వాటి వ‌ల్లే బెట‌ర్ యాక్టర్ అయ్యా

సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకున్న అల్ల‌రి న‌రేష్, ర‌విబాబు డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌య‌మైన అల్ల‌రి సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు.;

Update: 2025-11-20 13:30 GMT

సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకున్న అల్ల‌రి న‌రేష్, ర‌విబాబు డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌య‌మైన అల్ల‌రి సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు. కామెడీ అంటే ఇలా కూడా ఉంటుందా అని ఆ మూవీ ప్రూవ్ చేసింది. అల్ల‌రి మూవీ నుంచి న‌రేష్ ఎక్కువ‌గా కామెడీకి ప్రాధాన్య‌త ఉన్న సినిమాలే చేసుకుంటూ వ‌చ్చారు. ఒక త‌రుణంలో అల్ల‌రి న‌రేష్ సినిమా అంటే ఎంతోమంది ఫ్యామిలీ ఆడియ‌న్స్ ఏమీ ఆలోచించ‌కుండా థియేట‌ర్ల‌కు వెళ్లేవాళ్లు.

ఎన్నో ప్ర‌యోగాలు చేసిన న‌రేష్

అల్ల‌రి న‌రేష్ మూవీకి వెళ్తే కాసేపు హ్యాపీగా న‌వ్వుకోవ‌చ్చనే ఆలోచ‌న‌తో ఉండేవాళ్లు ఆడియ‌న్స్ ఆ టైమ్ లో. మంచి కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న అల్ల‌రి న‌రేష్, రీసెంట్ గా చేసిన కామెంట్స్ అత‌న్ని వార్త‌ల్లో నిలిపాయి. తాను చేసిన సినిమాల్లో హిట్ల కంటే ఫ్లాపుల‌నే త‌న‌ను ఎక్కువ‌గా సొంతం చేసుకున్నాన‌ని అల్ల‌రి న‌రేష్ చెప్పారు. అల్ల‌రి న‌రేష్ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎన్నో కొత్త ప్ర‌యోగాలు చేస్తూ వ‌చ్చారు.

థ్రిల్ల‌ర్ మూవీతో రానున్న న‌రేష్

మొద‌ట్లో ఎక్కువగా కామెడీ సినిమాలు చేసిన అల్ల‌రి న‌రేష్ మ‌ధ్య‌లో క‌థా ప్రాధాన్యమున్న సినిమాలు కూడా చేశారు. ఆ త‌ర్వాత నాంది లాంటి సీరియ‌స్ సినిమాలు తీసి మంచి స‌క్సెస్ ను అందుకున్న న‌రేష్ ఇప్పుడు ఓ థ్రిల్ల‌ర్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. 12A రైల్వే కాల‌నీ సినిమా ప్ర‌మోష‌న్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న న‌రేష్ ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

త‌న కెరీర్లో ఎత్తూప‌ల్లాల‌ను చూసిన న‌రేష్, ఫ్లాపుల వ‌ల్ల తాను ఎన్నో నేర్చుకున్నానని, త‌న‌ను ఇంకా బెట‌ర్ యాక్ట‌ర్ గా తీర్చిదిద్దింది ఆ ఫ్లాపులేన‌ని పేర్కొన్నారు. ఇక 12A రైల్వే కాల‌నీ విష‌యానికొస్తే ఈ సినిమాతో నాని కాస‌ర‌గ‌డ్డ డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌యం కాబోతున్నారు. అనిల్ విశ్వ‌నాథ్ షో రన్న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ సినిమా న‌వంబ‌ర్ 21న రానుండ‌గా, ఇప్ప‌టికే రిలీజైన ట్రైల‌ర్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతోంది.

Tags:    

Similar News