నేష‌న‌ల్ అవార్డ్ లోడింగ్.. ఆలియాపై సెటైర్లే సెటైర్లు!

ఈ ట్రోలింగ్‌కు ప్రధాన కారణం ఆలియా భట్ డైలాగ్ డెలివరీలో కనిపించిన `గంగూబాయి హ్యాంగోవర్` అని నెటిజన్లు విమ‌ర్శిస్తున్నారు.

Update: 2026-07-04 03:54 GMT

వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ సరికొత్త చిత్రం `ఆల్ఫా` ప్ర‌మోష‌న్ల‌లో హైప్ గురించి తెలిసిందే. ఆలియా లాంటి అగ్ర క‌థానాయిక స్పై పాత్ర‌లో న‌టించ‌డం, శార్వ‌రి లాంటి అంద‌గ‌త్తె రొమాంటిక్ టేల్స్ ట్రైల‌ర్ లో యూత్ ని ఆక‌ర్షించాయి. కానీ వాస్త‌వంలో ఇవ‌న్నీ జ‌నాల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌గ‌ల‌వా? ఇప్ప‌టికే వ‌చ్చిన స‌మీక్ష‌లలో మిశ్ర‌మ స్పంద‌న‌లు నిరాశ‌ప‌రిచాయి. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చినప్పటి నుండి సోషల్ మీడియా వేదిక‌ ఒక భారీ చర్చకు తెరలేపింది. బాలీవుడ్ అగ్ర నటి ఆలియా భట్ మొదటిసారిగా పూర్తి స్థాయి యాక్షన్ అవతారంలో కనిపించినా.. ఈ చిత్రం బాక్సాఫీస్ వసూళ్ల పరంగా.. నెటిజన్ల ట్రోలింగ్.. మీమ్స్ ద్వారానే ఎక్కువ సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని ఒక ఇంటెన్స్ డైలాగ్ క్లిప్ ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవ్వడంతో.. సినిమా కథాంశం పక్కకుపోయి ఆలియా భట్ నటనపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ట్రోలింగ్‌కు ప్రధాన కారణం ఆలియా భట్ డైలాగ్ డెలివరీలో కనిపించిన `గంగూబాయి హ్యాంగోవర్` అని నెటిజన్లు విమ‌ర్శిస్తున్నారు. ఆలియా గతంలో జాతీయ అవార్డు గెలుచుకున్న `గంగూబాయి కతియావాడి`చిత్రంలో ఉపయోగించిన గుజరాతీ మిక్స్‌డ్ హిందీ యాస ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో కూడా అలాగే కొనసాగిందని ప్రేక్షకులు గుర్తిస్తున్నారు. ఒక గూఢచారి పాత్రకు ఏమాత్రం సరిపోని ఆ పాత శైలి హావభావాలు - గొంతు మార్పును చూసి, ఆలియా ఇంకా గంగూబాయి క్యారెక్టర్ లోంచి బయటకు రాలేకపోతోందని మీమ్స్ రాయుళ్లు జోకులు పేలుస్తున్నారు.

వీటన్నింటికీ తోడు ఆ క్లిప్‌లో ఆలియా పలికిన ఒక ప‌ర్టిక్యుల‌ర్ పదం సోషల్ మీడియాలో పెద్ద హాస్యాస్పదమైన అంశంగా మారింది. చాలా సీరియస్‌గా సాగే ఒక సన్నివేశంలో ఆలియా `హక్ దియా` (హక్కు ఇచ్చారు) అని డైలాగ్ చెబుతున్నా అది వినడానికి `హగ్ దియా` (హిందీలో పని చెడగొట్టారు లేదా మలవిసర్జన చేశారు అనే వ్యంగ్య పదం) లాగా ధ్వనించిందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నిజమే... ఆలియా తన నటనతో అక్కడ నిజంగానే హగ్గీసింది! అంటూ కామెంట్స్ సెక్షన్‌లలో నెటిజన్లు ఒకరిపై ఒకరు పంచ్‌లు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.

మరోవైపు బాలీవుడ్‌లో అవార్డుల ఎంపిక .. చిత్ర పరిశ్రమలోని `నెపోటిజం` (వారసత్వం) లాబీయింగ్‌పై ఈ ట్రోలింగ్ మరోసారి విమర్శలకు తెర‌తీసింది. ఈ సినిమాకు కూడా కరణ్ జోహార్ అండతో లేదా పిఆర్ పవర్‌తో ముందే ఫిలింఫేర్ అవార్డులను బుక్ చేసుకుని ఉంటారంటూ `ఫిలింఫేర్ లోడింగ్`, `జితేష్ పిళ్ళై అవార్డులు రెడీ` అంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. కొంద‌రు ఏకంగా నేష‌న‌ల్ అవార్డ్ లోడింగ్! అంటూ మీమ్ లు, ఈమోజీలు షేర్ చేసారు. `రాజీ`, `హైవే` వంటి చిత్రాలలో అద్భుతమైన - సహజమైన నటనను ప్రదర్శించిన ఆలియా ఇప్పుడు కేవలం అవార్డుల కోసం బలవంతంగా అరవడం, ఏడవడం చేస్తోందని కొందరు విమర్శకులు సైతం పెదవి విరుస్తున్నారు.

ఓవ‌రాల్‌గా భారీ బడ్జెట్‌తో వ‌చ్చిన ఆల్ఫాపై నెటిజ‌నుల చెణుకులు హీటెక్కించేస్తున్నాయ్. ఆలియాకు శార్వరి సహనటిగా.. బాబీ డియోల్ విలన్‌గా న‌టించ‌గా.. `ఆల్ఫా` చిత్రం ఆలియా భట్ కెరీర్‌లో ఒక భిన్నమైన చర్చకు దారితీసింది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో హృతిక్ రోషన్ లాంటి స్టార్స్ క్యామియోలు ఉన్నా.. స్క్రీన్‌ప్లే లోపాలు - డైలాగ్స్ లోని లోపాల వల్ల సినిమా ఆశించిన స్థాయి క్రేజ్ అందుకోలేకపోయింది. అగ్ర నటిగా ఉన్న ఆలియా భట్ తన మునుపటి సహజ నటన వైపు దృష్టి సారించి... ఈ బలవంతపు లౌడ్ యాక్టింగ్ శైలిని వీడాలని సోషల్ మీడియా వేదికగా సినిమా అభిమానులు కోరుకుంటున్నారు. ఇక‌ ఆలియా న‌టిస్తున్న ల‌వ్ అండ్ వార్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News