• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'పుష్ప 2'.. రిలీజ్ దగ్గర...

'పుష్ప 2'.. రిలీజ్ దగ్గర పడుతున్నా రూమర్స్ మాత్రం ఆగడం లేదుగా!

| ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2: ది రూల్’

By - Tupaki Desk
Update: 2024-11-21 01:30 GMT

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2: ది రూల్’. ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో, హైప్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ తో ఈ సినిమా ఎలా ఉంటుందనేది శాంపిల్ గా చూపించారు. మరో రెండు వారాల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా, ఈ సినిమా మ్యూజిక్ విషయంలో రూమర్స్ మాత్రం ఆగడం లేదు.

‘పుష్ప 2: ది రూల్’ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల వచ్చిన ట్రైలర్ కు డీఎస్పీ సాలిడ్ బీజీఎం అందించారు. కాకపోతే అతని మ్యూజిక్ సినిమా అంతా వినిపించదు. ఇందులో పాటలు, కొంత భాగం బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రమే దేవిశ్రీ వర్క్ చేస్తున్నారు. మిగిలిన సినిమా బీజీఏం కోసం ఎస్. థమన్, అజనీష్ లోక్ నాథ్ సామ్ సిఎస్ వంటి మరో ముగ్గురు సంగీత దర్శకులు వర్క్ చేస్తున్నారు.

'పుష్ప 2' సినిమా ఫస్ట్ హాఫ్ లో కొన్ని యాక్షన్ బ్లాక్స్ కు థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ చేసినట్లు తెలుస్తోంది. తమిళ సంగీత దర్శకుడు సామ్ సిఎస్ కొన్ని పోర్షన్స్ కు, అలానే కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ ఇంకొన్ని ఎపిసోడ్స్ కి బీజీఎం కంపోజ్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ కొన్ని కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ తో సహా ఎమోషనల్ సీన్స్ కి తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించనున్నట్టుగా టాక్ వినిపిస్తోంది.

కొత్తగా ఈ ప్రాజెక్ట్ లో చేరిన ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పటికే తమకు అప్పగించిన పనిని పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఫైనల్ రష్ చూసిన సుకుమార్.. సామ్, అజనీష్ వర్క్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నారట. అయితే థమన్ చేసిన బీజీఎమ్ పట్ల కాస్త సంతృప్తి వ్యక్తం చేశారట. కొన్ని సీన్స్ కి ఇంకాస్త బెటర్ వర్క్ చేయాలని దర్శకుడు కోరాడట. తమన్ ఇప్పుడు అదే పనిలో ఉన్నాడని రూమర్లు ప్రచారంలో ఉన్నాయి.

అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదనిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల థమన్ ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ.. 'పుష్ప 2' లో తనకు అప్పగించిన పనిని పూర్తి చేశానని, తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో డైరెక్టర్, హీరో చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పారు. కాబట్టి అతని వర్క్ విషయంలో సుక్కూ అసంతృప్తి వ్యక్తం చేశారని అనడం నమ్మేలా లేదు. ఏదేమైనా సినిమా విడుదలకు రెండు వారాల ముందు కూడా మ్యూజిక్ గురించి పుకార్లు పుట్టుకురావడం ఆశ్చర్యం కలిగించే విషయం.

ఇదిలా ఉంటే, 'పుష్ప 2: ది రూల్' ప్రమోషన్స్ అగ్రెసివ్ గా సాగుతున్నాయి. పాట్నాలో గ్రాండ్ గా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ చేసి నార్త్ ఇండియాని ఆకర్షించిన మేకర్స్.. ఇప్పుడు సౌత్ లో ప్రచారం మొదలు పెడుతున్నారు. చెన్నైలో ఈవెంట్ నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఇదే క్రమంలో కోల్‌కతా, ముంబై, కోచి, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి మహా నగరాలలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 'పుష్ప 2' చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

Tags:    
  • Alluarjun 
  • Sukumar 
  • Pushpa2 
  • Iconstar 
  • Tollywood 
  • Pushpatherule 
  • Pushpa2promotions 
  • Thaman 

Similar News

వంశీ పైడిపల్లికి కలలో కూడా ఊహించని గిఫ్ట్.. ఇదీ సల్మాన్ రేంజ్ అంటే!

2026-11-25 17:54 GMT

రిలీజ్ కు ముందే 100 మార్కులు వేసిన గ్రేట్ మామ్!

2026-11-25 17:48 GMT

చెంప వాచిపోయినా బామ్ రాసుకుని మ‌రీ త‌న్నులు తిన్నాడు!

2026-11-25 14:30 GMT

నాడు రీల్ జోడీ..నేడు రియల్ బంధువులు!

2026-11-25 13:30 GMT

సింపుల్గా సిద్ధార్థ్ గల్లా పెళ్లి.. మరి మహేష్ బాబు ఎక్కడ?

2026-11-25 12:51 GMT

రెండు సినిమాలతో రెండు సెంటిమెంట్స్.. డైరెక్ట్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారు?

2026-11-25 12:48 GMT

రామాయణం ఎఫెక్ట్.. సాయిపల్లవి లెక్కలు మారతాయా!

2026-11-25 12:04 GMT

ఒక్క తప్పిదం..చేజారుతున్న షోలు!

2026-11-25 11:30 GMT

అన్నాచెల్లెళ్ల కథే.. మరి ఈ ట్విస్ట్ ఏంటి?

2026-11-25 11:02 GMT

రెట్రో లుక్‌తో ఆకట్టుకుంటున్న అనుపమ

2026-11-25 11:02 GMT

విశ్వంభర.. సంక్రాంతికి వస్తే సరిపోతుందా?

2026-11-25 11:02 GMT

Tupaki Exclusive: ఫౌజీ గ్లింప్స్ లో వచ్చిన ఫైట్ నేనే డిజైన్ చేశా.. అది సాంపిల్ మాత్రమే...

2026-11-25 10:47 GMT

Copyright @2026

Powered by Blink CMS