• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాలీవుడ్ లో ఫేమ‌స్ ...

టాలీవుడ్ లో ఫేమ‌స్ బాలీవుడ్ భామ‌లు ఇద్ద‌రేనా?

| టాలీవుడ్‌లో నటించేందుకు పలువురు బాలీవుడ్ హీరోయిన్లు ఆసక్తి చూపుతున్నా, తెలుగు మేకర్స్ మాత్రం ఆలియా భట్, దీపికా పదుకొణె పేర్లనే పరిశీలిస్తున్నట్లు కథనం. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆలియా, ‘కల్కి’ తర్వాత దీపికకు వచ్చిన పలు భారీ ఆఫర్లు డేట్స్, ఇతర షరతుల కారణంగా వదులుకున్నారనే ప్రచారం ఉంది. మరోవైపు ‘వారణాసి’ కోసం ప్రియాంక చోప్రాను ఒప్పించేందుకు రాజమౌళి ప్రత్యేకంగా ప్రయత్నించారు.

By - Srikanth Kontham
Update: 2026-11-20 17:19 GMT

బాలీవుడ్ భామ‌లంతా తెలుగు ఛాన్స్ దొరికితే చాలు అని క్యూ కడుతుంటే? తెలుగు మేకర్స్ మనసు మాత్రం ఆలియా భట్, దీపికా పదుకొణె చుట్టూనే తిరుగుతోంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? అందివచ్చిన ఆ భారీ తెలుగు అవకాశాలను కూడా ఇద్దరు భామలు వరుసగా వదులుకోవ‌డం ఇంట్రెస్టింగ్. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించేందుకు ఉత్తరాది భామలు ఎంతగా తహతహలాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

జాన్వీ కపూర్, కియారా అద్వానీ, మృణాల్ ఠాకూర్ నుంచి కొత్తగా వస్తున్న తృప్తి డిమ్రీ వరకు అంతా టాలీవుడ్ ప్రాజెక్టుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడి మార్కెట్, రెమ్యునరేషన్, పాన్ ఇండియా గుర్తింపు కోసం ఎగబడుతున్నారు. కానీ టాలీవుడ్ అగ్ర దర్శకులు..బడా నిర్మాణ సంస్థలు మాత్రం ఏ భారీ ప్రాజెక్ట్ మొదలుపెట్టినా ముందుగా ఆలియా ..దీపిక పేర్లనే పరిశీలిస్తున్నారు.

ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్ల తీరు చూస్తుంటే తెలుగు సినిమాలపై పెద్దగా ఆసక్తి లేనట్టే కనిపిస్తోంది. ఆలియా భట్ గతంలో `ఆర్ఆర్ఆర్` సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసిన తర్వాత పలు భారీ తెలుగు ఆఫర్లు వచ్చినా డేట్స్ సర్దుబాటు కావడం లేద‌ని సున్నితంగా తిరస్కరించారు. ప్రభాస్ `కల్కి`లో నటించిన దీపికా పదుకొణె సైతం ఆ తర్వాత వచ్చిన క్రేజీ ప్రాజెక్టులను పక్కన పెట్టేశారు. ముఖ్యంగా `స్పిరిట్` లాంటి భారీ సినిమాతో పాటు మరికొన్ని పెద్ద ఆఫర్లు వ‌చ్చినా? పని వేళల నిబంధనలు, భారీ పారితోషికం, ఇతర షరతుల కారణంగా వదులుకున్నారనే ప్రచారం గట్టిగా జరిగింది.

అయినా తెలుగు నిర్మాతలు మాత్రం ఆ ఇద్దరి వెనుకే పరుగులు తీయడం గమనార్హం. నార్త్ బెల్ట్‌లో ఆలియా దీపికలకు ఉన్న క్రేజ్, బ్రాండ్ వాల్యూ సినిమాలకు బిజినెస్ పరంగా కలిసొస్తుందనేది మేకర్స్ ఆలోచన. ఈ నేప‌థ్యంలోనే ఎన్నిసార్లు నో చెప్పినా? మళ్లీ కొత్త కథలతో సంప్రదించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వచ్చిన అవకాశాలను సైతం అంత సులువుగా కాదంటున్నారంటే? ప్రస్తుతం వారి డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కెతోన్న `వార‌ణాసి` లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈప్రాజెక్ట్ కోసం రాజ‌మౌళి పీసీని ఒప్పించ‌డం కోసం చాలా శ్ర‌మించాల్సి వచ్చింది. 120 దేశాల్లో రిలీజ్ అవుతున్న సినిమా కాబ‌ట్టి పీసీ లాంటి గ్లోబ‌ల్ బ్యూటీ అయితేనే మార్కెట్ ప‌రంగా క‌లిసొస్తుంద‌నే ఉద్దేశంతో జ‌క్క‌న్న ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. అయినా ఈ సినిమా త‌ర్వాత పీసీ తెలుగులో కంటున్యూ అయ్యే అవ‌కాశాలు లేవు. అమ్మ‌డి దృష్టంతా హాలీవుడ్ పైనే ఉంది. అయితే వార‌ణాసి కోసం బాలీవుడ్ ఛాన్సులు సైతం ప‌క్క‌న‌బెట్టి ప‌నిచేయ‌డం విశేషం.

Tags:    
  • aliabhatt 
  • deepikapadukone 
  • tollywood 
  • priyankachopra 

Similar News

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

ఒక్క లుక్ తో నిద్ర లేకుండా చేస్తున్న నిధి అగర్వాల్!

2026-11-20 17:30 GMT

టాలీవుడ్‌కు వీళ్లే సరిపోతారా!

2026-11-20 17:29 GMT

2027లో క్రేజీ సీక్వెల్స్..ద‌డ పుట్టిచేదెవ‌రు?

2026-11-20 17:28 GMT

100లో 90ఫ్లాపులు.. 100 కోట్ల పారితోషికం..ఈ రెండిటి మ‌ధ్యా చెడి బ‌య్య‌రు-ప్రేక్ష‌కుడే బ‌లి!

2026-11-20 17:26 GMT

బ్లాక్ అవుట్ ఫిట్ లో సెగలు పుట్టిస్తున్న శ్రియా శరణ్!

2026-11-20 17:26 GMT

బాలీవుడ్ లో ఎప్పటికీ ఆ ప్రేమ దొరకదు: సమీరా రెడ్డి

2026-11-20 17:24 GMT

హైందవ మూవీ వాయిదా పడనుందా?

2026-11-20 17:22 GMT

మెగావర్స్‌లో ఊహించని కాంబినేషన్స్!

2026-11-20 17:22 GMT

తెలుగు రాష్ట్రాల రాజ‌ధానులు 'గ్లోబ‌ల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ హ‌బ్' అవ్వాలంటే?

2026-11-20 17:21 GMT

Copyright @2026

Powered by Blink CMS