#కేన్స్ 2025.. ఆలియా ఆలస్యానికి కారణం?
కేన్స్ 2025 ఉత్సవాలు ఈనెల 13న ఘనంగా ప్రారంభం కాగా, రెండు వారాల పాటు సందడి సాగనుంది.. ఈ ఉత్సవాలకు ఐశ్వర్యారాయ్ తో పాటు ఆలియా భట్ అటెండ్ కావాల్సి ఉంది;
కేన్స్ 2025 ఉత్సవాలు ఈనెల 13న ఘనంగా ప్రారంభం కాగా, రెండు వారాల పాటు సందడి సాగనుంది.. ఈ ఉత్సవాలకు ఐశ్వర్యారాయ్ తో పాటు ఆలియా భట్ అటెండ్ కావాల్సి ఉంది. కానీ ఆలియా తన మొదటి కేన్స్ పర్యటనను రద్దు చేసుకోవడం చర్చనీయాంశమైంది.
భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల దృష్ట్యా అలియా భట్ 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి హాజరు కాలేదని కథనాలొస్తున్నాయి. మే 13న జరిగిన ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ఆలియా నిర్ణయించుకుంది. అయితే అంతకుముందు ఉన్న ఉద్రిక్తల దృష్ట్యా కేన్స్ వేడుకలకు హాజరు కాకూడదని ఆలియా నిర్ణయించుకుంది. కానీ గత శనివారం ఇరు దేశాల అధినేతలు కాల్పుల విరమణ ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం అనంతరం ఆలియా తిరిగి కేన్స్ కు చేరుకునే అవకాశం ఉందని తెలిసింది.
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటి అలియా ప్రఖ్యాత లోరియల్ రాయబారిగా కేన్స్ ఫెస్టివల్‌కు హాజరవుతోంది. ఈ ఉత్సవం మే 24 వరకు కొనసాగుతుంది. ఇదే చోట జాన్వీ కపూర్, ఊర్వశి రౌతేలా లాంటి భామలు కూడా సందడి చేస్తుండడం ఆసక్తికరం. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత సైన్యం పాకిస్తాన్ పై యుద్ధంలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ తర్వాత మంగళవారం ఆలియా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో సైనికులకు నివాళులు అర్పించారు.
ఆలియా నటిస్తున్న స్పై మూవీ ఆల్ఫా విడుదల కావాల్సి ఉంది. ఇందులో శార్వరి కూడా నటిస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ లవ్ & వార్‌లోను ఆలియా నటిస్తోంది. ఇందులో రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.