బన్నీతో మూవీ.. లోకేష్ ప్లాన్ ఎలా ఉంది?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవైపు కోలీవుడ్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న రాకా షూటింగ్ కొనసాగుతుండగా, మరోవైపు తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో చేయబోయే ప్రాజెక్ట్ (AA23) పై ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఆ కాంబినేషన్ ప్రకటించినప్పటి నుంచే అభిమానుల్లో, సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
లోకేశ్ కనగరాజ్ గతంలో తీసిన వివిధ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించినప్పటికీ, ఆయన కంప్లీట్ టాలెంట్ ను ఇంకా చూపలేదనే అభిప్రాయం కొందరిలో ఉంది. ఈ నేపథ్యంలో బన్నీతో చేయబోయే సినిమా ఆయన కెరీర్ లో కీలక మలుపు అవుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ప్రాజెక్ట్ గురించి లోకేశ్ సన్నిహితుడు, కో రైటర్ రత్న కుమార్ చేసిన వ్యాఖ్యలు మరింత హైప్ తీసుకొచ్చాయి.
"ఇది పూర్తిగా ఒరిజినల్ లోకేష్ స్టైల్ సినిమా. స్క్రిప్ట్ ఇప్పటికే స్ట్రాంగ్ గా సిద్ధమైంది. ఈసారి లోకేశ్ లో ఉన్న కసి, ఫైర్ మరో లెవెల్ లో కనిపిస్తుంది" అని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ఖైదీ, విక్రమ్ సమయాల్లో కనిపించిన ఎనర్జీ మళ్లీ రిపీట్ అవుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. లోకేష్ కనగరాజ్ లోని పీక్ టాలెంట్ ను చూస్తారని చెప్పి ఒక్కసారిగా రత్న కుమార్ అంచనాలు పెంచారు.
ఇక ఆ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అనౌన్స్మెంట్ మ్యూజిక్ వీడియో సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. బన్నీ మాస్ ఇమేజ్ కు అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కలిస్తే థియేటర్లలో కొత్త రికార్డులు నమోదు కావడం ఖాయం అన్న అభిప్రాయం ఫ్యాన్స్ లో వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం బన్నీకి పుష్ప సిరీస్ చిత్రాలతో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ మరింత పెరిగింది. ఆ సినిమాతో ఆయన రేంజ్ గ్లోబల్ స్థాయికి చేరింది. అందుకే AA23ను కేవలం సౌత్ కే పరిమితం చేయకుండా, అంతర్జాతీయ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించాలనే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అట్లీ ప్రాజెక్ట్ పూర్తయ్యాక లోకేశ్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. వచ్చే ఏడాది స్టార్టింగ్ లో షూటింగ్ ప్రారంభం కావచ్చని అంచనా.
ప్రస్తుతం లోకేశ్ ఆ స్క్రిప్ట్ పై పూర్తిగా ఫోకస్ పెట్టి మరింత పదును పెడుతున్నట్లు సమాచారం. మొత్తానికి బన్నీ, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్, స్టైలిష్ టేకింగ్, స్ట్రాంగ్ కంటెంట్ అన్నీ కలిసొస్తే ఆ సినిమా సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఫ్యాన్స్ అయితే ఇదే లోకేష్ పీక్స్ మూవీ అవుతుందని ఇప్పుడే నమ్మకంగా చెబుతున్నారు. మరేం జరుగుతుందో అంతా వేచి చూడాలి.