రాజా సాబ్ ఫీడ్‌బ్యాక్.. ప్రభాస్ డెసిషన్ ను మార్చిందా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వాటిలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్‌పై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలున్నాన్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వాటిలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్‌పై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలున్నాన్నాయి. ప్రభాస్‌ను ఇంతకుముందెన్నడూ చూడని విధంగా పవర్‌ఫుల్ యాక్షన్ అవతార్‌లో చూపించేందుకు డైరెక్టర్ సందీప్ స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాలోని యాక్షన్ సన్నివేశాల విషయంలో ప్రభాస్ తీసుకుంటున్న జాగ్రత్తలు ఆసక్తికరంగా మారాయి.
ఇటీవల ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమాలో యాక్షన్ సీన్స్ కు సంబంధించి సోషల్ మీడియాలో జరిగిన డిస్కషన్ కూడా ఇప్పుడు మరోసారి తెరపైకి వస్తోంది. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో బాడీ డబుల్ వినియోగంపై నెటిజన్ల నుంచి భిన్నమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ ఫీడ్‌బ్యాక్ ప్రభాస్ దృష్టికి కూడా వెళ్లినట్లు సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. అయితే, దీనిని స్పిరిట్ లో ఆయన తీసుకున్న నిర్ణయానికి నేరుగా కారణమని చెప్పడం కంటే.. యాక్షన్ సినిమాల్లో తన స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్ విషయంలో మరింత శ్రద్ధ పెడుతున్నారనే కోణంలో చూడాల్సి ఉంటుంది.
స్పిరిట్ లో యాక్షన్‌కు కథలోనే కీలకంగా ఉండటంతో, ప్రభాస్ క్యారెక్టర్ ను డూప్‌పై ఆధారపడకుండా మరింత సహజంగా తెరపైకి తీసుకురావాలనే ఆలోచనతో టీమ్ ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. యాక్షన్ సీన్స్ లో హీరో స్వయంగా పాల్గొంటే వచ్చే ఇంపాక్ట్ వేరుగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విజన్‌కు ప్రభాస్ కూడా పూర్తిగా సహకరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
అయితే బాడీ డబుల్ ఉపయోగించకపోవడం ఒక్కటే ఇక్కడ విశేషం కాదు. భారీ యాక్షన్ ప్రాజెక్టుల్లో హీరోలు తమ క్యారెక్టర్ కోసం ఎంతవరకు ఫిజికల్‌గా కమిట్ అవుతున్నారనేది ఇప్పుడు మెయిన్ డిస్కషన్ గా మారుతోంది. స్పిరిట్‌లో ప్రభాస్ నుంచి అలాంటి కమిట్‌మెంట్‌ను ఆడియన్స్ చూడబోతున్నారనే అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సందీప్ మార్క్ ఇంటెన్స్ యాక్షన్‌కు ప్రభాస్ ఇమేజ్ కలవడంతో ఈ కాంబినేషన్‌పై మరింత ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే స్పిరిట్ షూటింగ్ గణనీయమైన దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మరో ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్న ప్రభాస్, ఆ షెడ్యూల్ పూర్తైన తర్వాత స్పిరిట్ నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొననున్నారని సమాచారం. సినిమా రిలీజ్ విషయంలోనూ మార్పులు ఉండొచ్చనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. మొత్తంగా చూస్తే రాజా సాబ్ తర్వాత వచ్చిన ఫీడ్‌బ్యాక్ ప్రభాస్ యాక్షన్ సినిమాల విషయంలో మరింత ఫోకస్ పెట్టడానికి కారణమైందా? లేక స్పిరిట్ కథ, సందీప్ రెడ్డి వంగా విజన్‌లో భాగంగానే ఈ ఫిజికల్ కమిట్‌మెంట్ తీసుకున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది.