'రాకా' మైండ్ బ్లోయింగ్ లీక్.. హిస్టరీలో నెవ్వర్ బిఫోర్ అనేలా..
రాకా నార్మల్ కమర్షియల్ మూవీ కాదని, ఆడియన్స్ ఇప్పటివరకు చూడని స్థాయిలో రూపొందుతోందని నాగేంద్ర కాశీ తెలిపారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లీడ్ రోల్ లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం రాకాపై మరోసారి చర్చ మొదలైంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొనగా, అఫీషియల్ గా వచ్చిన వివరాలు కంటే చిత్ర యూనిట్ కు దగ్గరగా ఉన్నవారి కామెంట్సే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా రైటర్ నాగేంద్ర కాశీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి పెంచుతున్నాయి.
రాకా నార్మల్ కమర్షియల్ మూవీ కాదని, ఆడియన్స్ ఇప్పటివరకు చూడని స్థాయిలో రూపొందుతోందని నాగేంద్ర కాశీ తెలిపారు. తాను తరచూ షూటింగ్ సెట్ లో ఉంటున్నానని, అక్కడ జరుగుతున్న వర్క్ ను దగ్గర నుంచి అబ్జర్వ్ చేసే అవకాశం తనకు దక్కిందని చెప్పారు. సినిమా కోసం దర్శకుడు అట్లీ ఎంతో డెడికేషన్ తో పనిచేస్తున్నారని, ప్రతి సీన్ ను స్పెషల్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని వెల్లడించారు.
సాధారణంగా సీన్లకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యాడ్ కావడంతోనే ఎమోషన్లు, ఎలివేషన్లు మరింత స్ట్రాంగ్ గా ప్రేక్షకులకు చేరుతాయని నాగేంద్ర కాశీ పేర్కొన్నారు. అయితే రాకా షూటింగ్ సమయంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకుండానే కొన్ని సన్నివేశాలు ఎంతో ఎఫెక్టివ్ గా అనిపించాయని చెప్పారు. క్యాస్టింగ్ యాక్టింగ్, విజువల్ ట్రీట్మెంట్, అట్లీ తీస్తున్న విధానం చూస్తుంటే సినిమా స్పెషల్ ఎక్స్పీరియన్స్ ను అందించేలా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
ఇండియన్ సినిమా హిస్టరీలో ప్రత్యేక గుర్తింపు పొందే చిత్రంగా రాకా నిలిచే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. సెట్స్ లో కనిపిస్తున్న ఎనర్జీ, విజువల్ స్కేల్, కథను చూపించే విధానం తనను ఆకట్టుకున్నాయని తెలిపారు. సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులు కూడా అదే ఎక్స్పీరియన్స్ ను పొందుతారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్.. నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమా విషయానికొస్తే.. రాకాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్, యాక్షన్, ఫాంటసీ ఎలిమెంట్స్ తో మూవీ ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ ఇందులో ఇప్పటి వరకు కనిపించని కొత్త అవతార్ లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్, ఇంటర్నేషనల్ రేంజ్ టెక్నికల్ వాల్యూస్ తో సినిమాను ప్రముఖ బ్యానర్ సన్ పిక్చర్స్ రూపొందిస్తున్నట్లు సమాచారం.
బన్నీ స్టార్ డమ్, అట్లీ మాస్ మేకింగ్ స్టైల్, ప్రొడక్షన్ వాల్యూస్ తో కలిసి సినిమాను స్పెషల్ రేంజ్ కు తీసుకెళ్తాయని అభిమానులు భావిస్తున్నారు. చిత్ర యూనిట్ నుంచి పూర్తి వివరాలు ఇంకా రాలేదు. అయినప్పటికీ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే నాగేంద్ర కాశీ చేసిన మైండ్ బ్లోయింగ్ లీక్స్ మాత్రం రాకాపై ఉన్న అంచనాలను మరింత పెంచాయని చెప్పాలి. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఆ ప్రాజెక్ట్ ఇప్పటికే లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా మారింది.