• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్ హీరో కొడుకు సెకండ్...

స్టార్ హీరో కొడుకు సెకండ్ హ్యాండ్ బ‌ట్ట‌లు కొంటాడు!

| ముఖ్యంగా ఈ కుటుంబ హీరోల సింప్లిసిటీ స్వ‌భావంపై అభిమానుల్లో ఎప్పుడూ ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మ‌వుతుంది.

By - Tupaki Desk
Update: 2024-05-22 02:45 GMT

మెగా కుటుంబంలో యువ‌హీరోలు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. మెగాస్టార్ చిరంజీవిలోని క్ర‌మ‌శిక్ష‌ణ‌, నిబ‌ద్ధ‌త‌, హార్డ్ వ‌ర్క్ వారిలో కూడా క‌నిపిస్తుంది. ముఖ్యంగా ఈ కుటుంబ హీరోల సింప్లిసిటీ స్వ‌భావంపై అభిమానుల్లో ఎప్పుడూ ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మ‌వుతుంది. ఇది చిరు వారికి నేర్పిన ఆద‌ర్శ‌వంత‌మైన‌ గుణం. బాలీవుడ్ లో అలాంటి ఒక హీరో ఖిలాడీ అక్ష‌య్ కుమార్. అత‌డు ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ అంత‌గా ఒదిగి ఉంటాడు. ప్ర‌తి ఒక్క‌రినీ గౌర‌వించే విధానం, రిసీవ్ చేసుకునే త‌త్వం, సింప్లిసిటీ అత‌డిని అంద‌రివాడిని చేసింది. ఇప్పుడు అత‌డి వార‌సుడు కూడా త‌న‌నే అనుస‌రిస్తున్నాడు. సింప్లిసిటీ ఈజ్ ది బెస్ట్ అనేది వారి త‌త్వం.

'ధావన్ కరేంగే' పేరుతో కొత్త సెలబ్రిటీ షోకి క్రికెటర్ శిఖర్ ధావన్ హోస్ట్‌గా మారాడు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ టాక్ షోకి హాజరైన మొదటి సెలబ్రిటీ. ఈ షోలో అక్ష‌య్ తన కుమారుడు ఆరవ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్ల‌డించారు. త‌న కొడుకు నటనపై ఆసక్తి చూపడం లేదని అక్షయ్ వెల్లడించాడు. అక్షయ్ కుమార్ మాట్లాడుతూ-''నేను, ట్వింకిల్ ఆరవ్‌ని పెంచిన విధానం నాకు సంతోషంగా ఉంది. అతడు చాలా సాధారణ అబ్బాయి.. మేము అతడిని ఏదో చేయమని ఎప్పుడూ బలవంతం చేయలేదు. తనకు సినిమాల్లో భాగం కావాలని లేదు. అతడి ఆసక్తి ఫ్యాషన్‌పై ఉంది'' అని అన్నారు. తన వృత్తిపరమైన కెరీర్‌కు సంబంధించి ఆరవ్ నిర్ణయాన్ని అక్షయ్ కుమార్ స్వాగతించారు. ఆరవ్ ఇప్పుడు బాధ్యతాయుతమైన వ్యక్తిగా మారారని అన్నారు.

ఆరవ్ 15 సంవత్సరాల వయస్సులో లండన్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి ఇంటిని విడిచిపెట్టి వెళ్లాడు. అతడు వెళ్లాలని నేను కోరుకోలేదు. కానీ నేను అతడిని ఆపలేదు ఎందుకంటే నేను కూడా 14 సంవత్సరాల వయస్సులో ఇంటి నుండి వెళ్లాను. అతడు ఇంటి పనులన్నీ స్వయంగా చేస్తాడు. ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చినప్పటికీ అతడు ఖరీదైన బట్టలు కొనడు.. సెకండ్ హ్యాండ్ బట్టలు విక్రయించే థ్రిఫ్టీ అనే దుకాణానికి వెళ్తాడు. డ‌బ్బును వృధా చేయడం తనకు ఇష్టం లేదని కూడా అక్ష‌య్ చెప్పారు. అక్ష‌య్ ఒక ఆర్మీ అధికారి కుమారుడు. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో పెరిగాడు. డ‌బ్బు విలువ తెలిసిన‌వాడు. పైగా మ‌ధ్య‌త‌ర‌గ‌తి నుంచి ఎదిగిన వాడిగా విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉంటాడు.

Tags:    
  • Bollywood 
  • AkshayKumar 
  • Aarav 
  • DhawanKarenge 
  • ShikharDhawan 
  • UniversityofLondon 

Similar News

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

Copyright @2026

Powered by Blink CMS