ప్రియాంక చోప్రా చిత్రానికి ఊహించని షాక్!

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్న తాజా అంతర్జాతీయ ప్రాజెక్ట్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

Update: 2026-08-26 06:46 GMT

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్న తాజా అంతర్జాతీయ ప్రాజెక్ట్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న `రీసెట్` చిత్రానికి సంబంధించి కీల‌క‌మైన పరిణామం చోటుచేసుకుంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా సరసన కీలక పాత్రలో నటించాల్సిన హాలీవుడ్ నటుడు ఆర్లాండో బ్లూమ్ అనూహ్యంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. షూటింగ్ ప్రారంభం కావడానికి కొన్ని రోజుల ముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం హాలీవుడ్ లో సంచ‌ల‌నంగా మారింది. చిత్రీకరణకు సర్వం సిద్ధం చేసుకున్న తరుణంలో ప్రధాన తారాగణంలో ఒకరైన ఆర్లాండో బ్లూమ్ తప్పుకోవడం మేకర్స్‌ను షాక్‌కు గురిచేసింది.

వ్యక్తిగత కారణాల వల్ల లేదా డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ఆర్లాండో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సమయంలో ఈ రకమైన మార్పులు జరగడం ప్రాజెక్ట్‌పై కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. అయినా? చిత్ర యూనిట్ మాత్రం ఈ సవాల్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాపై గ్లోబల్ ఆడియన్స్‌లో భారీ క్రేజ్ ఉంది. వైవిధ్యమైన కథాం శంతో వస్తున్న చిత్రంపై అంచనాలు అంత‌కంత‌కు పెరుగుతోన్న‌ సమయంలో క్యాస్టింగ్ మార్పు పెద్ద బ్రేక్‌గా మారింది.

ఆర్లాండో బ్లూమ్ స్థానంలో మరో ప్రముఖ హాలీవుడ్ నటుడిని తీసుకునేందుకు దర్శక నిర్మాతలు వెంటనే అన్వేషణ మొదలు పెట్టినట్లు సమాచారం. త్వరలోనే కొత్త నటుడికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. షూటింగ్ షెడ్యూల్స్ త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో మేకర్స్ వేగంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన నటుల మార్పు కారణంగా షూటింగ్‌లో స్వల్ప మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే చిన్నపాటి ఆటంకాలు సినిమా తుది అవుట్‌పుట్‌పై ఎలాంటి ప్రభావం చూపకుండా దర్శకుడు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.

ప్రియాంక చోప్రా అభిమానులు మాత్రం ఈ పరిణామాలు సినిమా విడుదలపై ఎలాంటి ప్రభావం చూపకూడదని కోరుకుంటున్నారు. అంతర్జాతీయ చిత్రసీమలో ఇలాంటి లాస్ట్ మినిట్ మార్పులు సర్వసాధారణమే అయినా? ఆర్లాండో బ్లూమ్ లాంటి స్టార్ నటుడు తప్పుకోవడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమా కథపై, ప్రియాంక పాత్రపై నమ్మకంతో ఉన్న అభిమానులు చిత్రానికి సంబంధించి తదుపరి అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొత్త నటుడి వివరాలు తెలిసే అవ‌కాశం ఉంది.

ప్ర‌స్తుతం ప్రియాకం చోప్రా టాలీవుడ్ లో `వార‌ణాసి` చిత్రంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఏకంగా 120 దేశాల్లో రిలీజ్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో ప్రియాంక చోప్రా గ్లోబ‌ల్ వైడ్ క్రేజ్ ఈ సినిమాకు క‌లిసొస్తుంది. సినిమా హిట్ అయితే? పీసీ గ్లోబ‌ల‌ర్ రేంజ్ అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంది.

Tags:    

Similar News