లోకేష్, బన్నీ.. అసలు నిజమేంటి?

సోషల్ మీడియాలో సినిమాలకు సంబంధించిన రూమర్లు ఎప్పటికప్పుడు తెగ చక్కర్లు కొడుతుంటాయి. అయితే వాటిలో నిజమెంత ఉందో తెలుసుకోవడం మాత్రం ప్రేక్షకులకు పెద్ద సవాలుగా మారింది.

Update: 2026-06-04 00:30 GMT

సోషల్ మీడియాలో సినిమాలకు సంబంధించిన రూమర్లు ఎప్పటికప్పుడు తెగ చక్కర్లు కొడుతుంటాయి. అయితే వాటిలో నిజమెంత ఉందో తెలుసుకోవడం మాత్రం ప్రేక్షకులకు పెద్ద సవాలుగా మారింది. రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌ లో ప్రకటించిన AA23 ప్రాజెక్టుపై కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. ఆ సినిమా ఆగిపోయిందంటూ గత రెండు రోజులుగా నెట్టింట పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి.

అయితే ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం రాకా షూటింగ్‌ తో బిజీగా ఉన్నారు. మరోవైపు లోకేష్ కనగరాజ్ తన లేటెస్ట్ ప్రాజెక్టుల వర్క్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇద్దరూ తమ తమ కమిట్మెంట్లతో బిజీగా ఉండటంతో ఆ సినిమా వెంటనే ప్రారంభం కాకపోవచ్చనే అభిప్రాయం ఏర్పడింది. దీంతో AA23 ప్రాజెక్ట్ ఆగిపోయిందనే రూమర్లు పుట్టుకొచ్చాయి.

ఆ రూమర్స్ కు ప్రముఖ రచయిత, దర్శకుడు రత్నకుమార్ పరోక్షంగా చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమా విడుదలై నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రత్నకుమార్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో లోకేష్‌ కు విషెస్ చెబుతూ.. AA23 కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఆ ప్రాజెక్ట్ ట్రాక్ లోనే ఉందని ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చారు.

అయితే AA23 ప్రాజెక్టు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. స్టోరీ వర్క్ ఫైనల్ అవుతుందని తెలుస్తోంది. క్యాస్టింగ్ సెలక్షన్, ఇతర టెక్నికల్ ఎలిమెంట్స్ పై పనులు కొనసాగుతున్నట్లు సమాచారం. లోకేష్ కనగరాజ్ పూర్తి స్థాయి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారని వినికిడి. ఇప్పటికే ఆ కథకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా టాక్ వినిపిస్తోంది. కానీ ఆ సినిమా ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఇద్దరి బిజీ షెడ్యూళ్లేనని వార్తలు వస్తున్నాయి.

అల్లు అర్జున్ ప్రస్తుతం రాకాతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ తో మరో ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారని మళ్లీ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు లోకేష్ కనగరాజ్ కూడా ఖైదీ 2 వంటి కీలక చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంది. దీంతో వీరిద్దరి డేట్లు ఒకేసారి కుదరకపోవడం సహజమేనని చెప్పాలి. ఇక ఆ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ అనగానే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఒకవైపు పుష్ప సిరీస్‌ తో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న బన్నీ.. మరోవైపు ఖైదీ, విక్రమ్, లియో వంటి చిత్రాలతో క్రేజ్ సొంతం చేసుకున్న లోకేష్ కలిసి వర్క్ చేయబోతుండటంతో ఆ ప్రాజెక్టుపై ఇప్పటికే హైప్ ఉంది. ఏదేమైనా ఇప్పుడు AA23 ప్రాజెక్ట్ ఆగిపోలేదని, సరైన సమయం వచ్చిన తర్వాత పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని క్లియర్ గా తెలుస్తోంది. దీంతో ఆ కాంబో కోసం ఎదురుచూస్తున్న బన్నీ, లోకేష్ అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.

Tags:    

Similar News