హైటెక్ హంగులతో అల్లు సినిమాస్.. ఫీచర్స్ ఎలా ఉన్నాయి?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అటు హీరోగా దూసుకుపోతూనే ఇటు వ్యాపార రంగంలో కూడా తనదైన ముద్ర వేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.;

Update: 2026-01-05 10:04 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అటు హీరోగా దూసుకుపోతూనే ఇటు వ్యాపార రంగంలో కూడా తనదైన ముద్ర వేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అల్లు అరవింద్ సారథ్యంలోని ఆయన కుటుంబం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ హైదరాబాద్‌ లోని కోకాపేటలో సిద్ధమైంది. మోడ్రన్ టెక్నాలజీ, లగ్జరీ అనుభూతి ఇస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఇప్పటివరకు అమీర్ పేట్ లో AAA సినిమాస్ (ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్) భాగస్వామ్యంతో అందరినీ ఆకట్టుకున్న అల్లు అర్జున్, ఈసారి పూర్తిగా తన సొంత బ్రాండ్‌ తో అల్లు సినిమాస్ ను తీసుకొచ్చారు. పేరు మాత్రమే కాదు.. డిజైన్ నుంచి టెక్నాలజీ వరకు ప్రతి అంశంలో కూడా తన ప్రత్యేకత చూపించారు. మరి మల్టీప్లెక్స్ ప్రత్యేకతలు ఏంటంటే?

అల్లు సినిమాస్‌ లో ఏర్పాటు చేసిన స్క్రీన్‌ ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవాలి. సుమారు 75 అడుగుల వెడల్పుతో భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇది దేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్లలో ఒకటిగా నిలవనుంది. ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ థియేటర్ గా నిలిచిన అల్లు సినిమాస్ లో ప్రేక్షకులకు అనుభూతిని మరో స్థాయికి తీసుకెళ్లేలా స్క్రీన్‌ ను డిజైన్ చేశారు.

విజువల్ క్వాలిటీ కోసం డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్, 4K డ్యూయల్ RGB లేజర్ టెక్నాలజీ ఉపయోగించారు. కలర్స్ మరింత నేచురల్ గా కనిపించేలా ఆ ప్రొజెక్షన్ సిస్టమ్ పనిచేస్తుంది. యాక్షన్ సీన్స్ అయినా, విజువల్ ఎఫెక్ట్స్ సన్నివేశాలైనా ప్రేక్షకులను పూర్తిగా సినిమాలోకి లాగేసేలా రూపొందించారు. సౌండ్ క్వాలిటీ విషయానికొస్తే, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టం అమర్చారు.

ప్రతి చిన్న సౌండ్ కూడా స్పష్టంగా వినిపించేలా, 360 డిగ్రీల సౌండ్ అనుభూతిని అందించే విధంగా ఆడియో సెటప్ చేశారు. దీంతో థియేటర్‌ లో కూర్చున్న ప్రేక్షకులు సినిమా మధ్యలో ఉన్నామన్న ఫీలింగ్‌ కు పూర్తిగా కనెక్ట్ అవుతారట. హైఎండ్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని సీటింగ్‌ ను అత్యంత విలాసవంతంగా రూపొందించారు.

సోఫా లాంటి కంఫర్టబుల్ సీట్లు, విశాలమైన లెగ్ స్పేస్, రాయల్ లుక్ ఇచ్చే ఇంటీరియర్స్ అల్లు సినిమాస్‌ కు ప్రత్యేక గుర్తింపుగా నిలవనున్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నార్సింగి, గండిపేట, కోకాపేట వంటి ఐటీ హబ్‌లు, విలాసవంతమైన నివాస ప్రాంతాలకు సమీపంలో ఉండటంతో అల్లు సినిమాస్ సినీ ప్రియులకు మెయిన్ డెస్టినేషన్ గా మారనుంది.

అల్లు సినిమాస్ ను సంక్రాంతి సీజన్‌ ను టార్గెట్ గా పెట్టుకుని జనవరి 13 లేదా 14న అట్టహాసంగా ప్రారంభించేందుకు అల్లు ఫ్యామిలీ ప్లాన్ చేస్తోంది. రీసెంట్ గా సాఫ్ట్ లాంచ్ జరగ్గా.. అఫీషియల్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని సమాచారం. ఏదేమైనా అల్లు సినిమాస్ అల్లు కుటుంబానికి మరో ఐకానిక్ ల్యాండ్‌ మార్క్‌ గా, మల్టీప్లెక్స్ రంగంలో కొత్త బెంచ్‌ మార్క్‌ గా నిలవబోతోందని చెప్పాలి.

Tags:    

Similar News