'ఇప్పుడు లవ్ స్టోరీలన్నీ OYOలోనే'.. అల్లు బాస్ అలా అన్నారేంటి?

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన ఫన్నీ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

Update: 2026-06-11 18:37 GMT

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన ఫన్నీ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా విడుదలకు సిద్ధమవుతున్న దీవాన సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆయన చేసిన కామెంట్స్ ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా నెట్టింట వైరల్ అయ్యాయి. AAA సినిమాస్‌ లో నిర్వహించిన ఆ కార్యక్రమానికి హీరో విశ్వక్ సేన్, నిర్మాత అల్లు అరవింద్ గెస్టులుగా హాజరయ్యారు.

వన్ సైడ్ లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందిన దీవాన సినిమా గురించి మాట్లాడుతున్న సమయంలో ప్రేమ కథల ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్, "సార్.. మీ ఫస్ట్ వన్ సైడ్ లవ్ స్టోరీ చెప్పండి" అంటూ అల్లు అరవింద్‌ ను ప్రశ్నించారు. దీనికి స్పందించిన అల్లు అరవింద్ మొదట "ఒకటా.. రెండా?" అంటూ నవ్వులు పూయించారు. అనంతరం వన్ సైడ్ లవ్ గురించి మాట్లాడుతూనే ప్రెజెంట్ జనరేషన్ లవ్ మ్యాటర్స్ పై తనదైన శైలిలో కామెంట్ చేశారు.

"ఇప్పుడు లవ్ అంటే థియేటర్‌ లో కార్నర్ సీట్లలో కూర్చోవడం, తర్వాత షాపింగ్‌ కు వెళ్లడం, చివరకు ఓయో రూమ్‌ లో ఎండ్ అవుతోంది" అని అన్నారు. ఆయన కామెంట్స్ తో ఈవెంట్ లో నవ్వులు పూశాయి. అల్లు అరవింద్ చేసిన ఆ కామెంట్స్ పై విశ్వక్ సేన్ కూడా సరదాగా స్పందించారు. ఓయో అంటే తనకు తెలియనట్లు నటించగా, "ఇంతగా నవ్వుతున్నారంటే నీకు తెలియదా?" అంటూ అల్లు అరవింద్ చమత్కరించారు. ఇద్దరి మధ్య జరిగిన ఫన్నీ కన్వర్జేషన్ అట్రాక్షన్ గా నిలిచింది.

అయితే ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అల్లు అరవింద్ సరదాగా చేసిన కామెంట్లుగానే తీసుకుంటుండగా, మరికొందరు ప్రస్తుత యూత్ లవ్ మ్యాటర్స్ ను ఆయన ఫన్నీగా చెప్పారని అభిప్రాయపడుతున్నారు. అదే విషయంపై దీవాన దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి కూడా స్పందించారు. తన దృష్టి ప్రేమకు డెఫినషన్ ఎప్పుడూ మారదని ఆయన అభిప్రాయపడ్డారు.

మనుషులు ఉన్నంత కాలం ఎమోషన్స్ ఉంటాయని, ప్రేమ అనేది వ్యక్తుల ఆలోచనలను బట్టి మారుతుందని చెప్పారు. "ఓయోలో ముగిసే ప్రేమ కూడా ప్రేమే. లస్ట్ కూడా ప్రేమే. ఒకరినొకరు ఇష్టపడటం, కోరుకోవడం కూడా ప్రేమలో భాగమే. అయితే ఎవరినీ బాధపెట్టకుండా ఉంటే అదే ముఖ్యమైన విషయం" అని అన్నారు. అలా దీవాన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ లో జరిగిన ఫన్నీ కన్వర్జేషన్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.

ముఖ్యంగా అల్లు అరవింద్ చేసిన "లవ్ ఓయోలో ఎండ్ అవుతోంది" అనే కామెంట్ సోషల్ మీడియాలో ఫుల్ షేర్ అవుతోంది. ఒకవైపు నవ్వులు పంచుతూ, మరోవైపు ప్రజెంట్ జనరేషన్ లవ్ మ్యాటర్స్ పై చర్చకు కూడా కారణమవుతోంది. ఇక హర్షిత్ రెడ్డి, స్నేహ మణిమేగలై జంటగా నటించిన దీవాన చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి తెరకెక్కించారు. వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి సంయుక్తంగా నిర్మించిన ఆ చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ట్రైలర్‌ కు మంచి రెస్పాన్స్ వస్తుండగా, మూవీ రిజల్ట్ పై టీమ్ నమ్మకంతో ఉంది.




Tags:    

Similar News