2026 లో ఆ నాలుగేనా? ఇంకేవైనా ప్లాన్ చేసారా?

అత్యంత వేగంగా సినిమాలు పూర్తి చేసి రిలీజ్ చేసే బాలీవుడ్ హీరో ఎవ‌రు? అంటే కిలాడీ అక్షయ్ కుమార్ మాత్ర‌మే.

Update: 2026-05-12 22:30 GMT

అత్యంత వేగంగా సినిమాలు పూర్తి చేసి రిలీజ్ చేసే బాలీవుడ్ హీరో ఎవ‌రు? అంటే కిలాడీ అక్షయ్ కుమార్ మాత్ర‌మే. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా రిలీజ్ చేయ‌డం అక్ష‌య్ ప్రత్యేక‌త‌. గ‌త ఏడాది ఐదారు రిలీజ్ ల‌తో ఆక‌ట్టుకున్న అక్ష‌య్ కుమార్ ఈ ఏడాది కూడా అదే స్పీడ్ కొన‌సాగిస్తున్నారు. తాజాగా సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనీస్ బజ్మీతో కలిసి చేస్తున్న కొత్త చిత్రం విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. ఈ భారీ ప్రాజెక్టును డిసెంబర్ 4 2026న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

అక్షయ్ కుమార్- అనీస్ బజ్మీ కాంబినేషన్‌లో గతంలో రిలీజ్ అయిన‌`వెల్కమ్`, `సింగ్ ఈజ్ కింగ్` వంటి చిత్రాలు మంచి ఫ‌లితాలు సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కొత్త సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్షయ్ కుమార్ కెరీర్ గ్రాఫ్‌ను గమనిస్తే 2026 సంవత్సరం ఆయనకు అత్యంత కీలకంగా మార నుంది. డిసెంబర్‌లో విడుదలయ్యే ఈ చిత్రం ఆ ఏడాది అక్షయ్ నుండి రాబోతున్న నాలుగో సినిమా కావడం విశేషం. విభిన్న జోనర్లలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే అక్ష‌య్ ఏడాది చివర్లో భారీ కమర్షియల్ ఎంటర్టైనర్‌తో థియేటర్లకు రాబోతుండటం విశేషం.

ప్రస్తుతం అనీస్ బజ్మీ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. కామెడీ - ఫ్యామిలీ ఎంటర్టైనర్లను తెరకెక్కించడంలో ఆయనది ప్రత్యేకమైన శైలి. అక్షయ్ కుమార్‌లోని టైమింగ్‌ను సరిగ్గా వాడుకోగల దర్శకుల్లో అనీస్ ఒకరు. ఇద్ద‌రి కలయికలో రాబోతున్న చిత్రం భారీ బడ్జెట్ యాక్షన్ కామెడీ డ్రామాగా ఉండబోతోందని సమాచారం. చాలా కాలం తర్వాత ఈ క్రేజీ కాంబో సెట్స్ మీదకు వెళ్తుండటంతో బాలీవుడ్ వర్గాల్లో పాజిటివ్ వైబ్స్ కనిపి స్తున్నాయి. అక్షయ్ కుమార్‌కు ఉన్న మాస్ ఇమేజ్ - అనీస్ బజ్మీ మార్క్ వినోదం తోడైతే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న అక్షయ్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా డేట్లు కేటాయించారట. అక్షయ్ కుమార్ పని చేసే వేగం మాత్రం అందరినీ ఆశ్చ ర్యపరుస్తుంది. ఒకే సంవత్సరంలో నాలుగు సినిమాలు విడుదల చేయడం అనేది ఏ స్టార్ హీరోకైనా సవాలుతో కూడుకున్న పని. కానీ అక్షయ్ మాత్రం పక్కా ప్రణాళికతో షూటింగ్‌లను పూర్తి చేస్తూ నిర్మాతలకు భారం కాకుండా ముందు కెళ్తున్నారు. అనీస్ బజ్మీ సినిమాతో 2026 ఏడాదిని ఘనంగా ముగిం చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మ‌రి ఇవి గాకుండా అక్ష‌య్ కమిట్ అయిన చిత్రాలు ఇంకేవైనా ఉన్నాయా? అన్న‌ది కూడా తెలియాల్సి ఉంది.




Tags:    

Similar News