మంచు లక్ష్మి యాసను ఆటపట్టించిన బన్ని కూతురు
ఐకాన్ స్టార్ కూతురు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముద్దు ముద్దు మాటలతో అర్హ ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది.;
ఐకాన్ స్టార్ కూతురు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముద్దు ముద్దు మాటలతో అర్హ ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. అంతేకాకుండా అర్హ సెలబ్రిటీల కూరుతు అయినపట్టికీ ఆమెకు ఇంట్లో తెలుగు ఎక్కువగా నేర్పించారు. అందుకే బయట ఏ ప్రోగ్రామ్ కు హాజరైనా అర్హ తెలుగులోనే మాట్లాడుతుంది.
అయితే బుజ్జి అర్హ.. ఎప్పట్నుంచో తెలుగు నటి, నిర్మాత మంచు లక్ష్మిని ఓ ప్రశ్న అడగాలనుకుంటుందట. అదేంటో కాదు లక్ష్మి తెలుగు యాసపై. అవును, మంచు లక్ష్మి బాల్యం, విద్యాభ్యాసం ఎక్కువగా ఫారిన్ లోనే జరిగేసరికి ఆమెకు ఇంగ్లీష్ పే ఉన్న పట్టు తెలుగు భాష పై లేదు. అందుకే ఆమె తెలుగు యాస కాస్త ఇంగ్లీష్ యాక్సెంట్ గా ఉంటుంది. ఆమె తెలుగుపై సోషల్ మీడియాలోనూ అనేక ట్రోల్స్ వచ్చాయి.
ఇదే ప్రశ్నను అర్హ అడగాలనుకుంది. అయితే తాజాగా మంచు లక్ష్మి.. అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. అక్కడ అర్హను కలిసిన లక్ష్మి చిన్నారితో ముద్దు ముద్దుగా మాట్లాడారు. కాసేపు ఇద్దరూ మచ్చటింటారు. ఈ క్రమంలోనే లక్ష్మి.. నువ్వు నన్ను ఏదో అడగాలని అన్నావంట. ఏంటది అని అర్హతో అన్నారు. దీనికి అర్హ.. మీరు తెలుగేనా, మీ యాస అలా ఉంది ఎందుకు అని నవ్వుతూ అడిగింది.
దీనికి లక్ష్మి తెలుగులోనే మాట్లాడుతున్నా కదా పాప, నీకెందుకు ఆ డౌట్ వచ్చింది అంటూ సమాధానం ఇచ్చింది. ఇదంతా పక్కనే ఉన్న బన్నీ వీడియో తీస్తున్నారు. ఈ ఫన్నీ సంభాషణ వీడియోను ఆయన సతీమణి స్నేహా రెడ్డి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. లక్ష్మిని నెటిజన్లు అడగాలనున్న ప్రశ్న అర్హ అడిగిందంటూ వీడియో కింద కామెంట్లు వస్తున్నాయి.
కాగా, గతంలోనూ అర్హ బాలయ్య అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ లో తెలుగులో మాట్లాడి ఆకట్టుకుంటుంది. కేవలం మాట్లాడడమే కాదు తెలుగు టఫ్ తెలుగు పద్యం 'అటజని కాంచె భూమిసురు డంబర' పద్యాన్ని ఈజీగా పాడి వినిపించింది. ఆమె పర్ఫెక్ట్ గా తెలుగులో పద్యం చెప్పడంతో బాలయ్యతో సహా, ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు.