కంటెంట్ అందిస్తూ, నెలవారీ ఛార్జ్ వసూలు చేస్తున్నారు.;

Update: 2026-04-19 11:43 GMT

సోషల్ మీడియా కాలంలో సెలబ్రిటీలకు ఫ్యాన్స్ తో నేరుగా కనెక్ట్ అయ్యే అవకాశం పెరిగింది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ ఫామ్స్ ద్వారా వారు తమ పర్సనల్, ప్రొఫెషనల్ అప్డేట్స్‌ ను ఈజీగా షేర్ చేసుకుంటున్నారు. అయితే కొన్నిరోజులుగా ఇన్‌ స్టాగ్రామ్‌ లో సబ్‌ స్క్రిప్షన్ ఫీచర్ ట్రెండ్ అవుతోంది. ఆ ఫీచర్ ద్వారా సెలబ్రిటీలు తమ ఫాలోవర్స్‌ కు స్పెషల్ కంటెంట్ అందిస్తూ, నెలవారీ ఛార్జ్ వసూలు చేస్తున్నారు.

దీంతో సోషల్ మీడియాలో ఆ విషయంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. కొంతమంది యాంకర్లు, హోస్టులు ఆ సబ్‌ స్క్రిప్షన్ విధానాన్ని ఉపయోగించి ఎక్స్‌ క్లూజివ్ కంటెంట్ పేరుతో తమ సబ్ స్క్రైబర్స్ కు హై గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల పేరు కూడా వార్తల్లోకి వచ్చింది.

ఆమె కూడా ఇన్‌ స్టాగ్రామ్‌ లో సబ్‌ స్క్రిప్షన్ ప్రారంభించడంతో, అదే తరహాలో గ్లామర్ కంటెంట్ షేర్ చేస్తుందనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఆ ప్రచారంలో నిజం లేదని స్పష్టమవుతోంది. అనన్య నాగళ్ల తన సబ్‌స్క్రైబర్ల కోసం గ్లామర్ ఫోటోలు కాకుండా.. ఎంతో ఉపయోగకరమైన కంటెంట్ అందిస్తోంది. యోగా, మెడిటేషన్, మెంటల్ హెల్త్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.

హెల్తీ లైఫ్ స్టైల్ కు సంబంధించిన సూచనలు పంచుకుంటున్నారు. ఆమె వ్యక్తిగత అనుభవాలను కూడా ఫాలోవర్స్‌ తో షేర్ చేస్తూ, పీస్‌ ఫుల్ లైఫ్‌ స్టైల్‌ పై దృష్టి పెట్టిస్తోంది. ఇన్‌ స్టాగ్రామ్ సబ్‌ స్క్రిప్షన్ కోసం నెలకు సుమారు రూ.390 ఛార్జ్ విధించిన అనన్య.. దాని ద్వారా వచ్చిన డబ్బులు సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. దీంతో ఆమెను ఫాలో అవుతున్న అభిమానులు మంచి స్పందన చూపిస్తున్నారు.

గ్లామర్ కంటెంట్ కోసం కాకుండా, ఉపయోగకరమైన విషయాల కోసం సబ్‌ స్క్రైబ్ అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఆ విషయం సబ్ స్క్రైబ్ చేసుకున్నా వారికే తెలుస్తుంది. అది తెలియని వారు.. అనన్య కూడా కొందరిలా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తున్నారంటూ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ అసలు విషయం మాత్రం.. అందరికీ యూజ్ అయ్యే కంటెంట్ మాత్రమే షేర్ చేస్తున్నారు అనన్య.

అయితే తెలంగాణకు చెందిన అనన్య.. ఇంజనీరింగ్ పూర్తి చేసి, సినిమాలపై ఆసక్తితో సాఫ్ట్‌ వేర్ జాబ్ ను వదిలేశారు. షార్ట్ ఫిల్మ్స్‌ తో కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత హీరోయిన్ గా మారారు. మల్లేశం, వకీల్ సాబ్ వంటి పలు సినిమాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బ్యూటీ.. ప్రస్తుతం వివిధ చిత్రాలతో బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌ గా ఉంటూ, తనదైన శైలిలో అభిమానులతో టచ్‌ లో ఉంటారు. మొత్తానికి ఇన్‌ స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ చుట్టూ జరుగుతున్న ప్రచారంలో అనన్య నాగళ్లపై వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ వచ్చినట్లే!

Tags:    

Similar News