అసలు LCU పక్కన పెట్టి.. ఎందుకు ఇలా..
లోకేష్ కనగరాజ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది LCU. ఖైదీ 2 కోసం కార్తి ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
లోకేష్ కనగరాజ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది LCU. ఖైదీ 2 కోసం కార్తి ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విక్రమ్ 2, సూర్యతో రోలెక్స్ సినిమా కూడా ఆయన చేయాల్సిన లిస్టులో ఉన్నాయి. అయినా వీటన్నింటికంటే ముందు లోకేష్ అల్లు అర్జున్ సినిమాను తీసుకున్నాడు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌ను LCUలో భాగంగా ప్రకటించలేదు. అలాంటప్పుడు తనకు ఇంత పెద్ద బ్రాండ్ ఇచ్చిన యూనివర్స్‌ను మధ్యలో ఆపి అల్లు అర్జున్ దగ్గరకు ఎందుకు వెళ్లాడన్నది సహజంగానే వచ్చే సందేహం.
దీనికి వెనుక ఒక పాత కమిట్‌మెంట్ ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు ఆరేళ్ల క్రితమే లోకేష్‌కు అడ్వాన్స్ ఇచ్చిందని ఆయనే చెప్పారు. అల్లు అర్జున్‌తో మూడు నాలుగేళ్లుగా సినిమా చేయాలని కూడా అనుకుంటున్నారట. మధ్యలో టైమింగ్ కుదరలేదు. ఇప్పుడు మైత్రీ కమిట్‌మెంట్, అల్లు అర్జున్‌తో చేయాలనే ప్లాన్ రెండూ ఒకేసారి సెట్ కావడంతో AA23 ముందుకు వచ్చింది.
ఇక్కడ ఖైదీ 2 వెనక్కి వెళ్లడానికి కూడా మరో కారణం ఉంది. రజినీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్ కోసం లోకేష్ కొంతకాలం పని చేశాడు. ఆ సినిమా కుదరకపోయేసరికి తిరిగి ఖైదీ 2కి రావాలనుకున్నాడు. అప్పటికే కార్తి తన డేట్స్‌ను మరో సినిమాకు ఇచ్చేశాడు. వచ్చిన ఆ గ్యాప్‌లోనే అల్లు అర్జున్ సినిమాను ముందుకు తీసుకొచ్చారు. అంటే షెడ్యూల్స్ వలన చేంజ్ అయిన ప్లాన్ ఇది.
అల్లు అర్జున్‌కు కూడా ఈ కాంబినేషన్ సరైన సమయంలో పడింది. పుష్ప సినిమాల తర్వాత ఆయన మార్కెట్ తెలుగు రాష్ట్రాలకు పరిమితం కాలేదు. ప్రస్తుతం అట్లీతో రాకా చేస్తున్న అల్లు అర్జున్, ఆ తర్వాత లోకేష్ సినిమాలోకి వెళ్లనున్నాడు. మైత్రీ నిర్మిస్తున్న AA23ను పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ప్రకటించారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అనౌన్స్‌మెంట్ వీడియోలోనే అడవి, గుర్రం, జంతువులతో వేరే సెటప్‌ను హింట్ చేశారు. కానీ కథ ఏంటన్నది ఇంకా బయటకు రాలేదు.
లోకేష్‌కు మాత్రం ఇది మరో రకమైన చాలెంజ్. ఖైదీ, విక్రమ్, లియోతో తనకు తెలిసిన LCU ప్రపంచంలో హీరోలను పెట్టాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కోసం ఆ కనెక్షన్స్ ఏమీ లేకుండా కొత్త కథతో రావాల్సి ఉంది. పుష్ప తర్వాత అల్లు అర్జున్‌కు ఉన్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుంటే ఆ ప్రపంచం ఎంత పెద్దగా ఉంటుందన్నది కూడా చూడాలి. ఇక LCU ఎక్కడికీ వెళ్లడం లేదు. అల్లు అర్జున్ సినిమా పూర్తయ్యాక తన నెక్స్ట్ డైరెక్షన్ ఖైదీ 2నే అని లోకేష్ స్పష్టంగా చెప్పాడు. ఆ తర్వాత విక్రమ్ 2, రోలెక్స్ కూడా తన కమిట్‌మెంట్స్‌లోనే ఉన్నాయని ఇదివరకే క్లారిటీ ఇచ్చాడు. ఇక అల్లు అర్జున్ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.