అట్లీ వాటికోసం కామెరూన్ లా రిస్క్ తీసుకుంటాడా?
`పుష్ప` ప్రాంచైజీతోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ లో చేధించాల్సింది చేసి చూపించాడు.;
`పుష్ప` ప్రాంచైజీతోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ లో చేధించాల్సింది చేసి చూపించాడు. అక్కడ హీరోల రికార్డులను సైతం బ్రేక్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించాడు. దీంతో బన్నీ బాలీవుడ్ లో ఓ సూపర్ స్టార్ ఇమేజ్ ని ఆస్వాది స్తున్నాడు. ఇప్పుడు బన్నీ ప్లానింగ్ అంతకు మించి ఉంది. అందుకే తమిళ్ డైరెక్టర్ అట్లీతో చేతులు కలిపాడు. # బన్నీ 26వ చిత్రం అట్లీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభానికి ముందే ప్రఖ్యాత హాలీవుడ్ స్టూడియోస్ లో బన్నీ మేకోవర్ జరిగింది. బన్నీ లుక్ కి సంబంధించి ఏకంగా ఇంటర్నేషనల్ స్టూడియోలే పని చేసాయి.
బన్నీ లుక్ పై సర్వత్రా ఆసక్తి:
ఐకాన్ స్టార్ ని గ్లోబల్ స్టార్ ని చేయాలి? అన్న ప్లానింగ్ లో భాగంగా అట్లీ ప్రాజెక్ట్ ను డీల్ చేస్తున్నాడు. బన్నీ సహా అట్లీకి కెరీర్ ఇది పెద్ద సాహసమే. ఇప్పటి వరకూ అట్లీ అంటే కేవలం కమర్శియల్ చిత్రాల దర్శకుడిగానే పేరుంది. కానీ ఇప్పుడతడు అంతకు మంచి బన్నీతో కలిసి ఓ టెక్నికల్ ప్రాజెక్ట్ ని డీల్ చేస్తున్నాడు. వీళ్లిద్దర్నీ నమ్మి సన్ పిక్చర్స్ ఏకంగా 600 కోట్ల బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మిస్తుంది. సన్ పిక్చర్స్ కెరీర్ లోనే తొలి భారీ బడ్జెట్ చిత్రిమిది.దీంతో ఈ ప్రాజెక్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బన్నీ లుక్ ఎలా ఉంటుంది? ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు? ఇలాంటి టెక్నకల్ స్టోరీ లో అట్లీ కమర్శియల్ లిబర్టీస్ ఎంత వరకూ తీసుకుంటాడు? ఇలా ప్రతీది ఆసక్తికరమే.
బన్నీకి ఈ సన్నివేశాలు పరీక్షేనా:
ఈ నేపథ్యంలో తాజాగా ప్రాజెక్ట్ కి సంబంధించి క్రేజీ అప్డేట్స్ అందుతున్నాయి. సినిమాలో అండర్ వాటర్ సీక్వెన్స్ లు ఉండబోతున్నాయట. బన్నీ సహా ప్రధాన పాత్రలపై ఈ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. కానీ ఇలాంటి సన్నివేశాలు అంత ఈజీ కాదు. వాటిలో వాస్తవికత అన్నది ముఖ్యం. సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు బ్లూ మేట్స్ వేసి చిత్రీకరిస్తుంటారు. వాటిలో అంత రియలిస్టిక్ అప్పిరియన్స్ ఉండదన్నది? హాలీవుడ్ దిగ్గజం జెమ్స్ కామెరూన్ అభిప్రాయం. అందుకే కామెరూన్ `అవతార్ 2` కోసం నీటి అడుగున షూటింగ్ చేస్తున్న సమయంలో నటీనటులు ఎలాంటి భయానికి లోనుకాకూడదని హవాయి తీరంలో శిక్షణ ఇచ్చి షూట్ చేసారు.
ఇంట్రెస్టింగ్ గెటప్స్ లో బన్నీ:
ఆ సన్నివేశాలు ఎంతో వాస్తవికంగా ఉంటాయి. మరి అట్లీ అండర్ వాటర్ సీక్వెన్స్ కోసం ఎలాంటి ఛాన్స్ తీసుకుం టున్నాడు? అన్నది చూడాలి. అలాగే సినిమాలో బన్నీ మూడు గెటప్స్ లో కనిపించనున్నట్లు లీకులందు తున్నా యి. అంటే ఒకే పాత్రను మూడు వైవిథ్యమైన గెటప్స్ లో ఆవిష్కరిస్తున్నట్లు. దీనికి సంబంధించి అట్లీ ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే కొన్ని గెటప్స్ ని సిద్దం చేసి పెట్టుకున్నాడు. వాటిలో బన్నీ ఎలా ఉంటాడు? అన్నది ఆసక్తికరం.