పాత్ర భ‌యంతో ప‌డ‌క గ‌ది షేర్ చేసుకోని భార్య‌!

నటన అంటే కెమెరా ముందు రంగులు వేసుకోవడం మాత్రమే కాదు. కొన్నిసార్లు అది నటుడి ఆత్మను.. వారి వ్యక్తిత్వాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

Update: 2026-06-15 22:30 GMT

నటన అంటే కెమెరా ముందు రంగులు వేసుకోవడం మాత్రమే కాదు. కొన్నిసార్లు అది నటుడి ఆత్మను.. వారి వ్యక్తిత్వాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా సైకోపాత్ .. విలన్ పాత్రలు పోషించేటప్పుడు నటులు ఆ పాత్రల్లో ఎంతగా లీనమైపోతారంటే? ఆ నలుపుదనం వారిని షూటింగ్ ముగిసిన తర్వాత కూడా వెంటాడుతుంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఓబెరాయ్ ఇటీవల పంచుకున్న విషయాలు వృత్తిపరమైన సవాళ్లను ఎలా ప్రతిబిం బిస్తున్నాయన్న‌ది పంచుకున్నారు. నటుడిగా విలక్షణ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న వివేక్ వెండితెరపై.. ఓటీటీలో భయంకరమైన పాత్రలను పోషించినప్పుడు ఎదురయ్యే మానసిక ఒత్తిడి గురించి మాట్లాడారు.

అక్షయ్ ఓబెరాయ్ కెరీర్‌లో అత్యంత ప్రభావవంతమైన - సవాలుతో కూడిన పాత్రల్లో `ఫ్లెష్` వెబ్ సిరీస్‌లోని హ్యూమన్ ట్రాఫికింగ్ కింగ్‌పిన్ తాజ్ పాత్ర ఒకటి. మానవ అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌లో ఆయన అత్యంత క్రూరమైన, రాక్షసత్వంతో కూడిన నైజం ఉన్న వ్యక్తిగా కనిపించారు. ఈ పాత్ర కోసం అక్షయ్ శారీరకంగా, మానసికంగా ఎంతో కష్టపడ్డారు. ఆ పాత్రలో ఉన్న క్రూరత్వాన్ని తెరపై పండించడానికి ఆయన చేసిన ప్రయత్నం ఎంతగా సఫలమైందంటే? చూసే ప్రేక్షకులతో పాటు కుటుంబ సభ్యుల్లో కూడా ఒక రకమైన భయాన్ని కలిగించింది.

ఈ పాత్ర తీవ్రత ఎంతవరకు వెళ్ళిందంటే? ఫ్లెష్ సిరీస్ చూసిన తర్వాత అక్షయ్ భార్య ఆయనతో పడకగదిని పంచుకోవడానికి కూడా నిరాకరించిందని స్వయంగా వెల్లడించారు. తెరపై ఆయన ప్రదర్శించిన క్రూరత్వం ఆమెను ఎంతగానో కలచివేసిందని.. తన భర్తలోనే ఇంతటి భయంకరమైన నటుడు ఉన్నాడా? అనే భయం ఆమెలో కలిగిందని పేర్కొన్నారు. ఒక నటుడికి లభించే అతిపెద్ద ప్రశంస ఇదే అయినా? వ్యక్తిగత జీవితంలో ఇలాంటి ప్రతిచర్యలు ఎదురైనప్పుడు అది వింతైన ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తుంది.

మెథడ్ యాక్టింగ్ పాత్రల్లో పూర్తిగా మునిగిపోవడం వల్ల నటులు ఆయా క్యారెక్టర్ల మానసిక స్థితిని తమ నిజ జీవితంలోకి కూడా తీసుకువచ్చే ప్రమాదం ఉంది. షూటింగ్ సమయంలో రోజంతా నెగెటివ్ ఆలోచనలు, క్రూరమైన ప్రవర్తనను ప్రదర్శించడం వల్ల, ప్యాకప్ చెప్పిన తర్వాత కూడా సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది. అక్షయ్ ఓబెరాయ్ విషయంలో కూడా ఇదే జరిగింది. భార్య ఇచ్చిన ఆ స్పందన తనకు నటుడిగా సంతోషాన్ని ఇచ్చినప్పటికీ ఆ పాత్ర నుండి బయటపడి మళ్లీ సాధారణ భర్తగా, తండ్రిగా మారడం ఎంత కష్టంతో కూడుకున్నదో వివరించారు.

ఇలాంటి సవాలుతో కూడిన పాత్రలను సమర్థవంతంగా పోషించడం వల్లే అక్షయ్ ఓబెరాయ్‌కు పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానం లభించింది. ప్ర‌స్తుతం ఆయన షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ చిత్రం `కింగ్` లో కీలక పాత్ర పోషిస్తున్నారు. నెగెటివ్ .. వైవిధ్యమైన పాత్రల్లో అద్భుతమైన నటనను కనబరిచే నటులకు కమర్షియల్ చిత్రాలలో అవకాశాలు రావడం వారి ప్రతిభకు నిదర్శనం. ఫ్లెష్ వంటి ప్రాజెక్టుల నుండి కింగ్ వంటి ప్రతిష్టాత్మక చిత్రాల వరకు ఆయన సాగించిన ప్రయాణం యువ నటులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

Tags:    

Similar News