అనగనగా ఒకరాజు టీజర్ బ్లాస్ట్..!

సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా దేనికి దానికే స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా స్టార్ సినిమాలే కాదు ఫ్యామిలీ అంతా చూసే సినిమాలు కూడా ఆ సీజన్ లో సూపర్ హిట్ అవుతాయి.;

Update: 2025-09-26 06:59 GMT

నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జోడీగా మారి డైరెక్షన్ లో వస్తున్న సినిమా అనగనగా ఒక రాజు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ మూవీస్ బ్యానర్ లు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా సన్ర్కాంతి ప్రోమో రిలీజైంది. జ్యువెలరీ యాడ్ స్పూఫ్ తో అనగనగా ఒక రాజు లేటెస్ట్ టీజర్ చేశారు. ఒంటినిండా బంగారంతో మీనాక్షి జ్యువెలరీ యాడ్ కి చెప్పినట్టుగా డైలాగ్స్ చెబుతుంది. ఆమె అలా చెప్పడం ప్రారభించగానే కట్ కట్ అంటూ నవీన్ వచ్చి సినిమా సంక్రాంతి రిలీజ్ అని చెప్పమని అంటాడు.

నవీన్ మీనాక్షి కాంబినేషన్..

మీనాక్షి మళ్లీ అనగనగా ఒకరాజు సంక్రాంతి రిలీజ్ అని చెప్పి మళ్లీ జ్యువెలరీ గురించి చెబుతుంది. ఐతే వెంటనే ఆ జ్యువెలరీ తనకు మార్చుకుని ఇప్పుడు చెప్పమని అంటాడు నవీన్. అప్పుడు అనగనగా ఒకరాజు సినిమా సంక్రాంతికి వస్తుంది. జనవరి 14న రిలీజ్ అని చెబుతారు. నవీన్ మళ్లీ జువెలరీ గురించి చెప్పబోతాడు.

ఫైనల్ గా సినిమా సంక్రాంతికి వస్తుందనే విషయాన్ని ఇంత ఫన్నీగా చెప్పారు. నవీన్ మీనాక్షి కాంబినేషన్ అదిరిపోయేలా ఉంది. ఇక ఈ సంక్రాంతి పోర్మోలోనే కొన్ని షాట్స్ లో సినిమా ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేయబోతుంది అన్నది చూపించారు. నవీన్ పొలిశెట్టి నుంచి రాబోతున్న మరో సూపర్ ఎంటర్టైనర్ సినిమాగా అనగనగా ఒకరాజు వస్తుంది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

జాతిరత్నాలుతో సూపర్ హిట్..

జాతిరత్నాలుతో సూపర్ హిట్ అందుకున్న నవీన్ పొలిశెట్టి నెక్స్ట్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో ఇంప్రెస్ చేశాడు. ఇక నెక్స్ట్ రాబోతున్న అనగనగా ఒకరాజు సినిమాతో మరోసారి తన కామెడీతో మెప్పించాలని చూస్తున్నాడు.

సినిమా ప్రోమోలోనే నవ్వుల జల్లులు కురిపించేలా ఉంది. రాబోయే సంక్రాంతికి యూత్, ఫ్యామిలీస్, క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరినీ కడుపుబ్బా నవ్వించేలా ఈ సినిమా వస్తుందని చెప్పొచ్చు. సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్, ప్రభాస్ రాజా సాబ్ వస్తున్నాయి. వాటితో పాటు నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు రిలీజ్ ఫిక్స్ చేశారు. మరి ఈ ఫైట్ లో ఏ సినిమా ఏమేరకు ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుందో చూడాలి.

సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా దేనికి దానికే స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా స్టార్ సినిమాలే కాదు ఫ్యామిలీ అంతా చూసే సినిమాలు కూడా ఆ సీజన్ లో సూపర్ హిట్ అవుతాయి. అనగనగా ఒకరాజు సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తే మాత్రం మంచి విజయం అందుకునే ఛాన్స్ ఉంటుంది.

Full View
Tags:    

Similar News