కవర్ పేజీపై శిరీష్- నయనిక.. వాట్వే లుక్స్..
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, యంగ్ హీరో అల్లు శిరీష్ రీసెంట్ గా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.;
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, యంగ్ హీరో అల్లు శిరీష్ రీసెంట్ గా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం వరకు బ్యాచిలర్ లైఫ్ ను గడిపిన శిరీష్, తన ప్రేయసి నయనిక రెడ్డిని వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మార్చి 6వ తేదీన హైదరాబాద్ లో శిరీష్ పెళ్లి వేడుక అత్యంత వైభవంగా జరిగింది.
కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల సమక్షంలో శిరీష్.. నయనిక మెడలో మూడు ముళ్లు వేసుకుని ఏడడుగులు నడిచారు. సంప్రదాయబద్ధంగా జరిగిన ఆ వివాహం కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఆనందాన్ని నింపింది. అల్లు శిరీష్-నయనిక ప్రేమ కథ కూడా ఆసక్తికరంగానే ఉంది. కొన్నాళ్లుగా ఆ ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.
నయనిక రెడ్డి, హీరో నితిన్ భార్య షాలినికి అత్యంత సన్నిహితురాలు. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి వివాహ వేడుకల సందర్భంగా నితిన్ ఇచ్చిన పార్టీలో శిరీష్ కు నయనికతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారి, ఆ తర్వాత ప్రేమగా మారింది. అయితే కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆ జంట వివాహం చేసుకోవడం విశేషం. పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అభిమానులు, సినీ ప్రముఖులు కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇదిలా ఉండగా, పెళ్లి అనంతరం కూడా అల్లు వారి కొత్త జంటపై అభిమానుల్లో ఆసక్తి తగ్గలేదు. వివాహం తర్వాత శిరీష్, నయనిక కలిసి పలు చోట్ల పబ్లిక్ గా కనిపించడంతో మరింత చర్చనీయాంశమయ్యారు. ముఖ్యంగా ఇటీవల ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ 2026లో కలిసి పాల్గొన్నారు. ఇది వీరి తొలి పబ్లిక్ అప్పియరెన్స్ కావడంతో అందరి దృష్టి వారిపై నిలిచింది. స్టైలిష్ అవుట్ ఫిట్స్ లో ఆ జంట ఆకట్టుకుంది.
ముఖ్యంగా వారి మధ్య ఉన్న క్యూట్ కెమిస్ట్రీ అలరించింది. అంతేకాకుండా, తాజాగా ఆ జంట ఓ ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ కవర్ పేజీపై కూడా తళుక్కుమన్నారు. రాబ్ రిపోర్ట్ ఇండియా మ్యాగజైన్ కవర్ పై అల్లు శిరీష్ – నయనిక జంట బ్లాక్ అండ్ బ్లాక్ స్టైలిష్ అవుట్ ఫిట్స్ లో దర్శనమిచ్చారు. అందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ ఫోటో చూసిన నెటిజన్లు, సినీ అభిమానులు సూపర్ కపుల్, పర్ఫెక్ట్ మ్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా ఆ జంట స్టైల్, కెమిస్ట్రీతో ఆకట్టుకోవడం విశేషం. మొత్తానికి, అల్లు కుటుంబంలో జరిగిన వివాహం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి తర్వాత కూడా వరుసగా పబ్లిక్ అప్పియరెన్స్ లతో అల్లు శిరీష్ – నయనిక జంట అభిమానులను అలరిస్తూ వార్తల్లో నిలుస్తోంది.