ఆట పేరుతో బుక్కయిపోయిన ఆలియా
ప్రస్తుతం ఈ ఇంట్రెస్టింగ్ క్లిప్ అంతర్జాలంలో వైరల్ అవుతోంది. వీడియో క్లిప్ చూడగానే ఆలియా భట్‌పై నెటిజనులు విరుచుకుపడుతున్నారు.;
ఒకరితో ప్రేమలో ఉన్నాడని తెలిసీ ఆ యువకుడిని ప్రేమిస్తానని, అతడినే ఇష్టపడతానని అంటే దాని అర్థం ఏమిటి? నైతికంగా తప్పుడు ప్రవర్తనగానే దీనిని భావిస్తారు. అయితే సిగ్గు విడిచి అలాంటి పనికి తాను సిద్ధమేనని ఒప్పుకుంది ఆలియా భట్. టూమచ్ విత్ ట్వింకిల్ అండ్ కాజోల్ షోలో `మీరు ఇష్టపడతారా?` అనే విచిత్రమైన విభాగంలో ఆలియా భట్ తన గుట్టును దాచుకోకుండా బయటపెట్టేసింది.
ప్రస్తుతం ఈ ఇంట్రెస్టింగ్ క్లిప్ అంతర్జాలంలో వైరల్ అవుతోంది. వీడియో క్లిప్ చూడగానే ఆలియా భట్‌పై నెటిజనులు విరుచుకుపడుతున్నారు. గేమ్ షోలో ఆలియా వ్యాఖ్యానిస్తూ, తన స్నేహితురాలి మాజీతో ప్రేమలో పడతాను అనే ఆప్షన్ ని ఎంచుకుంది. ఇది నిజంగా కత్రినను మోసం చేయడమేనని కూడా జనం కామెంట్ చేస్తున్నారు.
ఆ సమయంలో కాజోల్, వరుణ్ అందరూ ఆశ్చర్యపోయారు. గతంలో కత్రినతో రణబీర్ రిలేషన్ షిప్ లో ఉన్న సమయంలోనే ఆలియాతోను అతడు డేటింగ్ చేసాడనే పుకార్లు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఆలియా కారణంగానే రణబీర్ తన ప్రియురాలు కత్రిన నుంచి విడిపోయాడు! అనే అర్థం వచ్చేలా వ్యవహారం కనబడటంతో నెటిజనులు ఆలియాపై విరుచుకుపడుతున్నారు. ఆలియా కారణంగానే రణబీర్ తన ప్రేయసి కత్రినను మోసం చేసాడా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలే ఆలియా కారణంగానే ఇలా జరిగిందని అప్పట్లో పుకార్లు ఉన్నాయి.. వాటిని ఇంకా ప్రజలు మర్చిపోకపోయినా, ఇప్పుడు ఆలియా నోరు జారడం కొంప ముంచింది. చాక్లెట్ బోయ్ పై ఎంత క్రష్ ఉన్నా, అలా చేయడం సరికాదని సూచిస్తున్నారు. పైగా అవును అని సిగ్గు లేకుండా చెబుతుందా! అంటూ కొందరు సూటిగా విరుచుకుపడుతున్నారు.