• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హైందవ మూవీ వాయిదా...

హైందవ మూవీ వాయిదా పడనుందా?

| బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న ‘హైందవ’ విడుదల వాయిదా పడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నవంబర్ 27న విడుదల కావాల్సిన ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరికి మార్చాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అదే రోజు ‘మైసా’, ‘నాన్నకుట్టి’, ‘భోగి’ చిత్రాలు విడుదలవుతుండటంతో థియేటర్ల సమస్య, బాక్సాఫీస్ పోటీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు టాక్. అయితే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

By - Madhu Reddy
Update: 2026-11-20 17:22 GMT

ఈ మధ్యకాలంలో సినిమా అనుకున్న తేదీకి వస్తుందా అంటే దాదాపు చెప్పలేని పరిస్థితి. కొంతమంది హీరోలు ఎలాగైనా సరే తామ ప్రకటించిన తేదీకి ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకురావాలని కష్టపడుతుంటే.. మరికొంతమంది ఎంత కష్టపడినా ఆ సమయానికి విడుదల చేయలేక సినిమాను వాయిదా వేస్తూ ఉంటారు. ఇప్పటికే పలు చిత్రాలు అలా వాయిదా పడి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో కొన్ని మంచి విజయాన్ని అందుకుంటే.. ఇంకొన్ని ఘోర పరాభవాన్ని చవిచూశాయి. ఇదిలా ఉండగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'హైందవ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు . పైగా వివాహం తర్వాత ఆయన నటిస్తున్న తొలి చిత్రం కూడా ఇదే కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

పైగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండడంతో.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి ఆమె లక్ కలిసి వస్తుందని, ఖచ్చితంగా ఈ సినిమా మంచి విజయం అందుకుంటుందని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఈ సినిమాను నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారు. అందులో భాగంగానే ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా గట్టిగా నిర్వహించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీ విషయంలో చిత్ర బృందం ఆలోచనలో పడినట్లు సమాచారం. పైగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఇకపోతే అనుకున్న సమయానికి ఈ సినిమాను తీసుకురావడానికి ప్రమోషన్స్ కూడా పెద్ద ఎత్తున చేపట్టి.. సడన్గా విడుదల తేదీని వాయిదా వేయడం వెనుక అసలు కారణం ఏమిటి? అనే విషయానికి వస్తే.. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉండడమే కారణం అని వార్తలు వినిపిస్తున్నాయి. అదే రోజున రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన 'మైసా' చిత్రంతో పాటు విజయ్ ఆంటోనీ 'నాన్నకుట్టి', అలాగే శర్వానంద్ హీరోగా నటిస్తున్న 'భోగి' సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. ఇన్ని సినిమాలు మంచి కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు కావడంతో థియేటర్ దగ్గర ఇబ్బందులు వస్తాయని, అందుకే థియేటర్ల విషయంలో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఈ చిత్రాన్ని వాయిదా వేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.

అయితే మేకర్స్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ తాజాగా ఈ మూవీ పై వస్తున్న ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. హైందవ సినిమా విషయానికి వస్తే.. సుధీర్ రెడ్డి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మిస్టికల్ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. గెటప్ శ్రీను, శుభలేఖ సుధాకర్ , జేడీ చక్రవర్తి, మహేష్ మంజ్రేకర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు మరి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడుతోంది అంటూ వస్తున్న వార్తలపై చిత్ర బృందం స్పందించి ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Tags:    
  • haindava 
  • bellamkondasaisreenivas 
  • samyukthamenon 

Similar News

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

ఒక్క లుక్ తో నిద్ర లేకుండా చేస్తున్న నిధి అగర్వాల్!

2026-11-20 17:30 GMT

టాలీవుడ్‌కు వీళ్లే సరిపోతారా!

2026-11-20 17:29 GMT

2027లో క్రేజీ సీక్వెల్స్..ద‌డ పుట్టిచేదెవ‌రు?

2026-11-20 17:28 GMT

100లో 90ఫ్లాపులు.. 100 కోట్ల పారితోషికం..ఈ రెండిటి మ‌ధ్యా చెడి బ‌య్య‌రు-ప్రేక్ష‌కుడే బ‌లి!

2026-11-20 17:26 GMT

బ్లాక్ అవుట్ ఫిట్ లో సెగలు పుట్టిస్తున్న శ్రియా శరణ్!

2026-11-20 17:26 GMT

బాలీవుడ్ లో ఎప్పటికీ ఆ ప్రేమ దొరకదు: సమీరా రెడ్డి

2026-11-20 17:24 GMT

మెగావర్స్‌లో ఊహించని కాంబినేషన్స్!

2026-11-20 17:22 GMT

తెలుగు రాష్ట్రాల రాజ‌ధానులు 'గ్లోబ‌ల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ హ‌బ్' అవ్వాలంటే?

2026-11-20 17:21 GMT

Copyright @2026

Powered by Blink CMS