అల్లు శిరీష్ ఎంగేజ్‌మెంట్.. ఎవరెవరు వచ్చారంటే..

అయితే, తుఫాన్ కారణంగా వేడుక ఆగిపోలేదు. మరో ప్లాన్ ని వెంటనే అమలు చేశారు. అనుకున్న ముహూర్తానికే, వధువు నైనికా రెడ్డి ఇంట్లోనే ఇండోర్‌ లో ఈ నిశ్చితార్థ వేడుకను పూర్తి చేశారు.;

Update: 2025-10-31 16:02 GMT

అల్లు ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగాయి. యంగ్ హీరో అల్లు శిరీష్ తన బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పి, వైవాహిక బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. నైనికా రెడ్డి అనే అమ్మాయితో శిరీష్ నిశ్చితార్థం అక్టోబర్ 31న కుటుంబ సభ్యుల నడుమ ఘనంగా జరిగింది. ఈ వేడుకను వధువు నైనికా రెడ్డి నివాసంలో నిర్వహించారు.




 


నిజానికి, ఈ ఎంగేజ్‌మెంట్ కోసం శిరీష్ ముందుగా వేరే ప్లాన్ చేసుకున్నాడు. అక్టోబర్ 31న తన ఇంట్లోనే, ఒక అందమైన 'అవుట్‌డోర్ వింటర్ ఎంగేజ్‌మెంట్'కు అన్ని ఏర్పాట్లు చేశాడు. కానీ, సరిగ్గా అదే సమయానికి 'మోంత' తుఫాన్ దెబ్బ కొట్టింది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఆ అవుట్‌డోర్ ప్లాన్ మొత్తం క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది.




 


అయితే, తుఫాన్ కారణంగా వేడుక ఆగిపోలేదు. మరో ప్లాన్ ని వెంటనే అమలు చేశారు. అనుకున్న ముహూర్తానికే, వధువు నైనికా రెడ్డి ఇంట్లోనే ఇండోర్‌ లో ఈ నిశ్చితార్థ వేడుకను పూర్తి చేశారు. లొకేషన్ మారినా, వేడుకలో సందడి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ కొత్త జంటను ఆశీర్వదించడానికి మెగా ఫ్యామిలీ మొత్తం తరలివచ్చింది.




 


మెగాస్టార్ చిరంజీవి దంపతులు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్నేహారెడ్డి, అల్లు అరవింద్ దంపతులు, నాగబాబు దంపతులు, అలాగే టాలీవుడ్ కొత్త జంట వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.




 


అల్లు శిరీష్ రాయల్ వైట్ షేర్వాణీలో, నైనికా రెడ్డి ట్రెడిషనల్ రెడ్ లెహంగాలో చాలా చూడముచ్చటగా ఉన్నారు. కుటుంబ సభ్యులంతా వారిపై ఆనందంగా పూల జల్లు కురిపిస్తూ దీవించారు. అవుట్‌డోర్ ప్లాన్ మిస్ అయినా, ఆ లోటు ఏమాత్రం తెలియకుండా, కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక ఎంతో ఆనందంగా సందడిగా జరిగింది. ఇక త్వరలోనే పెళ్లి డేట్‌ను కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.



Tags:    

Similar News