అటెన్షన్ నుంచి టెన్షన్ లోకి అల్లు ఫ్యాన్స్..?
అల్లు అర్జున్ ఫ్యాన్స్ టెన్షన్ లో పడేలా డైరెక్టర్ అట్లీ వర్క్ ఒకటి బయటకు వచ్చింది. రణ్ వీర్ సింగ్ తో అట్లీ చేసిన ఒక యాడ్ లేటెస్ట్ గా రిలీజైంది.;
అల్లు అర్జున్ ఫ్యాన్స్ టెన్షన్ లో పడేలా డైరెక్టర్ అట్లీ వర్క్ ఒకటి బయటకు వచ్చింది. రణ్ వీర్ సింగ్ తో అట్లీ చేసిన ఒక యాడ్ లేటెస్ట్ గా రిలీజైంది. యాడ్ మాత్రం చాలా భారీగా ఉంది కానీ అంతా కూడా ఎందుకో థ్రిల్ అనిపించలేదు. అట్లీ, రణ్ వీర్ సింగ్ కలిసి చింగ్ సాస్ యాడ్ చేశారు. ఏజెంట్ చింగ్ అంటూ ఒక యాక్షన్ ఎపిసోడ్ తో ఈ యాడ్ ఉంది. రణ్ వీర్ సింగ్ యాక్షన్ తో పాటు శ్రీలీల, బాబీ డియోల్ కూడా ఇందులో కనిపించారు. ఈ యాడ్ చేయడానికి దాదాపు 150 కోట్ల దాకా ఖర్చు అయినట్టు తెలుస్తుంది.
రణ్ వీర్ సింగ్ చింగ్ సాస్ యాడ్..
ఆ బడ్జెట్ తో మన తెలుగులో ఒక పాన్ ఇండియా సినిమా తీసేయొచ్చు. ఐతే బడ్జెట్ అంత పెట్టినా ఎందుకో క్వాలిటీ విషయంలో ఎక్కడో తేడా అనిపిస్తుంది. ముందు ఈ ట్రైలర్ చూసి ఇదేదో సినిమా ప్రమోషన్ అనుకున్నారు. బిల్డప్ అలానే ఉంది. తీరా చివర చూస్తే చింగ్ సాస్ యాడ్ అని తెలిసింది. ఏజెంట్ చింగ్ అంటూ రణ్ వీర్ సింగ్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.
ఐతే ఈ యాడ్ చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లోనే సినిమా వస్తుంది. ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ అట్లీ చేసిన ఈ యాడ్ చూసిన తర్వాత బాబోయ్ అల్లు అర్జున్ సినిమాను కూడా ఇలానే చేస్తాడా ఏంటని డౌట్ పడుతున్నారు. అట్లీ సినిమాలు భారీ రేంజ్ లోనే ఉంటాయి.
అల్లు అర్జున్ ఏరి కోరి అట్లీని..
అతను డైరెక్షన్ మొదలు పెట్టింది రాజు రాణి సినిమాతోనే అయినా సరే ఆ తర్వాత తెరి, మెర్సల్, జవాన్ అంటూ యాక్షన్ సినిమాలనే చేశాడు. అట్లీ సినిమాల్లో యాక్షన్ సీన్స్ బాగుంటాయి. ఐతే రణ్ వీర్ తో చేసిన ఈ యాడ్ లో అవి కాస్త బెటర్ అనిపిస్తున్నా అట్లీ మార్క్ మాత్రం కనిపించలేదని అంటున్నారు. ఇదే తరహాలో అల్లు అర్జున్ సినిమాను కూడా చేస్తే మాత్రం కచ్చితంగా ఎఫెక్ట్ పడేలా ఉందని డౌట్ పడుతున్నారు.
అల్లు అర్జున్ ఏరి కోరి అట్లీని సెలెక్ట్ చేసుకున్నాడు. మరి అతని నమ్మకాన్ని అట్లీ ఎంతవరకు నిలబెట్టుకుంటాడు అన్నది చూడాలి. అట్లీ అల్లు అర్జున్ సినిమాలో దీపిక పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ కూడా భాగం అవుతారని టాక్