గంగోత్రి రిజల్ట్.. బన్నీ వాసుకి అల్లు అర్జున్ ఏం చెప్పాడంటే..?

ఐతే లేటెస్ట్ గా ఒక పాన్ ఇండియా స్టార్ తన సినిమాలో ఒక లేడీ గెటప్ వేస్తే థియేటర్ మొత్తం పూనకాలతో ఊగిపోయింది.;

Update: 2026-01-06 05:09 GMT

ఒక ఆర్టిస్ట్ తను ఎలాంటి రోల్ చేసినా ఆడియన్స్ ని మెప్పించడమే సక్సెస్ అనుకుంటాడు. కెరీర్ మొదట్లో కొంత తడపాటు ఉన్నా ఎక్స్ పీరియన్స్ వస్తున్నా కొద్దీ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నిజంగా ఆ రోల్ అలానే ప్రవర్తిస్తుందా అన్నట్టుగా చేస్తారు. అందుకే ఇండియన్ స్క్రీన్ మీద స్టార్స్ ని కొన్ని పాత్రలుగా గుర్తుంచుకున్న సందర్భాలు ఉన్నాయి. ఐతే లేటెస్ట్ గా ఒక పాన్ ఇండియా స్టార్ తన సినిమాలో ఒక లేడీ గెటప్ వేస్తే థియేటర్ మొత్తం పూనకాలతో ఊగిపోయింది.

గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్..

అదే స్టార్ తన తొలి సినిమాలో కూడా అంటే రెండు దశాబ్దాల క్రితం లేడీ గెటప్ వేస్తే విమర్శలు వచ్చాయి. ఇంతకీ ఏ స్టార్ గురించి ఇదంతా అంటే.. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి అన్నమాట. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ ఆ సినిమా సక్సెస్ అయినా కొంత విమర్శలు ఫేస్ చేశాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ లుక్స్ ఇంకా ఆ మూవీలో ఒకచోట లేడీ గెటప్ లో కనిపించే సరికి అది ఒక మీం మెటీరియల్ అయ్యింది.

ఐతే ఆ సినిమా రిలీజ్ టైం లో అల్లు అర్జున్ తన ఫ్రెండ్ బన్నీ వాసుతో సినిమా సక్సెస్ అయ్యింది నేను బాగాలేను.. ఎప్పటికైనా ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ అవుతా అని అన్నాడట. ఆ టైంలో బన్నీ వాసు అల్లు అర్జున్ ఏదో సరదాగా చెప్పాడని అనుకున్నాం కానీ పుష్ప 2 లో అదే లేడీ గెటప్ లో అల్లు అర్జున్ ని చూసి అందరు సూపర్ అనేశారు. అది చూసి ఆరోజు గంగోత్రి టైంలో తను చెప్పింది చేసి చూపించాడని అనిపించిందని బన్నీ వాసు రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు.

నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్..

అల్లు అర్జున్ ఒక స్టార్ నిర్మాత కొడుకే అయినా ఎలాంటి సినీ నేపథ్యంలేని హీరో కష్టపడినట్టుగా వర్క్ చేస్తాడు. ప్రతి సినిమాకు బన్నీ పెడుతున్న ఎఫర్ట్స్ అలా ఉన్నాయి కాబట్టే దాదాపు ఇన్నేళ్ల తెలుగు సినీ పరిశ్రమలో ఏ హీరోకి సాధ్యం కానీ నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ ని సొంతం చేసుకున్నాడు.

అల్లు అర్జున్ కెరీర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ మీద ఉంది. పుష్ప ముందు వరకు ఆయన కేవలం సౌత్ హీరో మాత్రమే పుష్ప రెండు పార్ట్ లు సూపర్ సక్సెస్ అవ్వడంతో అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్, త్రివిక్రం లాంటి డైరెక్టర్స్ అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అట్లీ సినిమా హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్ట్ గా వస్తుంది. ఈ సినిమా అనౌన్స్ మెంట్ వీడియోతోనే ఆడియన్స్ అంతా సర్ ప్రైజ్ అయ్యారు.

Tags:    

Similar News