అల్లు అర్జున్ తో మూవీ.. అట్లీ వేరే లెవెల్ ఎలివేషన్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ కోసం సినీ ప్రియులు, అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే;

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ కోసం సినీ ప్రియులు, అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. సూపర్ హీరో జోనర్ లో సినిమా రాబోతుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. దీంతో సినీ వర్గాల్లో మూవీపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
అయితే అట్లీ మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. ఇటీవల హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణేని ఫిక్స్ చేసినట్లు అనౌన్స్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. దాని బట్టి.. దీపిక రోల్ సూపర్ ఉమెన్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. అనౌన్స్మెంట్ వీడియోతో సినిమాపై ఆడియన్స్ లో మరిన్ని అంచనాలు క్రియేట్ చేశారు.
రీసెంట్ గా డైరెక్టర్ అట్లీకి సత్యభామ యూనివర్సిటీ డాక్టరేట్ అందిస్తున్నట్లు ప్రకటించగా.. తాజాగా ప్రదానం చేసింది. ఆ సమయంలో జీవితంలో ఎంత నెగెటివిటీ ఎదుర్కొంటే అంత ఎత్తుకు ఎదుగుతారంటూ మోటివేషన్ స్పీచ్ ఇచ్చారు అట్లీ. ఆ తర్వాత అల్లు అర్జున్ తో రూపొందిస్తున్న సినిమా కోసం మాట్లాడారు.
బన్నీ చేస్తున్న మూవీ.. అందరి అంచనాలకు మించి ఉంటుందని తెలిపారు అట్లీ. సినీ అభిమానులంతా గర్వపడేలా ఆ సినిమా ఉంటుందని చెప్పారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ స్థాయిలో చిత్రాన్ని తెరకెక్కించనున్నామని వెల్లడించారు. ఇంకా సినిమా బడ్జెట్ గురించి ఒక నిర్ణయానికి రాలేదని ఆయన స్పష్టం చేశారు.
దీంతో దేశంలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన చిత్రం ఇదే అవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే కొత్త టెక్నాలజీతో ఆ చిత్రాన్ని రూపొందించనున్నామని చెప్పారు అట్లీ. గ్రాఫిక్స్ ను జోడించి స్టూడియోల్లో ఎక్కువ భాగాన్ని షూట్ చేయనున్నట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
అదే సమయంలో సినిమా విడుదల తేదీ విషయాన్ని అట్లీ ప్రస్తావించారు. విడుదల తేదీని నిర్మాత కళానిధి మారన్ నిర్ణయిస్తారని చెప్పారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఆయన భారీ బడ్జెట్ తో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే సినిమాలో దీపికతోపాటు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ సహా మరికొందరు స్టార్ హీరోయిన్లు నటిస్తారని టాక్ వినిపిస్తోంది. శక్తిమాన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.