బన్నీ, షారుఖ్ మల్టీస్టారర్.. అసలు జరిగే పనేనా?

ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అట్లీతో నెవ్వర్ బిఫోర్ బడ్జెట్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత కూడా భారీ సినిమాలకే బన్నీ ఓకే చెప్పనున్నట్లు తెలుస్తోంది.;

Update: 2025-08-07 18:30 GMT

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇద్దరూ ఇప్పటికే తమ టాలెంట్ తో వేరే లెవెల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. బాక్సాఫీస్ వద్ద వివిధ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. తమ సత్తా ఏంటో చూపించారు.

ఇటీవల పుష్ప సినిమాకు అల్లు అర్జున్ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. షారుఖ్ ఖాన్ కూడా జవాన్ చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరూ తమ అప్ కమింగ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రేక్షకులను మరోసారి ఓ రేంజ్ లో అలరించేందుకు కూడా రెడీ అవుతున్నారు.

ఇప్పుడు బన్నీ, షారుఖ్ తో మల్టీస్టారర్ ప్లాన్ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే కొంతకాలంగా పాన్ ఇండియా చిత్రాలతో హోంబలే దూసుకుపోతున్న విషయం తెలిసిందే. లైనప్ లో కూడా భారీ ప్రాజెక్టులు చేర్చుకుని సత్తా చాటాలని చూస్తోంది.

అందులో భాగంగానే ఇప్పుడు అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్ మూవీ కోసం స్కెచ్ గీస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఆయన ఇప్పటికే హోంబలే బ్యానర్ పై కేజీఎఫ్ 1-2, సలార్ సినిమాలు తీశారు. త్వరలో సలార్-2ను కూడా ఆయనే రూపొందించనున్నారు.

ఇప్పుడు మల్టీస్టారర్ ప్రాజెక్టు ప్రారంభం దశలోనే ఉందని సమాచారం. కార్యరూపం దాల్చితే మాత్రం భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నటుడు-దర్శకుల కాంబినేషన్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. యాక్షన్ డ్రామాగా మూవీ ఉండనుందని టాక్ వస్తున్నా, ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

అదే సమయంలో పుష్ప సిరీస్ చిత్రాలతో అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అట్లీతో నెవ్వర్ బిఫోర్ బడ్జెట్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత కూడా భారీ సినిమాలకే బన్నీ ఓకే చెప్పనున్నట్లు తెలుస్తోంది. దీంతో స్క్రిప్ట్ ఆకర్షణీయంగా ఉంటే తప్ప మల్టీస్టారర్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు.

మరోవైపు, ప్రాజెక్టుల ఎంపికలో షారుఖ్ కూడా స్ట్రాంగ్ గా ఆలోచిస్తున్నారు. హై ప్రొఫైల్ సినిమాల్లో నటించేలా చూసుకుంటారు. ఇప్పుడు అసాధారణ కథ అయితేనే ఆయన కూడా ఓకే చెప్పే అవకాశం లేదు. దీంతో ఆ సినిమా కార్యరూపం దాల్చుతుందో లేదో.. అసలు ఇదంతా నిజమో లేక ఊహాగానామో అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News