రామాయణం లో ఆ పాత్రకు లెజెండ్ వాయిస్!
ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా బాలీవుడ్ నుంచి `రామాయణం` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.;
ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా బాలీవుడ్ నుంచి `రామాయణం` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో రాముడి పాత్రలో రణబీర కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. ఇంకా రామాయణంలో ప్రధాన పాత్రలు అంతే ఆసక్తికరం. బాలీవుడ్ స్టార్ నటులంతా ప్రాజెక్ట్ లో భాగమయ్యారు. ఇప్పటికే మొదటి భాగం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం రెండవ భాగం చిత్రీకరణ శర వేగంగా జరుగుతోంది.
దీంతో పాటు మొదటి పార్ట్ కి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు అంతే వేగంగా జరుగుతున్నాయి. రెండవ భాగం షూట్ తో సంబంధం లేకుండా మరో టీమ్ నిర్మాణానంతర పనుల్లో బిజీగా ఉంది. ఈనే పథ్యంలో తాజాగా సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇందులో జఠాయువు పాత్రకు అమితాబచ్చన్ గాత్ర దానం చేస్తున్నట్లు తెలిసింది. ఆ పాత్రకు అమితాబ్ గొంతులో ఉన్న గంభీరత బాగా సెట్ అవుతుందని భావించి నితీష్ ఆయన్ని రిక్వెస్ట్ చేయగా? అమితాబ్ కూడా సాను కూలంగా స్పందించారుట.
ఇంకా ఎస్ అని చెప్పలేదు గానీ ఇరువురి మధ్య చర్చలు జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. రామాయ ణంలో `జఠాయువు` ఒక ముఖ్యమైన పాత్ర. జాఠాయువు అంటే ఓ పక్షి. రావణుడితో పోరాడి సీతను కాపాడటా నకి ప్రయత్నించిన ఓ వీరుడు. కానీ చివరకు అదే రావణుడి చేతిలో వధించబడతాడు. మరణించే ముందు శ్రీరాముడికి సీత జాడను తెలియజేస్తాడు.
రామాయణంలో జఠాయువు ఓ గ్రద్ద రూపంలో ఉంటుంది. ఈనేపథ్యంలో ఆ గ్రద్ద పాత్రకే అమితాబ్ డబ్బింగ్ చెప్పే అవకాశం ఉంది. ఇలాంటి గొప్ప పాత్రలకు గాత్ర దానం చేసే అవకాశం రావడం అన్నది చాలా అరుదైన విషయం. మరి ఈ అవకాశాన్ని అమితాబ్ వినియోగించుకుంటారా? లేదా? అన్నది చూడాలి.