పుష్ప రాజ్ పాన్ ఇండియా హవా.. టెలివిజన్ లో కూడా అదే కోత!
ఒక టాలీవుడ్ ఐకాన్ స్టార్ గా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న అల్లు అర్జున్, తన నటన, డైలాగ్ డెలివరీ, మాస్ అప్పీల్‌తో ‘పుష్ప రాజ్’గా దేశవ్యాప్తంగా అభిమానుల మనసు దోచుకున్నాడు.;

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా థియేటర్లలో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద రికార్డుల ఊచకోతతో టాప్ స్టార్స్ ను దాటేశాడు. ఇక ఇప్పుడు టీవీ ప్రీమియర్‌తో మరోసారి తన పాపులారిటీని చాటాడు. ఇప్పటి వరకు దక్షిణ భారతదేశానికి పరిమితమైన స్టార్ ఇమేజ్‌ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన ఈ సినిమా, అల్లు అర్జున్‌కు సూపర్ స్టార్ హోదాను మరింత పటిష్టం చేసింది.

ఒక టాలీవుడ్ ఐకాన్ స్టార్ గా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న అల్లు అర్జున్, తన నటన, డైలాగ్ డెలివరీ, మాస్ అప్పీల్‌తో ‘పుష్ప రాజ్’గా దేశవ్యాప్తంగా అభిమానుల మనసు దోచుకున్నాడు. థియేటర్లలో రూ.1800 కోట్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు హిందీ టీవీ ప్రేక్షకుల్ని కూడా ఆకర్షించింది. ముఖ్యంగా టీవీ ప్రీమియర్ సందర్భంగా వచ్చిన టీఆర్పీ రేటింగ్‌లు మాత్రం ఆశ్చర్యం కలిగించాయి.
ఇటీవల టెలివిజన్‌లో ప్రసారమైన ‘పుష్ప 2’ హిందీ వర్షన్‌కు టీఆర్పీ రేటింగ్స్ అత్యంత భారీగా వచ్చాయి. బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ‘పఠాన్’, ‘యానిమల్’, ‘స్త్రీ 2’ వంటి బిగ్ సినిమాల కంటే ఎక్కువ రేటింగ్స్ సాధించడంతో ఈ విషయంపై ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ టీఆర్పీ రేటింగ్‌లు అల్లు అర్జున్ పాపులారిటీని స్పష్టంగా చూపించాయి.
ఈ సినిమాలో అల్లు అర్జున్ మాస్ క్యారెక్టర్‌తో పాటు మేనరిజమ్, డైలాగ్ మాడ్యులేషన్, స్టైల్, డాన్స్ అన్నింటికీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో అల్లు అర్జున్ పేరు బాగా గుర్తింపు పొందింది. ఈ సినిమాతో అతను ఇండియన్ టాప్ స్టార్‌గా ఎదిగాడని చెప్పవచ్చు.
ఇటీవల ఐపీఎల్ మ్యాచ్‌ల హవా హై రేంజ్ లో ఉన్నా సరే, ‘పుష్ప 2’ హిందీ టీవీ ప్రీమియర్ రేటింగ్‌పై ఏమాత్రం ప్రభావం పడలేదు. ఈ విషయమే అల్లు అర్జున్ మాస్ క్రేజ్‌ను హైలైట్ చేస్తోంది. అటు క్రికెట్‌ను ఇష్టపడే హిందీ ఆడియన్స్‌ను సైతం అల్లు అర్జున్ ఆకట్టుకున్నారని విశ్లేషకుల అభిప్రాయం. ఇలా టీవీ రేటింగ్స్‌లో కూడా రికార్డు సృష్టించడం ‘పుష్ప’ ఫ్రాంచైజీ సక్సెస్‌ను మరోసారి నిరూపిస్తోంది.
ఐకాన్ స్టార్‌గా అవార్డులు, రివార్డులు, అభిమానుల ప్రేమతో తాను ఎంతో హ్యాపీగా ఉన్నట్లు ఇటీవల ఎంతో ప్రేమగా చెప్పారు అల్లు అర్జున్. ఈ టీవీ రేటింగ్స్ చూస్తే, ఆయన మాటలు నిజమేననిపిస్తుంది. టాలీవుడ్ హీరోగా స్టార్‌డమ్ ప్రారంభించి, ఇప్పుడు బాలీవుడ్‌లోని స్టార్‌లను సైతం వెనక్కి నెట్టే స్థాయికి చేరడం గ్రేట్ అనే చెప్పాలి. అల్లు అర్జున్ కు టెలివిజన్ లో రికార్డులి కొత్త కాదు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల.. వైకుంటపురములో.. కూడా టాప్ లిస్ట్ లో కొనసాగుతోంది.