యూఎస్ బాక్సాఫీస్: నరేష్ సినిమాకు బిగ్ టాస్క్

ఈ వారం బాక్సాఫీస్ బరిలో నిలిచిన సినిమాల లిస్ట్ చూస్తే ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది.;

Update: 2025-11-20 04:30 GMT

ఈ వారం బాక్సాఫీస్ బరిలో నిలిచిన సినిమాల లిస్ట్ చూస్తే ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇండస్ట్రీలో పెద్దగా అనుభవం లేని హీరోలు, చిన్న బడ్జెట్ సినిమాలు కూడా సగర్వంగా అమెరికా ఫ్లైట్ ఎక్కేస్తుంటే.. మినిమమ్ గ్యారెంటీ హీరో అని పేరున్న అల్లరి నరేష్ సినిమా మాత్రం లోకల్ థియేటర్లకే పరిమితమైంది. 'ప్రేమంటే', 'రాజు వెడ్స్ రాంబాయి' లాంటి చిన్న చిత్రాలు ఓవర్సీస్ ఆడియన్స్ ను పలకరిస్తుంటే, నరేష్ నటించిన '12 ఏ రైల్వే కాలనీ' అక్కడ రిలీజ్ అప్డేట్ ఇంకా రాకపోవడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

'12 ఏ రైల్వే కాలనీ'కి కూడా మొదట్లో ఒక బయ్యర్ వచ్చి, కొంత అడ్వాన్స్ ఇచ్చి రిలీజ్ చేస్తానని ముందుకొచ్చారట. కానీ నిర్మాత ఆ సమయంలో ఆ ఆఫర్ కి ఒప్పుకోలేదు. తమ సినిమా రేంజ్ కి ఆ అమౌంట్ తక్కువని భావించి, ఇంకా పెద్ద ఆఫర్ వస్తుందేమో అని వెయిట్ చేశారు. 

'12 ఏ రైల్వే కాలనీ' సినిమాకు అమెరికాలో రిలీజ్ అప్డేట్ ఇంకా లేకపోవడం అనేది ప్రస్తుతానికి ఒక మైనస్ పాయింట్ లా అనిపించొచ్చు. కానీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒక మాట వినిపిస్తుంటుంది.. కంటెంట్ గట్టిగా ఉంటే, బయ్యర్లు వెతుక్కుంటూ ఇంటికి వస్తారు అని. ఇప్పుడు అల్లరి నరేష్ సినిమా విషయంలో కూడా ఇదే జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు 'బ్లాక్ బస్టర్' టాక్ వస్తే, ఆటోమేటిక్ గా సీన్ మారిపోతుంది.

అల్లరి నరేష్ కెరీర్ ని గమనిస్తే, 'నాంది' సినిమాతో ఒక స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు పర్వాలేదనిపించినా, బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆ రేంజ్ ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. సీరియస్ ఇమేజ్ వైపు టర్న్ తీసుకున్నాక, నరేష్ కు ఒక భారీ కమర్షియల్ హిట్ చాలా అవసరం. ఇప్పుడు ఈ సినిమాతో ఆ లోటు తీరాల్సిందే.

ఇక్కడ హిట్ టాక్ వస్తే, అమెరికా బయ్యర్లు క్యూ కట్టడం ఖాయం. అప్పుడు నిర్మాత అడిగిన రేటు ఇవ్వడానికి కూడా వెనుకాడరు. ఎందుకంటే ఓవర్సీస్ ఆడియన్స్ ఎప్పుడూ మౌత్ టాక్ ని నమ్ముతారు. రివ్యూలు బాగుండి, సోషల్ మీడియాలో పాజిటివ్ బజ్ వస్తే, లేట్ గా రిలీజ్ అయినా అక్కడ కలెక్షన్స్ వస్తాయి. కాబట్టి ముందు ఇక్కడ జెండా పాతడం అనేది ఈ సినిమాకు ఇప్పుడు మ్యాండేటరీ టాస్క్.

ఇక ఈ సినిమా బిజినెస్ లెక్కల విషయానికి వస్తే, ఇండస్ట్రీలో ఆసక్తికరమైన టాక్ నడుస్తోంది. ఈ సినిమాకు దాదాపు రూ. 14 కోట్ల వరకు బడ్జెట్ అయిందని అంటున్నారు. అందులో నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా దాదాపు రూ. 8 కోట్ల వరకు రికవరీ అయ్యిందని సమాచారం. అంటే ఇంకా దాదాపు 6 కోట్ల వరకు నిర్మాత సేఫ్ జోన్ లోకి రావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని థియేట్రికల్ రన్ ద్వారానే రాబట్టాలి.

Tags:    

Similar News