మగధీర, జానీ.. అల్లు బాస్ ఎందుకు గెస్ చేయలేదు?

టాలీవుడ్‌ లో ఎన్నో బ్లాక్‌బస్టర్లు, మరెన్నో డిజాస్టర్లు చూసిన నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. దశాబ్దాల అనుభవం ఉన్న నిర్మాతగా ప్రేక్షకుల టేస్ట్ అంచనా వేయడం అంత ఈజీ కాదని ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారి తీశాయి.

Update: 2026-05-25 10:39 GMT

టాలీవుడ్‌ లో ఎన్నో బ్లాక్‌బస్టర్లు, మరెన్నో డిజాస్టర్లు చూసిన నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. దశాబ్దాల అనుభవం ఉన్న నిర్మాతగా ప్రేక్షకుల టేస్ట్ అంచనా వేయడం అంత ఈజీ కాదని ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా తన కెరీర్‌ లో అత్యంత ఆశ్చర్యపరిచిన సినిమాలుగా మగధీర, జానీ పేర్లు చెప్పడం ఇప్పుడు మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌ గా మారింది.

ఒకవైపు భారీ విజయంతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన సినిమా.. మరోవైపు ప్రేక్షకులు పూర్తిగా రిజెక్ట్ చేసిన చిత్రం. ఆ రెండు సినిమాల ఫలితాలు తన అంచనాలకు పూర్తిగా భిన్నంగా వచ్చాయని అల్లు అరవింద్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. మగధీర గురించి మాట్లాడిన అల్లు అరవింద్.. ఆ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టామని, నిజం చెప్పాలంటే నష్టాలకు కూడా సిద్ధమయ్యామని తెలిపారు.

కానీ విడుదల తర్వాత ప్రేక్షకుల స్పందన చూసి షాక్ అయ్యామని,. అంత పెద్ద హిట్ అవుతుందని అస్సలు ఊహించలేదని తెలిపారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో తొలి రూ.100 కోట్ల గ్రాసర్‌గా నిలిచింది. హీరోగా రామ్ చరణ్ కెరీర్‌ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. మగధీర విషయంలో పాజిటివ్ షాక్ ఎదురైతే.. జానీ మాత్రం పూర్తిగా నెగిటివ్ సర్ప్రైజ్ ఇచ్చిందని అల్లు అరవింద్ తెలిపారు.

పవన్ కళ్యాణ్ కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందన్నారు. 'సినిమా షూటింగ్ మధ్యలో మేమిద్దరం ఫలితంపై అనుమానం వ్యక్తం చేశాం. కానీ అప్పటికే వెనక్కి తిరిగే పరిస్థితి లేదు. రషెస్ చూసిన తర్వాత కూడా ఇది పనిచేయకపోవచ్చనే భావన కలిగింది' అని ఆయన ఓపెన్‌ గా చెప్పారు. 2003లో విడుదలైన జానీకి కథ, దర్శకత్వం రెండింటినీ పవన్ స్వయంగా నిర్వహించారు.

మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌ డ్రాప్‌ లో తెరకెక్కిన ఆ ఎమోషనల్ డ్రామాపై అప్పట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే విడుదల తర్వాత విమర్శకుల నుంచే కాకుండా ప్రేక్షకుల నుంచి కూడా తీవ్ర నిరాశే ఎదురైంది. అల్లు అరవింద్ వ్యాఖ్యల్లో కనిపించిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రేక్షకుల తీర్పును ముందుగానే అంచనా వేయడం అసాధ్యమనే భావన.

'ప్రేక్షకులను ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. వాళ్ళు ఎప్పుడు ఎలా స్పందిస్తారో ఎవరూ చెప్పలేరు' అన్న ఆయన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఫార్ములాలు, స్టార్‌ డమ్, భారీ బడ్జెట్ అన్నీ ఉన్నా.. చివరికి ప్రేక్షకుడి కనెక్షన్‌ నే విజయం నిర్ణయిస్తుందని ఆ రెండు సినిమాల ఉదాహరణలు మరోసారి నిరూపించాయని సినీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఒకటి ఇండస్ట్రీ హిట్‌గా చరిత్ర సృష్టిస్తే.. మరొకటి స్టార్ హీరో ఇమేజ్ ఉన్నా బాక్సాఫీస్ వద్ద నిలవలేకపోయింది. అందుకే కావచ్చు.. ఎన్నో విజయాలు చూసిన అల్లు అరవింద్‌ కు కూడా మగధీర, జానీ ఇప్పటికీ జీవితంలోనే అతిపెద్ద సర్ప్రైజ్‌ లుగా మిగిలిపోయాయి.

Tags:    

Similar News